S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/26/2016 - 04:18

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న అసాధారణ వర్షాలతో తీవ్రస్థాయి వరద వచ్చే ప్రమాదం ఉందని కేంద్ర జల వనరుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం హెచ్చరికలతో తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర ప్రభుత్వాలు అలెర్టయ్యాయి. జిల్లా కలెక్టర్లు అప్రమత్తం కావాలని ఆదేశాలు జారీ చేశాయి.

09/26/2016 - 04:11

హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణలో పండుగ ముందే వచ్చింది. కరవుతీరా వానలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, బావులు, వంకలు, వాగులు నిండిపోయాయి. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతోపాటు, తెలంగాణ పీఠభూమిపై కురుస్తున్న భారీ వర్షాలు కరవు తీర్చేసేలాగే కనిపిస్తోంది.

09/26/2016 - 04:29

హైదరాబాద్, సెప్టెంబర్ 25: భారీ వర్షాలు, వరదల వల్ల ఎలాంటి విపత్కర పరిస్ధితి ఎదురైనా ఎదుర్కొవడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖలు సిద్థంగా ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఆస్తి నష్టం జరిగితే పూడ్చుకోవచ్చు, కానీ ప్రాణ నష్టం సంభవిస్తే పూడ్చలేమని, వరదల నేపథ్యంలో అలాంటి పరిస్థితి రాకుండా యంత్రాంగం అప్రమత్తం కావాలని బలంగా ఆదేశించారు.

09/26/2016 - 00:16

కె.కోటపాడు, సెప్టెంబర్ 25: ‘నేరం నాదికాదు ఆకలిది’ అని ఓ సినిమాలో విన్నాం. కె.కోటపాడులో కూడా నేరం ఆకలిది అన్నట్టు ఓ పంది తన జాతిపిల్లలనే తినేస్తోంది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. విశాఖపట్నం జిల్లా, కె.కోటపాడులోని విద్యుత్‌శాఖ కార్యాలయం వద్ద పందుల గుంపు సంచరిస్తుంటాయి. సమీప ఇళ్ళల్లోని మహిళలు వేసిన ఆహారాన్ని తిని జీవిస్తుంటాయి. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఈ పందులకు ఆహారం దొరకడం లేదు.

09/25/2016 - 04:09

ఖమ్మం, సెప్టెంబర్ 24: ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కినె్నరసాని, తాలిపేరు ప్రాజెక్టులు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలోని లంకాసాగర్, మసి వాగులతో పాటు పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి.

09/25/2016 - 04:22

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: తాను బిసి ప్రధానిని అని ప్రచారం చేసుకోనే నరేంద్రమోదీ ఇప్పటి వరకు ఆ వర్గాలకు చేసిందేమీ లేదని ఏఐసిసి కార్యదర్శి వి హనుమంతరావువిమర్శించారు. శనివారం నాడు లక్నోలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూపీ కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభా గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓబిసిల సమస్యలు పరిష్కరించడంలో ఎన్డీఎ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

09/25/2016 - 04:21

జీడిమెట్ల, సెప్టెంబర్ 24: వర్షబీభత్సంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బండారి లే అవుట్ కాలనీలో పరిస్థితులను చక్కదిద్ది ప్రజలను రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగాయి. కాలనీ వాసులకు నిద్రలేకుండా చేస్తున్న తుర్కచెరువు కట్ట డేంజర్‌జోన్‌గా ప్రకటించి బోర్డును ఏర్పాటు చేసి ఎవరినీ అటు వెళ్లనివ్వకుండా చర్యలు చేపట్టారు. బాధితులకు పాలు, బ్రెడ్, బిస్కెట్, తాగునీరు వంటి వాటిని అందించారు.

09/26/2016 - 06:19

హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని దాదాపు అన్ని ప్రాజెక్టులు వరద నీటితో నిండిపోయాయి. మూడేళ్ల నుంచి నీళ్లు లేక వెలవెలబోయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నీటితో నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42గేట్లను ఎత్తి వరద నీటిని వదిలేస్తున్నారు.

09/25/2016 - 03:26

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం కార్యాలయాన్ని కృష్ణాజిల్లా కూచిపూడిలో ఏర్పాటు చేస్తూ హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ ఈ మేరకు అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించారు.

09/25/2016 - 03:24

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్-విశాఖపట్నం-సికిందరాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. ట్రైన్ నెం. 07071 హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ఈ నెల 28, అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో నడిచే ప్రత్యేక రైళ్లు, ట్రైన్ నెం.

Pages