S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/08/2016 - 02:03

విజయవాడ (క్రైం), నవంబర్ 7: నక్సల్స్ ఆయుధాలు వదిలి ముందుకొస్తే చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని డిజిపి నండూరి సాంబశివరావు చెప్పారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చే మావోయిస్టులను పోలీసు శాఖ స్వాగతిస్తుందన్నారు. ‘రాష్ట్రంలో ఇకనుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాల్సిందే. హక్కులకోసం ఉద్యమించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ పోలీసుల అనుమతి తప్పనిసరి.

11/08/2016 - 02:01

అమరావతి, నవంబర్ 7: రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలుగా ఆలయాలను ప్రచారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం సరికొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలకు హెలికాప్టర్ సర్వీసుల్ని అందించాలని భావిస్తోంది. ఈ హెలికాప్టర్ సర్వీసులను సమ్మిట్ ఏవియేషన్ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుంది.

11/08/2016 - 01:51

విజయవాడ, నవంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ రూరల్, అర్బన్ గృహ నిర్మాణ పథకాల్లో ఒక్క రూపాయి అవినీతి జరిగినా కఠిన శిక్ష తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను హెచ్చరించారు. గృహ నిర్మాణాన్ని ఒక పవిత్ర కార్యంగా భావించి చేపడుతున్నామని, ఇందులో అవకతవకలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

11/07/2016 - 07:28

హైదరాబాద్, నవంబర్ 6: రెండు దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్న శ్రీశైలం ఎడమ కాలువ పనులకు ఇంతకాలానికి మోక్షం లభించింది. నవంబర్ 9న ప్రాజెక్టును నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. మొత్తం 80వేల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు పనులు 1997నుంచి మందకొడిగా సాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం పనులు వేగం పుంజుకోవటంతో నిర్ణీత సమయానికి కాలువ నిర్మాణం పూర్తయింది.

11/07/2016 - 07:21

హైదరాబాద్, నవంబర్ 6:తెలంగాణ టూరిజంను ప్రపంచానికి పరిచయం చేసేందుకు వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లండన్ 2016ను వేదికగా ఉపయోగించుకుంటామని పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రికి ఎన్‌ఆర్‌ఐ టిఆర్‌ఎస్ సెల్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ, జై కెసిఆర్ నినాదాలతో లండన్ హీత్రో అంతర్జాతీయ విమానాశ్రయం మారుమ్రోగింది.

11/07/2016 - 07:20

హైదరాబాద్, నవంబర్ 6: ఫ్లోరైడ్ , ఫ్లోరోసిస్ సమస్యలపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్)లో జరుగుతుంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఫ్లోరైడ్ రీసెర్చ్, ఎన్‌ఐఎన్ ఉమ్మడిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభిస్తారు.

11/07/2016 - 07:12

హైదరాబాద్, నవంబర్ 6: ఈ నెల 21వ తేదీ నుంచి కాచిగూడ-టాటానగర్ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ట్రైన్ నెం. 07438 ఈనెల 21,28, డిసెంబర్ 5,12,19,26 తేదీల్లో కాచిగూడ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 13:00 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు 19:45 గంటలకు టాటానగర్ చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెం.

11/07/2016 - 06:57

హైదరాబాద్, నవంబర్ 6: ‘నిజాంపై సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కుపాదం మోపకుండా అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ అడుగడుగునా అడ్డుపడ్డారు.’ అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి ఎస్ జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆదివారం కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆదివారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు.

11/06/2016 - 03:18

హైదరాబాద్, నవంబర్ 5: భారతదేశ తొలి విద్యాశాఖా మంత్రి వౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రప్రభుత్వం యుజిసిని ఆదేశించింది. ఆ మేరకు విద్యాసంస్థలకు యుజిసి కార్యదర్శి జస్పాల్ ఎస్ సాంథు ఉత్తర్వులు జారీ చేశారు.

11/06/2016 - 03:16

అమరావతి, నవంబర్ 5: వ్యవసాయం ప్రధానమైన గుంటూరు కల్తీకి స్వర్గ్ధామమైంది. జిల్లాలో విత్తనాలు, బయో, కారం కల్తీ ఉత్పత్తులపై కొరడా ఝళిపించాల్సిన నిఘా వ్యవస్థ సుఖ నిద్రపోతోంది. ఫలితంగా వందల కోట్ల రూపాయలు రాజకీయ నేతలు, అధికారుల జేబుల్లోకి వెళుతున్నాయి. గుంటూరు జిల్లాలో వ్యవసాయ, విజిలెన్స్ విభాగాల్లో పోస్టింగులకు భారీ డిమాండ్ ఉంటుంది. అంటే ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

Pages