S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/23/2016 - 04:41

హైదరాబాద్, డిసెంబర్ 22: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థ సాయంతో దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిన ఎనిమిది మంది ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులపైన నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఇక్కడి ఎన్‌ఐఏ కోర్టులో గురువారం చార్జిషీటును దాఖలు చేసింది.

12/23/2016 - 02:09

కరీంనగర్, డిసెంబర్ 22: అత్యాచారం, హత్య కేసులో కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అభం శుభం తెలియని మూ డున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టి అనంతరం హత్య చేసిన కామాంధుడు జక్కుల వెంకటస్వామి (30)కి గురువారం సాయంత్రం కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బి.సురేష్ ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు.

12/23/2016 - 01:34

సంగారెడ్డి, డిసెంబర్ 22:ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి, నరసన్నపేటల్లో డబుల్ బెడ్‌రూమ్స్ ప్రారంభోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో శుక్రవారం తెల్లవారుజామున లబ్ధిదారులు సామూహిక గృహ ప్రవేశం చేయనున్నారు. గృహ ప్రవేశాల అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతానికి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు.

12/23/2016 - 01:30

హైదరాబాద్, డిసెంబర్ 22:హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై 13 ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్లను (శాటిలైట్ టౌన్‌షిప్)లను అభివృద్ధి చేయనున్నట్టు మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఈ 13 శాటిలైట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధికి 13,998 కోట్ల రూపాయలు వ్యయమవుతుందన్నారు.

12/23/2016 - 01:22

చిత్రం..గురువారం హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్న గవర్నర్ నరసింహన్, శాలువాతో సత్కరించి, స్వాగతం పలుకుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ

12/23/2016 - 01:19

అమరావతి, డిసెంబర్ 22: రెయిన్‌గన్ల నిర్వహణకు, పట్టణ సుందరీకరణ, లాండ్‌స్కేపింగ్‌కు రెండు ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సరైన నిర్వహణ లేకపోతే ఏ యంత్ర పరికరమైనా త్వరగా దెబ్బతింటుందని, అందువల్ల రెయిన్‌గన్ల పర్యవేక్షణకు వీలుగా త్వరలో ఒక సంస్థను ఏర్పాటుచేసి దానికో కార్యనిర్వహణాధికారిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

12/23/2016 - 01:13

చిత్రం..నగదు రహిత లావాదేవీల్లో భాగంగా విజయవాడలో
గురువారం కార్డులతో సరుకులు కొనుగోలు చేస్తున్న మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు

12/23/2016 - 01:10

విజయవాడ, డిసెంబర్ 22: జపాన్‌లో పరిశోధనలకు ఉపకరిస్తున్న అత్యాధునిక స్థాయి రాడార్ వ్యవస్థను అమరావతిలో నెలకొల్పడానికి ఆ దేశానికి చెందిన సుమితోమో కార్పొరేషన్‌లోని తోషిబా గ్రూపు ముందుకొచ్చింది. గురువారం అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్, మేనేంగ్ డైరెక్టర్ లక్ష్మీపార్థసారథిని జపాన్ బృందం అధికారులు కేదారేశ్వరపేటలోని లోటస్ ల్యాండ్ మార్క్‌లోని విడిది కార్యాలయంలో కలిశారు.

12/22/2016 - 08:22

కర్నూలు, డిసెంబర్ 21: పెద్దనోట్ల రద్దు తరువాత ఆన్‌లైన్ సేవలకు సామాన్యులు ఇంకా అలవాటు పడకపోయినా జూదరులు మాత్రం ఈ సేవలను అందిపుచ్చుకుని దర్జాగా పేకాడేస్తున్నారు. పేకాట, మట్కా ఆడేవారు తాము పందెంలో కాయాల్సిన నగదును మొబైల్ అప్లికేషన్ల ద్వారా బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

12/22/2016 - 07:04

హైదరాబాద్, డిసెంబర్ 21: పార్టీలకు అతీతంగా అందరితో కలుపుగోలుగా కలిసిపోయే ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లా టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి బుధవారం తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో హల్‌చల్ సృష్టించారు. ఆయన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో కొంత సేపు ముచ్చటించారు. ‘రాష్ట్ర విభజన వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాలకు తీరని అన్యాయం జరిగింది. విభజన సమయంలో మా రెండు జిల్లాలను కలుపుకోవాలని కోరాం.

Pages