S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/22/2016 - 07:04

హైదరాబాద్, డిసెంబర్ 21: భారతదేశం అభివృద్ధికోసం పాటుపడుతున్న త్యాగధనులను ఆదర్శంగా తీసుకుని వారు చూపిన బాటలో పయనించాలని తెలంగాణ, ఎపి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని టివోలి గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డ్స్-2016’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

12/21/2016 - 05:34

కొత్తగూడెం, డిసెంబర్ 20: సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. 18 ఏళ్ల తరువాత మళ్లీ వారసత్వ ఉద్యోగావకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ఆ సంస్థ చైర్మన్ అండ్ ఎండి ఎన్ శ్రీ్ధర్ మంగళవారం ప్రకటించారు.

12/21/2016 - 05:37

హైదరాబాద్, డిసెంబర్ 20: దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్ల కేసులో రెండో నేరగాడు, సూత్రధారి రియాజ్ సోదరుడైన యాసిన్ భత్కల్ దొరకడం వల్లనే ఈ కేసు విచారణ తొందరగా ముగిసింది. యాసిన్ ఇంటరాగేషన్ వల్ల ఈ కేసులోని ఒక్కో అంశం ఒక్కొక్కటిగా విడిపోతూ వ చ్చింది. ఈ భత్కల్‌ను పట్టుకోవటానికి ఇంటెలిజెన్స్ బ్యూ రో, బీహార్ పోలీసులు ఆరు నెలల పాటు అహర్నిశలు కష్టపడ్డారు.

12/21/2016 - 05:26

హైదరాబాద్, డిసెంబర్ 20: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులోని ఐదుగురు దోషులు, దేశవ్యాప్తంగా మరో 12 పేలుళ్ల కేసుల్లో కూడా వీరు నిందితులు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురు అసదుల్లా అఖ్తర్, తహసీన్ అఖ్తర్, వక్వాస్, యాసిన్ భత్కల్, ఎజాజ్ షేక్‌కు ఈనెల 19న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

12/21/2016 - 02:49

హైదరాబాద్, డిసెంబర్ 20: హైదరాబాద్‌లో ఉన్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం ప్రజా ఆస్తులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిల్ కేసులో పిటిషనర్ ఒక లక్ష రూపాయలను కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు సమయం వృథా అయ్యే విధంగా ఈ తరహా పిటిషన్లు దాఖలు చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

12/21/2016 - 01:59

హైదరాబాద్, డిసెంబర్ 20: మిషన్ భగీరథ పథకం నీళ్ల కోసం పైపుల్లా కాకుండా, పైపుల కోసం నీళ్లన్నట్టుగా మారిందని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. మిషన్ కాకతీయ పథకానికి లెస్ టెండర్లు రాగా మిషన్ భగీరథకు మాత్రం ఎక్సెస్‌తో టెండర్లు ఎందుకు కోట్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

12/21/2016 - 01:57

హైదరాబాద్, డిసెంబర్ 20: ‘తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అక్కడ (కేంద్రం), ఇక్కడ (రాష్ట్రం) మా ప్రభుత్వమే అధికారంలో ఉంది. మిమ్మల్ని (తెరాస) అణచేయాలంటే నిమిషం పట్టేది కాదు. ఇప్పుడనిపిస్తుంది, మేం పొరపాటు చేశామేమోనని అంటూ ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు శాసనసభలో మంగళవారం పెద్ద దుమారానికి దారితీశాయి.

12/21/2016 - 01:52

హైదరాబాద్/కాచిగూడ, డిసెంబర్ 20: పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవటంలో క్రైస్తవులు భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు అయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్రైవస్తవులకు నజరానా ప్రకటించారు.

12/21/2016 - 01:43

అమరావతి, డిసెంబర్ 20: అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా జిల్లాల్లో పార్టీ పురోగతి సాధించకపోవడానికి, పథకాలు జనం వద్దకు వెళ్లకపోవడానికి కొందరు జిల్లా కలెక్టర్ల నియంతృత్వ వైఖరే కారణమన్న విమర్శలు తెదేపాలో వినిపిస్తున్నాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల సిఫార్సులు బుట్టదాఖలు చేస్తున్నందున తాము జనాలకు దూరమవడంతోపాటు, పలచన అవుతున్నామన్న ఆవేదన పార్టీలో నెలకొంది.

12/21/2016 - 01:42

అమరావతి, డిసెంబర్ 20: ‘పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను భుజాన వేసుకుని పనిచేసిన కార్యకర్తలను మరువద్దు. నేను, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే అది వారి కష్టం, త్యాగ ఫలితమే. అధికారంలో ఉన్న వాళ్లు వారిని విస్మరిస్తే పార్టీకే నష్టమ’ని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పసుపు చొక్కా నాకు ఒక గుర్తింపును ఇచ్చింది. రాష్ట్రానికి సేవచేసే అవకాశం కల్పించిందన్నారు.

Pages