S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/25/2016 - 02:33

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలో నిర్వహించిన ఎమ్సెట్-3లో అర్హత సాధించిన విద్యార్ధుల్లో 95 శాతం మందికి మెడికల్, డెంటల్ సీట్లు రాకపోగా, వేరే ఏ ఇతర కోర్సుల్లో చేరేందుకు కూడా వీలు లేకపోవడంతో వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి మాదిరి మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్సెట్-2 ద్వారా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ , బయోటెక్నాలజీ , వెటర్నరీ సీట్లను భర్తీ చేస్తోంది.

09/25/2016 - 02:26

ఏలూరు, సెప్టెంబర్ 24: ‘ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లలంతా స్మార్ట్ఫోన్లతో దర్శనమిస్తున్నారు. అయితే ఒక్క దోమ కుడితే అందరూ అనారోగ్యంతో పడుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండకపోతే జీవితాలు ఇబ్బందికరంగా మారతాయి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

09/25/2016 - 02:20

గుంటూరు, సెప్టెంబర్ 24: భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్నిరకాల ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన అనంతరం కలెక్టరేట్‌లో శనివారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

09/25/2016 - 02:17

గుంటూరు, సెప్టెంబర్ 24: గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాలైన క్రోసూరు, పెదనందిపాడు, పమిడివారిపాలెం, కాకుమాను, బాపట్ల, తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద రహదారిపై హెలీకాప్టర్ దిగి, రోడ్డుమార్గాన బయల్దేరి అనుపాలెం వద్ద దెబ్బతిన్న రైల్వేట్రాక్‌ను పరిశీలించారు.

09/25/2016 - 02:15

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: అల్పపీడనానికితోడు అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి విధర్భ మీదుగా దక్షిణ చత్తీస్‌గడ్ మధ్య తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

,
09/25/2016 - 02:14

హైదరాబాద్/ అల్వాల్/ నాచారం, సెప్టెంబర్ 24: లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగావున్న ఇటీవలే విడుదలైన తెలుగు ప్రొఫెర్లు గోపికృష్ణ, బలరాం కిషన్‌లు శనివారం హైదరాబాద్‌కు క్షేమంగా చేరుకున్నారు. మొదట లిబియా నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రొఫెసర్లు అక్కడి నుంచి నేటి తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే వీరి రాక సమాచారం వారి కుటుంబ సభ్యులకు తెలియదు.

09/25/2016 - 01:39

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24: వారంరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటం తో వరినారు పోయడానికి రైతులు ఉత్సా హం చూపిస్తున్నారని, అయితే ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ 15 కంటే ముందు వరినార్లు పోయకూడదని ప్రొఫెజర్ జయశంకర్ వ్యయసాయ వర్శిటీ శాస్తవ్రేత్త ఓ ప్రకటనలో హెచ్చరించారు. ముందుగా వరినార్లు పోస్తే చలి వల్ల దిగుబడులు సరిగా రావని ఆయన అన్నారు.

09/24/2016 - 05:26

ఖమ్మం, సెప్టెంబర్ 23: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లాలో టేకులపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది. కినె్నరసాని ప్రాజెక్టు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తాలిపేరుకు వరద నీరు చేరుతుండడంతో దిగువనున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

09/24/2016 - 04:24

హైదరాబాద్, సెప్టెంబర్ 23: భారీ వర్షాల కారణంగా గుంటూరు డివిజన్‌లోని సత్తెనపల్లి-పిడుగురాళ్ళ సెక్షన్‌లో రైలు పట్టాలు దెబ్బ తిన్న కారణంగా ఒక రైలును రద్దు చేయగా, మరో రైలును మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మణుగూరు-కాజిపేట ప్యాసింజర్‌ను 24వ తేదీన రద్దు చేసింది.

09/24/2016 - 03:59

హైదరాబాద్, సెప్టెంబర్ 23: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ 2016-17 సంవత్సరానికి ప్రకటించిన ప్రతిష్ఠాత్మక వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడు విశ్వవిద్యాలయాలు, తెలంగాణకు చెందిన ఒక విశ్వవిద్యాలయం స్థానాన్ని దక్కించుకున్నాయి.

Pages