S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/28/2016 - 07:19

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఉద్యోగుల విభజనపై ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఉద్యోగుల విభజన కోసం కమలనాథన్ కమిటీని (చైర్మన్ అడ్వయిజరీ కమిటీ, ఎపి) కేంద్రం నియమించిన విషయం గమనార్హం.

09/28/2016 - 07:05

హైదరాబాద్, సెప్టెంబర్ 27: జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ప్రతిపాదిత ముసాయిదాపై అందిన వినతుల క్రోడీకరణను త్వరగా పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాజీవ్ శర్మ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

09/28/2016 - 06:42

హైదరాబాద్, సెప్టెంబర్ 27: కృష్ణా జలాలను ఆంధ్ర రాష్ట్రం దోపిడీ చేస్తోందని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రానికి మరోసారి ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల యాజమాన్య బోర్డుకు ప్రత్యక్షంగా ఫిర్యాదు చేసిన మంత్రి, కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా ఆంధ్ర పాల్పడుతోన్న జల చౌర్యాన్ని నియంత్రించాలని కోరారు.

09/28/2016 - 06:33

హైదరాబాద్, సెప్టెంబర్ 27:తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విడదీసిన విభజన చట్టం... ఉద్యోగాలు చేసుకుంటున్న భార్యాభర్తలనూ విభజిస్తోంది. కుటుంబాలకు దూరం చేస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్న దంపతులు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులయితే ఇంకొకరు కేంద్రప్రభుత్వ ఉద్యోగి. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత వారూ విడిపోయే పరిస్థితి.

,
09/27/2016 - 02:56

హైదరాబాద్, సెప్టెంబర్ 26: గోదావరి, కృష్ణా బేసిన్‌లో వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ రెండు బేసిన్‌లలో ఉన్న అన్ని ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులన్నీ నీటితో నిండుకుండల్లా మారటంతో గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో వీటిని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాజెక్టులను వస్తున్నారు. చాలాకాలం తరువాత నిండిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది.

09/27/2016 - 02:52

కర్నూలు, సెప్టెంబర్ 26: శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అంశంపై మంగళవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 880.95 అడుగులకు నీరు చేరింది.

09/27/2016 - 02:49

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ‘సమస్యలు ఏవైనా వస్తే వాటిని పెద్దవిగా చేసుకోకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోండి..’ అని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. విడిపోగానే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని హామీలనూ నెరవేరుస్తాం అని ఆయన పునరుద్ఘాటించారు.

09/27/2016 - 02:45

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ఆంధ్రా, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తూ, మరికొన్ని రైళ్ల రాకపోకలను మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. సికిందరాబాద్-సత్తెనపల్లి-గుంటూరు-పిడుగురాళ్ల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే జిఎం తెలిపారు.

09/27/2016 - 02:39

హైదరాబాద్/ చార్మినార్, సెప్టెంబర్ 26: శేరిలింగంపల్లి మండలంలలోని రాయదుర్గం పాన్ మక్తాలోని ముంబై హైవేకు సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 83లోని 125.30 ఎకరల భూమికి సంబంధించిన వివాదంలో అరకు ఎంపి గీత భర్త నకిలీ పత్రాలతో భూమిని కాజేసేందుకు కుట్ర చేశారని, ఆ భూమిపై సర్వ హక్కులు భావన సహకార గృహ నిర్మాణ సొసైటీకే ఉన్నాయని సొసైటీ అధ్యక్షుడు పివిసి దాస్, ఉపాధ్యక్షుడు లక్ష్మిప్రసాద్, సభ్యులు జె.

09/27/2016 - 02:03

హైదరాబాద్, సెప్టెంబర్ 26: గీతమ్ యూనివర్శిటీ హైదరాబాద్ క్యాంపస్‌లో 28వ తేదీన అమెరికా యూనివర్శిటీల ఫెయిర్ నిర్వహించనున్నట్టు యూనివర్శిటీ ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ తెలిపారు. 28వ తేదీన ఉదయం 9 నుండి 11.30 గంటల వరకూ అమెరికాకు చెందిన 29 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేస్తారని ఆయన వివరించారు.

Pages