S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/12/2016 - 02:36

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణను చలి వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఏడు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్ జిల్లాలోనూ 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో ఉదయం 9 గంటల వరకూ మంచు కురుస్తూనే ఉంటోంది. నిజామాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి.

12/12/2016 - 02:01

విశాఖపట్నం / మచిలీపట్నం, డిసెంబర్ 11: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా పెను తుపాను దిశ మార్చుకుంది. శనివారం వరకు మచిలీపట్నం - నెల్లూరు వైపు పయనించిన తుపాను ఆదివారం చెన్నై వైపు దిశ మార్చుకుందని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం సాయంత్రానికి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు.

12/12/2016 - 01:58

విజయవాడ, డిసెంబర్ 11: వార్ధా తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ, పునరావాస చర్యలు ప్రపంచానికే ఆదర్శంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రాణ, ఆస్తి, పంటనష్టాల్ని తగ్గించాలని, ఎంత వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపడితే అంత త్వరగా ఉపశమనం లభిస్తుందని అన్నారు.

12/12/2016 - 01:53

హైదరాబాద్, డిసెంబర్ 11: కృష్ణా జలాల పంపిణీపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో బోర్డు విఫలమైంది. ఈ నెల 13వ తేదీ లోగా బోర్డు చేసిన నీటి కేటాయింపులపై అభిప్రాయాలు తెలియచేయాలన్న బోర్డు కార్యదర్శి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం తిప్పిగొట్టింది.

12/11/2016 - 07:10

హైదరాబాద్, డిసెంబర్ 10: జాతీయ స్థాయిలో బాలికా విద్య ప్రోత్సాహానికి కేబ్ నియమించిన సబ్ కమిటీ చైర్మన్ హోదాలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేంద్రప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి చేసిన సిఫార్సులకు కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రధానంగా కెజిబివిల్లో విద్య బోధనకు సహాయం చేయాలని కేంద్రానికి సూచించారు.

12/11/2016 - 07:09

సందేహాలు తీర్చే యంత్రాంగం కరవు
పట్టించుకోని కార్పొరేట్ కళాశాలలు
ఆన్‌లైన్ తెచ్చిన తంటా ఇది

12/11/2016 - 07:08

హైదరాబాద్, డిసెంబర్ 10: అన్ని భారతీయ భాషల్లో వికీపీడియాను అభివృద్ధి చేసేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని వికీ ట్రైనర్, ఆంగ్ల వికీపీడియన్ టిటో దత్తా పేర్కొన్నారు. వికీపీడియాను అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నాయకత్వ శిక్షణ, వికీపీడియాలో పనికొచ్చే ఉపకరణాల గురించి రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.

12/11/2016 - 07:07

హైదరాబాద్, డిసెంబర్ 10: తెలుగు రాష్ట్రాల్లో లంచగొండులు, అక్రమార్జనకు పాల్పడిన అధికారుల నుంచి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) స్వాధీనం చేసుకున్న పెద్ద నోట్లు రూ.100 కోట్లకుపైగా ఉన్నాయి. ఈ సొమ్మునంతా ఈ నెల 30వ తేదీలోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉండటంతో సాధ్యమైనంత త్వరగా ఆ పని పూర్తి చేసేందుకు ఎసిబి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం వీరు హైకోర్టు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.

12/10/2016 - 05:15

హైదరాబాద్/ గచ్చిబౌలి, డిసెంబర్ 9: మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, మున్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యాలు దగ్గరుండి నానక్‌రామ్‌గూడలోని ఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు.

12/10/2016 - 05:09

నల్లగొండ, డిసెంబర్ 9: నల్లధనం నిర్మూలనకు పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుండి తగిన మద్దతు లభించిందని, నల్లధనంపై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి జి.మురళీధర్ రావు అన్నారు. శుక్రవారం ఇక్కడ బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages