S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/19/2016 - 03:02

విజయవాడ, ఏప్రిల్ 18: ‘రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వడదెబ్బకు జనం చనిపోతున్నారు. మరోపక్క మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. మంచినీటి వసతికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సుమారు 200 కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యలను పరిష్కరించనున్నట్టు చెప్పారు. సోమవారం ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. మంచినీటి సమస్యపై విపులంగా చర్చించారు.

04/19/2016 - 02:29

విజయవాడ, ఏప్రిల్ 18: విజయవాడలో సోమవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు సిఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. పార్టీని సమన్వయ పర్చుకోవడంతోపాటు శాఖల పనితీరును బట్టి ఈ ర్యాంకులిచ్చారు. ఒక ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడికి 79వ ర్యాంక్ రావడం గమనార్హం. గనులు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతకు మొదటి ర్యాంకు లభించింది.

04/19/2016 - 02:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్టుగా ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం కనిపించడం లేదు.

04/19/2016 - 02:20

తిరుపతి, ఏప్రిల్ 18: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గోల్డ్ మానిటైజేషన్ పథకంలో తిరుమల శ్రీవారి బంగారం కూడా భాగస్వామ్యం అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేంకటేశ్వరస్వామి వారికి చెందిన 1311 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి. సాంబశివరావు సోమవారం తెలిపారు.

04/19/2016 - 02:16

విశాఖపట్నం, ఏప్రిల్ 18: ‘వైకాపా తరపున గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఎన్నికలకు వెళ్దాం..నీ పాలనకు వారి గెలుపోటములే రెఫరెండం. నేను రెడీ.. నీకు సమ్మతమేనా’ అంటూ విపక్ష నేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు.

04/19/2016 - 02:13

విజయవాడ/కాకినాడ, ఏప్రిల్ 18: తొలిసారిగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం 10 గంటలకు విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

04/19/2016 - 02:10

విజయవాడ, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత కోసం నియమితులైన పోలీస్ సిబ్బంది విజయవాడలో నరకయాతన అనుభవిస్తున్నారు. సిఎం బసను విజయవాడకు మార్చిన తరువాత భద్రతకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది నియామకం జరగకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విజయవాడలో పోలీసు విధులంటే భయపడే స్థితికి సిబ్బంది వచ్చేశారంటే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు.

04/19/2016 - 02:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో భేటి అయ్యారు. పునర్య్వవస్థీకరణ చట్టం అమలుపై ఆయన రాష్టప్రతితో చర్చించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలలో పార్టీ ఫిరాయింపులు, శాసనసభ స్థానాల పెంపువంటి అంశాల గురించి కూడా రాష్టప్రతికి గవర్నర్ వివరించినట్టు తెలిసింది.

04/19/2016 - 01:50

హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని బిజెపి నూతన సారథిగా నియమితులైన డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితితో తమకు ఎటువంటి వైత్రి ఉండబోదని ఆయన చెప్పారు. బిజెపి అధ్యక్షునిగా తనను నియమించినందుకు ఆయన ఇటీవల ఢిల్లీకి వెళ్ళి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్‌షాను, ఇతర ముఖ్య నేతలను కలిసి కృతజ్ఞతలు తెలిపి సోమవారం సాయంత్రం తిరిగి వచ్చారు.

04/19/2016 - 01:44

హైదరాబాద్, ఏప్రిల్ 18: విద్యాసంస్థల ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించడంతో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలన్నీ ఏకమై బంద్ హెచ్చరికలు జారీ చేశాయి.

Pages