S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/28/2016 - 02:20

హైదరాబాద్, డిసెంబర్ 27: రాష్ట్రంలో నీటి వనరులను సమర్ధంగా నిర్వహించేందుకు ఉత్తమ భౌగోళిక విధానాలను అమలు చేసేందుకు ఇస్రో, రిమోట్ సెన్సిం గ్ ఏజన్సీతో అవగాహన ఒప్పందం ఖరారు చేసినట్లు భారీ సాగునీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్ రావు తెలిపారు.

12/28/2016 - 02:03

అమలాపురం, డిసెంబర్ 27: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపాడు రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ గ్రామాలు కానున్నాయి. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌ను గురువారంనాడు సిఎం చంద్రబాబు ఈ గ్రామాల్లో ప్రారంభించనున్నారు. నిన్నమొన్నటి వరకూ ఈ గ్రామాల గురించి తెలిసినవారు తక్కువమంది మాత్రమే.

12/27/2016 - 04:31

తిరుపతి, డిసెంబర్ 26: శాతవాహన వంశానికి చెందిన 23వ చక్రవర్తిగా బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం తెలుగుజాతి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేస్తూ వెయ్యి రోజులకు పైగా ఆడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఉత్సవం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ క్రీడామైదానం వేదికగా సోమవారం జరిగింది.

12/27/2016 - 03:13

హైదరాబాద్, డిసెంబర్ 26: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే యశ్వంత్‌పూర్-విశాఖపట్నం మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ నెం. 06579 యశ్వంత్‌పూర్-విశాఖపట్నం వీక్లి తత్కాల్ ప్రత్యేక రైలు జనవరి 6,13,20,27 తేదీల్లో సా.గం. 18:35లకు బయలు దేరి మరుసటి రోజు మ.గం. 14:35లకు విశాఖ పట్నం చేరుతుందని అధికారులు తెలిపారు.

12/27/2016 - 03:42

విజయవాడ, డిసెంబర్ 26: రాంగోపాల్ వర్మ.. వివాదాల పుట్ట. ఇటీవల ఆయన తీసిన ‘వంగవీటి’ సినిమా అనుటున్నట్లుగానే వివాదాస్పదమయింది. వంగవీటి రంగా కుటుంబంపై అభ్యంతరకర దృశ్యాలు చిత్రీకరించారంటూ రంగా తనయుడైన మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ తాజాగా మీడియాకెక్కి, డిజిపికి సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా తన తండ్రి రంగా వర్ధంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాధా సినిమా దర్శక, నిర్మాత వర్మపై కారాలు, మిరియాలు నూరారు.

12/27/2016 - 02:48

హైదరాబాద్, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌కు రానున్న రోజుల్లో అదనంగా బస్సులను నడుపుతామని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు, లారీల రవాణాకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన వెల్లడించారు.

12/27/2016 - 02:37

హైదరాబాద్, డిసెంబర్ 26:హైదరాబాద్ పాతబస్తీకి చెందిన కరడుగట్టిన రౌడీషీటర్ అయూబ్‌ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గతంలో పోలీస్ కాల్పుల్లో గాయపడిన అయూబ్‌ఖాన్ పదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. కాగా ఆదివారం సాయంత్రం ముంబయి శివార్లలో మహారాష్ట్ర పోలీసులు ఆదివారం సాయంత్రం అతనిని అదుపులోకి తీసుకుని తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

12/26/2016 - 02:18

విశాఖపట్నం (కల్చరల్), డిసెంబర్ 25: శక్తివంతమైన, శాంతి పూరితమైన భవిష్య భారతావని తీర్చిదిద్దడమే అందరి ముందున్న కర్తవ్యమని ఆధ్యాత్మిక గురువు భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. విశాఖలో ఆదివారం జరిగిన అర్చక సదస్సులో ఆయన మాట్లాడారు. మనిషి హృదయం లబ్‌డబ్‌మంటూ స్పందించిన విధంగానే భారత మాత ప్రేమ, శాంతి కోసం తపిస్తోందన్నారు.

12/26/2016 - 01:54

హైదరాబాద్, డిసెంబర్ 25: ఉద్యోగ నియామకాల్లో జోనల్ విధానాన్ని రద్దు చేయడం తగదని, దీని వల్ల తీవ్రపరిణామాలు తలెత్తుతాయని కాంగ్రెస్, టిడిపి,సిపిఐ, తెలంగాణ జాక్ హెచ్చరించాయి. టిడిపి ఎమ్మెల్యే, జాతీయ బిసి సంక్షేమ సంఘం చైర్మన్ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, ఉద్యోగ నియామకాల్లో జోనల్ విధానం రద్దు చేయడం తగదని, దీని వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్ధులకు అన్యాయం జరుగుతుందన్నారు.

12/26/2016 - 01:50

హైదరాబాద్, డిసెంబర్ 25: మద్యం షాపులు జాతీయ రహదారులకు 500 మీటర్లలోపు ఉండరాదన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మద్యం సిండికేట్లు, ప్రభుత్వ అధికారులు విలవిలలాడుతున్నారు. రెండు రాష్ట్రాల మద్యం ఆదాయంపై గంపెడాశను పెట్టుకుని జనరంజక పథకాలను అమలు చేస్తున్న విషయం విదితమే. ఆంధ్రాలో డిసెంబర్ నెలాఖరుతో పాతమద్యం పాలసీ ముగుస్తుంది.

Pages