S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/24/2016 - 04:15

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు పాలకమండలిని విస్తరించారు. అందులో 12 మంది ఐఎఎస్ అధికారులతో పాటు 14 మంది వైస్ ఛాన్సలర్లకు సభ్యత్వం ఇచ్చారు.

09/24/2016 - 03:56

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఈ విద్యా సంవత్సరంలో స్పోర్ట్స్ కోటా కింద ఆంధ్రాలో ఎంబిబిఎస్, దంత వైద్య కళాశాలల్లో సీట్లను కేటాయించవద్దని హైకోర్టు శుక్రవారం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్ జి తన్మయి తరఫున న్యాయవాది రఘునందనరావు వాదనలు వినిపిస్తూ, స్పోర్ట్స్ కోటా కింద తయారు చేసిన మెరిట్ లిస్టులో అనేక అవకతవకలు ఉన్నాయని తెలిపారు.

09/24/2016 - 04:13

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఓటుకు నోటు కేసులో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు హైకోర్టు సింగిల్ జడ్జి జారీ చేసిన బెయిలబుల్ వారెంట్ అమలుపై హైకోర్టు ధర్మాసనం స్టే మంజూరు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన వారెంట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

09/24/2016 - 03:39

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య ప్రమాణాలు పెంచేందుకు గత ఏడాది నుండి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుండగా, రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల ప్రావీణ్యాన్ని పెంచేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు వారి పనితీరును సమీక్షించాలని కూడా చూస్తోం ది. ఇందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.

09/24/2016 - 03:30

హైదరాబాద్: బాబు వస్తే వర్షాలు రావు. రిజర్వాయర్లు నిండవు. కరవు విలయ తాండవం చేస్తుంది! ఇదీ గత కొనే్నళ్ల నుంచి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉన్న సెంటిమెంటుకు సంబంధించిన ముద్ర!! గత రెండేళ్ల నుంచి ఏపిలో సరైన వర్షాలు కురవకపోవడం, అంతకుముందు తొమ్మిదేళ్లు సీఎంగా చేసినప్పటి కరవును దృష్టిలో పెట్టుకుని విపక్షాలు చేసిన విమర్శలు, కొందరు స్వాములు చేసిన వ్యాఖ్యలు ఒక సెంటిమెంటుగా మారాయి.

09/24/2016 - 03:16

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆస్తుల పంపకానికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో షెడ్యూలు 10 బిలోని విద్యాసంస్థలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిసారించింది.

09/24/2016 - 03:16

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణలో దొడ్డిదారిన మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి అన్ని మెడికల్ కాలేజీల్లో సీట్లను మెరిట్ ప్రాతిపదికగానే నింపాల్సి ఉంది. మెరిట్ ప్రాతిపదికపైనే సీట్ల భర్తీ జరుగుతోందా? లేదా? అన్నది ఆయా రాష్ట్రాల వైద్యవిద్యా విభాగం పర్యవేక్షించాల్సి ఉంటుంది.

09/24/2016 - 03:15

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సంవత్సరానికి కోటిన్నర టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్ధలు, పరిశ్రమలపై నియంత్రణాధికారాలను రాష్ట్రాలకే అప్పగించేందుకు కేంద్రం అంగీకరించినట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ రెండవ సమావేశానికి ఆర్థిక మంత్రి రాజేందర్ హాజరయ్యారు.

09/24/2016 - 03:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దళితులకు ఉపాది అవకాశాలు పెంపోదించేందుకు ఏటా పది వేల మంది చొప్పున వచ్చే మూడేళ్లలో 30వేల మందికి శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగు పెట్టనున్నట్టు ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్ణయించింది.

09/24/2016 - 03:12

హైదరాబాద్, సెప్టెంబర్ 23: అల్పపీడనంతో తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి (సిడిఆర్‌ఎఫ్) నుంచి తాత్కాలిక సహాయం అందజేస్తుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

Pages