S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/08/2017 - 08:49

విజయవాడ (క్రైం)/ఎల్‌బినగర్, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖాధికారులకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన అధికారిని ఏపి ఏసిబి సెంట్రల్ ఇన్విస్టిగేషన్ టీము అరెస్టు చేసింది.

01/07/2017 - 05:24

హైదరాబాద్, జనవరి 6: గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ లాబీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. అనంతరం ఇద్దరూ ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు.

01/07/2017 - 02:47

కొత్తగూడెం, జనవరి 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఐఎన్‌టియుసి ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. స్థానిక ఉర్దుఘర్‌లో శుక్రవారం జరిగిన ఐఎన్‌టియుసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల సాధనే ఐఎన్‌టియుసి లక్ష్యమన్నారు.

01/07/2017 - 02:27

తిరుపతి, జనవరి 6: తిరుమల శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవ టిక్కెట్లను ఏప్రిల్ నెలకు గాను దాదాపు 51వేల టిక్కెట్లును ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్టు టిటిడి ఇఓ సాంబశివరావు చెప్పారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో డయల్‌యువర్ ఇఓ కార్యక్రమం జరిగింది. అంతకుముందు ఆయన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

01/07/2017 - 02:25

అమరావతి, జనవరి 6: జాతీయ పార్టీగా మారిన తెలుగుదేశంలో ఇప్పుడు ప్రాంతీయ పంచాయితీకి తెరలేచింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపి తెదేపా సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఆంధ్రులకు కోట్లు, తెలంగాణ వారికి లక్షలు ఇస్తున్నారని, తెలంగాణకు సంబంధం లేని పివి సింధుకు రూ.

01/07/2017 - 01:06

హైదరాబాద్, జనవరి 6: ఒంటరి స్ర్తిలకు జీవనభృతి కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు శుక్రవారం ఈ విషయాన్ని శాసనసభలో ప్రకటించారు. ఒంటరిగా ఉంటున్న మహిళకు ప్రతి నెలా వెయ్యి రూపాయిలు జీవన భృతి పథకం అమలు చేస్తామని శాసనసభలో ప్రత్యేక ప్రకటన చేశారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించారు.

01/07/2017 - 01:05

హైదరాబాద్, జనవరి 6: పారిశ్రామిక అభివృద్ధిపై సమగ్ర విధానం అమలు చేస్తామని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సిఎం కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈమేరకు ఆయన శుక్రవారం శాసనసభలో ప్రకటన చేస్తూ, పారిశ్రామిక ప్రగతిపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.

01/07/2017 - 00:59

హైదరాబాద్, జనవరి 6: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను మరింత మెరుగుపర్చేందుకు బడ్జెట్ సమావేశాల్లోనే చట్టంలో మార్పుచేర్పులు చేపట్టనున్నట్టు షెడ్యూల్ కులాల అభివృద్ధి మంత్రి జి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శాసనసభలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై జరిగిన లఘు చర్చలో విపక్ష సభ్యుల విమర్శలు, సూచనలు, సలహాలకు మంత్రి సమాధానమిచ్చారు.

01/07/2017 - 00:44

శ్రీకాకుళం, జనవరి 6: ఉద్దానం కిడ్నీరోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పింఛన్లు మంజూరు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఆ ప్రాంతంలో కిడ్నీ మహమ్మారి బారినపడిన గ్రామాలన్నీంటినీ మానవతా సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని ప్రకటించారు. వ్యాధి తీవ్రతనుబట్టి వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయలు బాధితులకు నెలవారీ పింఛన్ అందించి ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

01/07/2017 - 00:42

మడకశిర, జనవరి 6: ఈ-పాస్ కష్టాలు జనాన్ని వెంటాడుతున్నాయి. సిగ్నల్స్ సరిగా రాకపోవడంతో నిత్యావసరాల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రేషన్‌దుకాణాల ముందు జనం పడిగాపులు కాయాల్సివస్తోంది.

Pages