S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/01/2016 - 05:59

హైదరాబాద్, సెప్టెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక కమిషన్ సిఫారసు మేరకు రాష్ట్రంలోని 6900 గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 940 కోట్ల రూపాయలు ఏవీ? అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాదాపు 6 నెలలు కావస్తున్నా ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకుండా నిషేధం (ఫ్రీజ్) పెట్టిందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

10/01/2016 - 05:22

హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కావడానికి ముందున్న ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సెప్టెంబర్ 15 వరకు ఇచ్చిన తీర్పులను తు.చ తప్పకుండా అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలియజేసింది.

10/01/2016 - 05:21

హైదరాబాద్, సెప్టెంబర్ 30: చెరువులు, నాలాలు ఆక్రమించుకుని ఇండ్లు, కట్టడాలు నిర్మించిన వారికి రెండు వారాలు గడువు ఇస్తూ నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణను స్వీకరించాలని జిహెచ్‌ఎంసిని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ ఆదేశాలను జారీ చేశారు. నోటీసులు ఇవ్వకుండా తమ ఇండ్లను, నిర్మాణాలను జిహెచ్‌ఎంసి అధికారులు కూల్చివేస్తున్నారంటూ అనేక పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.

10/01/2016 - 04:46

హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖల్లో ఉన్న 12 కేటగిరిల్లో 256 పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. నోటిఫికేషన్ 7/2016లో రెండు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులకు రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది.

10/01/2016 - 04:45

హైదరాబాద్, సెప్టెంబర్ 30: పోలవరం ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, పట్టిసీమకు, పోలవరంకు సంబంధం లేదని కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో నదీ జలాల వినియోగంపై వివరాలను పంపాల్సిందిగా కృష్ణా బోర్డు రెండురోజుల క్రితం ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను కోరింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది.

10/01/2016 - 04:43

విశాఖపట్నం, సెప్టెంబర్ 30: ఛత్తీస్‌గడ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుగుణంగా ఛత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

10/01/2016 - 04:41

హైదరాబాద్, సెప్టెంబర్ 30: బహిరంగ వేలం ద్వారా అమ్ముడైన అగ్రి గోల్డ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు సభ్యుల కమిటీ ద్వారా అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి, వచ్చిన సొమ్మును డిపాజిటర్లకు చెల్లించాలని హైకోర్టు గతంలోనే పేర్కొంది. అగ్రిగోల్డ్ మోసాలపై సిబిఐ విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది.

10/01/2016 - 04:40

హైదరాబాద్, సెప్టెంబర్ 30: సాధారణ కార్మికులకు 15 రూపాయలు చెల్లిస్తే ఐదు లక్షల వరకూ బీమా ఇతర ప్రయోజనాలు పొందేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గాంధీ జయంతి రోజున తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

10/01/2016 - 02:38

ఖమ్మం, సెప్టెంబర్ 30: ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతుల పంటలను శుక్రవారం రాష్టస్థ్రాయి బృందం కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించింది. పర్యటనలో తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో రైతులు జీవ 801, శే్వత విత్తనాలు సాగు చేయగా, అధికంగా జీవ 801వల్ల రైతులు తీవ్రనష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

09/30/2016 - 05:26

హైదరాబాద్, సెప్టెంబర్ 29: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వంలోని కూటమి యునైటెడ్ ఫ్రంట్ ఫర్ సోషల్ జస్టిస్ (యుఎఫ్‌ఎస్‌జె) ఘనవిజయం సాధించింది. యుఎఫ్‌ఎస్‌జెలో ఎస్‌ఎఫ్‌ఐ, డిఎస్‌యు, టిఎస్‌ఎఫ్, బిఎస్‌ఎఫ్, టివివి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎబివిపి, ఒబిసిఎ కూటమి పరాజయం పాలైంది.

Pages