S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/14/2016 - 02:37

హైదరాబాద్, డిసెంబర్ 13: మిగులు విద్యుత్‌ను సాధించడమే కాకుండా, విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గించి, ఇంధన పొదుపులో దేశం మొత్తం పైన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో గత రెండున్నర ఏళ్లుగా అమలు చేస్తున్న ఇంధన పొదుపు విధానాలు, ఎల్‌ఇడి బల్బుల వాడకం వల్ల ఆరుకోట్ల 40 లక్షల వాట్‌ల విద్యుత్‌ను ఆదా చేశామని ఆయన చెప్పారు.

12/14/2016 - 02:51

హైదరాబాద్, డిసెంబర్ 13: రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలల సాంస్కృతిక వికాసానికి కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. ఢిల్లీలోని సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం (సిసిఆర్‌టి) కల్చరల్ టాలెంట్ సెర్చి స్కాలర్‌షిప్ స్కీంను ప్రకటించింది.

12/14/2016 - 01:01

హైదరాబాద్, డిసెంబర్ 13: కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత కలెక్టర్ల తొలి కాన్ఫరెన్స్ బుధవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగనుంది. సిఎం కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ప్రారంభమైన తర్వాత కలెక్టర్లతో జరిగే తొలి కాన్ఫరెన్స్ కూడా ఇదే కావడం గమనార్హం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సంస్కరణలకు రెండు నెలల కిందట దసరా రోజున రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

12/14/2016 - 00:56

విజయవాడ, డిసెంబర్ 13: వచ్చే 17 రోజుల్లో నోట్ల రద్దు సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని సిఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 15-20 తేదీల మధ్య రాష్ట్రానికి మరో 20వేల కోట్ల రూపాయలు రానున్నాయని, దీంతో చాలావరకూ సమస్య తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లా కలెక్టర్లు, ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్లతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

12/14/2016 - 00:53

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలుగు జర్నలిజంలో అందెవేసిన కలం అనిపించుకున్న వి హనుమంతరావు (91) మంగళవారం ఉదయం శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్)లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సతీష్‌బాబు కూడా జర్నలిస్టుగా పని చేస్తున్నారు. 1925లో జన్మించిన హనుమంతరావు తొలుత ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వద్ద లేఖకుడిగా పనిచేశారు. తర్వాత జర్నలిజంలోకి వచ్చారు.

12/14/2016 - 01:18

హైదరాబాద్, డిసెంబర్ 13: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పనేనని కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో ఆరుగురిని దోషులుగా తేల్చేసింది.

12/13/2016 - 05:15

హైదరాబాద్, డిసెంబర్ 12: నగదురహిత చెల్లింపుల్లో సర్వీసు చార్జీల బాదుడులేకుండా ప్రజలకు ఉచిత సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. డిజిటల్ చెల్లింపుల్లో ప్రయివేట్ సంస్థలు సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నాయని, ఆ భారంనుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని సూచించింది.

12/13/2016 - 05:11

ఆమనగల్లు, డిసెంబర్ 12: ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తున్న ఓ కుటుంబాన్ని ఓ లారీ చిదిమేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు బలితీసుకుంది. హైదరాబాద్ - శ్రీశైలం 765 నంబర్ జాతీయ రహదారిపై బైకుపై వెడుతుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

12/13/2016 - 05:07

హైదరాబాద్/కాచిగూడ, డిసెంబర్ 12: హైదరాబాద్ నేషనల్ బుక్‌ఫెయిర్ (డిసెంబర్ 15- డిసెంబర్ 30) సందర్భంగా 16వ తేదీ నుంచి పది రోజుల పాటు సాహిత్య కార్యక్రమాలను జరపాలని బుక్‌ఫెయిర్ కమిటీ నిర్ణయించింది.

12/13/2016 - 05:05

హైదరాబాద్, డిసెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఫిబ్రవరి 10 నుండి మూడు రోజుల పాటు నిర్వహించే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు దేశ విదేశాల నుండి దాదాపు 9వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

Pages