S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/16/2016 - 05:20

హైదరాబాద్, డిసెంబర్ 15: కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయి. ప్రాజెక్టు మొదటి దశ పనులకు రూ.7400 కోట్ల రుణాన్ని అందజేయడానికి ఇతర బ్యాంకులతో కలిసి ఆంధ్రా బ్యాంక్ కన్సార్టియంగా ముందుకు వచ్చింది. ఈమేరకు తన వాటాగా రూ.1300 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది.

12/16/2016 - 05:18

హైదరాబాద్, డిసెంబర్ 15: పెద్ద నోట్లను ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ సంపద, నకిలీ కరెన్సీ పెరిగేందుకు ఉపయోగించడంతో కేంద్రం ఐదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీని రద్దు చేసిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఆర్‌బిఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మన్‌భజన్ మిశ్రా ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.

12/16/2016 - 03:04

భద్రాచలం, డిసెంబర్ 15: నేటి నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా శుక్రవారం దేవస్థానం అర్చకులు తెల్లవారుఝామున మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య గోదావరికి వెళ్లి తీర్థ బిందె తెస్తారు. తెల్లవారుఝామున 4.46 గంటల సమయంలో మూలవరులకు స్నపన తిరుమంజనం నిర్వహించి సుప్రభాత సేవ చేస్తారు. అనంతరం బాలభోగం సమర్పిస్తారు.

12/16/2016 - 02:05

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 18వ తేదీ వరకూ పొడిగించినట్టు కమిషన్ కార్యదర్శి వై వి ఎస్ టి సాయి తెలిపారు. 18వ తేదీ తర్వాత మరోమారు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

12/16/2016 - 02:04

హైదరాబాద్, డిసెంబర్ 15: హౌరా-సికిందరాబాద్ ఎక్స్‌ప్రెస్ వేళల్లో స్వల్ప మార్పులు జరిగినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ నెం 12703 హౌరా-సికిందరాబాద్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి గం. 03:35లకు బయలు దేరాల్సి ఉండగా, 03:25లకు బయలుదేరుతుందని, అదేవిధంగా ప్రస్తుతం ఉదయం గం. 09:35లకు సికిందరాబాద్‌కు చేరవలసి ఉండగా, గం. 09:05లకు చేరుతుందని పేర్కొన్నారు.

12/16/2016 - 01:41

హైదరాబాద్, డిసెంబర్ 15: సర్కారు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకం వల్ల ఓ పసి ప్రాణం ప్రమాదంలో పడింది. జనగామకు చెందిన భిక్షపతి అనారోగ్యంతో బాధపడుతున్న తన ఆరేళ్ల కూతురు సాయి ప్రవళిక (6)ను ఈ నెల 7న గాంధీ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా ప్రవళిక మళ్లీ జ్వరంతో మంచాన పడింది.

12/16/2016 - 01:56

హైదరాబాద్, డిసెంబర్ 15:రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలిరోజైన శుక్రవారంనాడే పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చ చేపట్టనున్నారు. ఎన్‌డిఏలో తెలంగాణ రాష్ట్ర సమితి భాగస్వామి కాకపోయినా పెద్ద నోట్ల రద్దుకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం జరిగిన శాసనసభా కార్యకలాపాల సలహా సంఘ సమావేశంలో పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరపాలని నిర్ణయం తీసుకున్నారు.

12/16/2016 - 01:47

కర్నూలు, డిసెంబర్ 15: వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను మళ్లీ నగదు రూపంలోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. నగదు కొరత కారణంగా రెండు వారాలు గడిచినా పింఛనుదారులకు ఇంతవరకూ నగదు అందకపోవడంపై స్పందించిన ప్రభుత్వం తాత్కాలికంగా పింఛను సొమ్ము లబ్ధిదారులకు నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

12/16/2016 - 01:23

గుంటూరు, డిసెంబర్ 15: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)ల ఏర్పాటుకు, ఇండస్ట్రియల్ పార్కులు నెలకొల్పేందుకు ఎపిఐఐసికి భారీయెత్తున భూములను బదలాయిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో గురువారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. వివరాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు.

12/16/2016 - 02:57

గుంటూరు, డిసెంబర్ 15: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీల మాదిరిగానే రాష్ట్రంలోనూ 6 పట్టణాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఎపి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. కేంద్రం విశాఖపట్నం, కాకినాడలను స్మార్ట్ సిటీలుగా ప్రకటించింది.

Pages