S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/30/2016 - 02:22

మేడ్చల్, డిసెంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురం మాజీ ఎంపి, మాజీ ఐఎఎస్ అధికారి కెఎస్‌ఆర్ మూర్తి(81) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామ పరిధిలో గల అంథమ్ విల్లాస్‌లో మూర్తి పార్థివదేహానికి గ్రామస్థులతో పాటు పలువురు అధికారులు నివాళులు అర్పించారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కూడా కొంత కాలం క్రీయాశీలకంగా వ్యవహరించారు.

12/30/2016 - 05:06

హైదరాబాద్, డిసెంబర్ 29: తిరుమలలో లడ్డూల తయారీలో వినియోగించే శనగపప్పును నేరుగా మిల్లర్లనుంచే సేకరించాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం సబబేనంటూ హైకోర్టు సమర్థించింది. టిటిడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మెసర్స్ రాజేష్ కార్పొరేషన్, నారాయణ్ ట్రేడింగ్ కార్పొరేషన్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గతంలో తమ వద్ద నుంచి శనగపప్పును టిటిడి సేకరించేదని పిటిషనర్లు పేర్కొన్నారు.

12/30/2016 - 01:57

హైదరాబాద్, డిసెంబర్ 29:గోదావరి నదిపై మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ చేపట్టిన ప్రతిష్ఠాత్మక వంతెన శుక్రవారం ప్రారంభం కానుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద తెలంగాణలోని కాళేశ్వరం- మహారాష్టల్రోని సిరోంచి మధ్య రూ.292 కోట్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెన నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేయగా, మహారాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్మాణం పూర్తయింది.

12/29/2016 - 06:44

తిరుపతి, డిసెంబర్ 28: నూతన సంవత్సరంలో ప్రపంచ మానవాళికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా అందాలని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. రాష్టప్రతి బుధవారం మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్టప్రతి వెంట ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాష్టమ్రంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నారాయణ తదితరులు ఉన్నారు.

12/28/2016 - 03:52

హైదరాబాద్, డిసెంబర్ 27: రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్ధం మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహాన్ విందు ఇచ్చారు. విందులో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు హాజరయ్యారు. కెసిఆర్ చంద్రబాబు, బండారు దత్తాత్రేయ కొద్దిసేపు నోట్ల రద్దు అంశంపై పిచ్చాపాటిగా ముచ్చటించుకున్నారు.

12/28/2016 - 02:24

హైదరాబాద్, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో పని చేస్తున్న ఉద్యోగులను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించే ప్రక్రియను వచ్చే మూడు నెలల్లో ముగించాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

12/28/2016 - 02:19

హైదరాబాద్, డిసెంబర్ 27: ‘ముఖ్యమంత్రి ఇంట్లో 150 గదులు ఉన్నాయా? ఉంటే చూపిస్తావా? ఇంత పేలవంగా సభలో మాట్లాడితే ఎలా? ఇంత అన్యాయంగా, భావదారిద్రంగా మాట్లాడటమా? ఇంటి పనుల్లో పని చేసిన కూలోడ్ని అడిగినా ఎన్ని గదులు ఉన్నాయో చెబుతడు కదా’ అని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డిపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

12/28/2016 - 02:11

హైదరాబాద్, డిసెంబర్ 27: హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కరుడుగట్టిన నేరస్థుడు అయూబ్‌ఖాన్ 72 కేసుల్లో నిందితుడని సౌత్‌జోన్ డిసిపి వి సత్యనారాయణ తెలిపారు. గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్‌ను ముంబయిలో అరెస్టు చేసి సోమవారం రాత్రి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం హైదరాబాద్ పురానీ హవేలిలోని సౌత్‌జోన్ డిసిపి కార్యాలయంలో అయూబ్‌ఖాన్‌ను దక్షిణ మండల డిసిపి సత్యనారాయణ మీడియా ముందు ప్రవేశపెట్టారు.

12/28/2016 - 02:09

హైదరాబాద్, డిసెంబర్ 27: రెండున్నరేళ్ల వ్యవధిలో 2.60 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రభుత్వం కట్టిస్తే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ చేయకుండా, టిఆర్‌ఎస్‌కు మద్దతిస్తుందని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాసనసభలో సవాల్ విసిరారు. ఈ ప్రకటనను తాను వ్యక్తిగతంగా చేయడం లేదని పిసిసి అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాతే చేస్తున్నానని స్పష్టం చేశారు.

12/28/2016 - 02:01

హైదరాబాద్, డిసెంబర్ 27: బలహీన వర్గాల కోసం నిర్మించిన ఇళ్లకు గతంలో తీసుకున్న 3,920 కోట్ల రూపాయల రుణ బకాయిలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేసి ఆ తర్వాత రాజీవ్ గృహకల్ప రుణాలను కూడా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శాసనసభలో మంగళవారం బలహీన వర్గాల గృహ నిర్మాణం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై జరిగిన లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు.

Pages