S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/31/2016 - 03:48

రాజమహేంద్రవరం, డిసెంబర్ 30: రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ ఎస్ ఎస్) సంఘ్ ద్వితీయ సర్ సంచాలకులు కొత్తపల్లి ఘనశ్యామ్ ప్రసాద్ (85) అస్వస్థతతో గురువారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన స్వస్థలం రాజమహేంద్రవరంలో శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు.

12/31/2016 - 03:45

హైదరాబాద్, డిసెంబర్ 30: ఇక డాక్టర్ కావాలంటే మెడిసిన్ పాసయితే చాలదు...జాతీయ నిష్క్రమణ పరీక్ష ( నెక్స్ట్) పాస్ కావాలి. మెడికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అనేక మార్పులు, చేర్పులకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

12/31/2016 - 03:44

హైదరాబాద్, డిసెంబర్ 30: ఇంటర్మీడియట్ లేకున్నా నేరుగా డిగ్రీలో చేరేందుకు బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ తెలంగాణ, ఆంధ్రా రాష్ట్ర విద్యార్ధులకు అవకాశం కల్పిస్తోంది. కేవలం 17 ఏళ్ల వయస్సు నిండిని వారు ఎలాంటి విద్యార్హతలు లేకున్నా నేరుగా డిగ్రీలో చేరేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది.

12/31/2016 - 04:10

చిత్రం..సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో శుక్రవారం ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు, సిఎం కె చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి, మంత్రులు, వివిధ పార్టీల ప్రముఖులు.

12/31/2016 - 02:25

హైదరాబాద్, డిసెంబర్ 30: అసెంబ్లీ సమావేశాలను జనవరి 11 వరకు పొడిగిస్తూ శుక్రవారం జరిగిన బిఏసి సమావేశంలో నిర్ణయించారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత స్పీకర్ బిఏసి సమావేశం నిర్వహించారు. ఈమేరకు జనవరి 7, 8 తేదీలు వినా 11 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.

12/31/2016 - 01:29

విజయవాడ (రైల్వేస్టేషన్), డిసెంబర్ 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందాల మధ్య నూతన ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు అన్నారు. ఆయన వీడియో లింక్ రిమోట్ సిస్టం ద్వారా శనివారం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

12/31/2016 - 01:20

ఏలూరు, డిసెంబర్ 30: నూటయాభై ఏళ్ల నాటి కాటన్ కల సాకారమవుతున్న శుభవేళ ఇది. దశాబ్దాలుగా వాయిదాల మయంగా సాగిన పోల‘వరం’ ఎట్టకేలకు ఆంధ్రావనికి దక్కింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ బృహత్తర ప్రాజెక్టు నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం కావటంతో ఓ చారిత్రక శకం అంకురించినట్టయింది.

12/30/2016 - 05:12

హైదరాబాద్, డిసెంబర్ 29: యాష్ చోప్రా జాతీయ స్మారక అవార్డును బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు ఇవ్వనున్నట్లు టిఎస్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన ముంబాయిలో జెడబ్ల్యు మారియట్ హోటల్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

12/30/2016 - 05:59

భద్రాచలం, డిసెంబర్ 29: శ్రీరామ దివ్యక్షేత్రం ముక్కోటి శోభను సంతరించుకుంది. నేటి నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అధ్యయనోత్సవాల్లోని పగల్‌పత్ ఉత్సవాల్లో భాగంగా రామయ్య దశావతారాల్లో భక్తులను సాక్షాత్కరించనున్నారు.

12/30/2016 - 02:06

హైదరాబాద్, డిసెంబర్ 29: రాజకీయ నేతలతో గ్యాంగ్‌స్టర్ నరుూంకు సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ హైకోర్టుకు గురువారం అఫిడవిట్ సమర్పించింది. నరుూంను అడ్డుపెట్టుకుని రాజకీయ నాయకులు ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లుగా ఎలాంటి రుజువులు లభించలేదని హోంశాఖ స్పష్టం చేసింది.

Pages