S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/10/2016 - 02:10

కేంద్రం ప్రకటించిన పెద్ద నోట్ల కష్టాన్ని నిన్నటి వరకూ వౌనంగా భరించిన జనంలో క్రమంగా కాక పెరుగుతోంది. రోజుల తరబడిన కష్టాలు, క్యూలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదన్న

12/10/2016 - 01:58

ఒంగోలు,డిసెంబర్ 9: ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, గృహనిర్మాణం లాంటి సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తూట్లు పొడుస్తున్నారని, ఆయన మెడలు వంచైనా ఆ పథకాలు అమలు చేయిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

12/10/2016 - 01:52

హైదరాబాద్, డిసెంబర్ 9:ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఊరట లభించింది. ఈ కేసులో విచారణ జరిపించాలని ఏసిబి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఏసిబి కోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.

12/10/2016 - 01:51

విశాఖపట్నం, డిసెంబర్ 9: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘వార్ధా’ తుపాను స్థిరంగా కొనసాగుతోంది. ఇది రాగల 12 గంటల్లో (శనివారం మధ్యాహ్నానికి) తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి ప్రకటించారు. ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 950 కిలోమీటర్ల దూరంలోను, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1,050 కిమీ దూరంగాలోను కేంద్రీకృతమై ఉంది.

12/09/2016 - 05:05

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 8: ఖండాంతర ఖ్యాతి చెందిన పోచంపల్లి చేనేత రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఐటి శాఖామంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. గురువారం భూదాన్ పొచంపల్లి మండలం కనుముకుల గ్రామం చేనేత పార్కును ఆయన సందర్శించారు. చేనేత పార్కులోని మగ్గాలను, వస్త్రాలను ఆయన పరిశీలించారు. వస్త్రాల తయారీ విధానం, రంగుల అద్దకాల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.

12/09/2016 - 05:00

హైదరాబాద్, డిసెంబర్ 8: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద తన వద్ద సుమారు రూ.10 వేల కోట్లు ఉన్నట్టు ప్రకటించిన బాణాపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు రైస్‌పుల్లింగ్ కాయిన్‌ను కనుగొన్నారు. లక్ష్మణ్‌రావు వద్ద కేవలం రూ. 1.42 లక్షలు మాత్రమే ఉందని తేలడంతో అతని ఇంటితోపాటు ఇద్దరు కొడుకులు, కోడళ్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.

12/09/2016 - 04:58

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణలో రబీ సాగు జోరందుకుంది. 2016 నవంబర్‌లో యాసంగి (రబీ) పంటలకు విత్తనాలు వేయడం ప్రారంభమైంది. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జలాశయాల్లో నీరు సమృద్ధిగా చేరటంతో పాటు, బావులు, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. అలాగే వాతావరణం పంటలకు అనుగుణంగా ఉంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల పంటలకు అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది.

12/09/2016 - 04:58

హైదరాబాద్, డిసెంబర్ 8:ఈనెల 16నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రుల వ్యూహ కమిటీ గురువారం సమావేశం అయింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు సమావేశం అయ్యారు.

12/09/2016 - 02:18

హైదరాబాద్, డిసెంబర్ 8: దాదాపు 18 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 1998 డిఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం ఇదిగో అదుగో అంటూ చుక్కలు చూపిస్తోంది. 1998లో అర్హుల జాబితాను ప్రకటించి ఖాళీలు లేవనే సాకుతో ఉద్యోగాలు ఇవ్వకుండా తర్వాత ఇస్తామని అప్పటి ప్రభుత్వం వారిని పక్కన పెట్టింది. అప్పటి నుండి ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వాలకూ, అధికారులకు పట్టడం లేదు.

12/09/2016 - 02:17

భీమునిపట్నం, డిసెంబర్ 8 : భక్తుల పాలిట భగవత్ స్వరూపంగా భాసిల్లిన సద్గురు శివానందమూర్తి 89వ జయంతి వేడుకలు భీమిలిలోని ఆనందవనంలో గురువారం ఘనంగా జరిగాయి. మార్గశిర శుద్ధ నవమినాడు జరుపుకునే గురూజీ జయంతి వేడుకలు ఆయన కుమారుడు బసవరాజు-రాజ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా ఆనందవనంలో గల ఉపన్యాస మందిరంలో గురూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Pages