S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/23/2016 - 00:55

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణ మెడికల్ కౌనె్సలింగ్‌లో తప్పనిసరి సీట్లు దక్కుతాయని భావించిన విద్యార్ధులకు ఆశాభంగమే ఎదురైంది. మంచి ర్యాంకులు సాధించినా తక్కువ సంఖ్యలో కన్వీనర్ కోటా సీట్లు ఉండటంతో విద్యార్ధులకు సీట్లు దక్కలేదు. దాంతో విద్యార్ధులు హతాశులయ్యారు. రిజర్వుడ్ కేటగిరిల్లో కూడా అభ్యర్ధులకు సీట్లు దక్కలేదు.

09/23/2016 - 00:51

విజయవాడ, సెప్టెంబర్ 22: బిసిల్లో వేల మందిని యువ పారిశ్రామికవేత్తలుగా తయారుచేయటానికి 25 లక్షల రూపాయలతో చిన్న యూనిట్లను నెలకొల్పటానికి అవకాశం కల్పిస్తున్నట్లు బిసి సంక్షేమ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సంచార జాతులకు చెందిన 26 కులాలను ఒక గ్రూపుగా ఏర్పాటుచేసి వారికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

09/23/2016 - 00:47

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అవినీతి, అక్రమాలను , దళారీ వ్యవస్థను నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. పౌర సేవలు అన్నీ ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది. మరో పక్క భూమి రికార్డులను డిజిటలైజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

09/23/2016 - 00:46

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ప్రభుత్వ ముందస్తు కార్యాచరణ, శాఖల మధ్య సమన్వయలోపం కలసి వెరసి పురాతన భవనాల్లో నివసిస్తున్న వారికి శాపంగా పరిణమించింది. వర్షాకాలంలో భారీ వర్షాలు పడ్డప్పుడు ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు హడావిడి చేయడం, తర్వాత మర్చిపోవడం తంతుగా మారింది.

09/23/2016 - 00:45

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణలో జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి పునర్విభజనపై జారీ చేసిన ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించడానికి విధించిన గడువు 21న సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. ఇక తుది నోటిఫికేషన్ విడుదల చేయడం ఒక్కటే తరువాయి.

09/23/2016 - 00:12

హైదరాబాద్, సెప్టెంబర్ 22: చెక్ బౌన్స్ కేసులో కింగ్ ఫిషర్ పూర్వ ప్రధాన ఆర్ధిక శాఖాధికారి రఘునాథన్‌కు ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు 18 నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. అనంరం ఈ తీర్పుపై హైకోర్టుకు అపీల్‌కు వెళ్లేందుకు అవకాశం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. జిఎంఆర్ సంస్ధకు ఇచ్చిన చెక్‌ల బౌన్సు కేసులో లండన్‌కు వెళ్లిపోయిన వాణిజ్యవేత్త విజయ్ మాల్యా, రఘునాథన్‌లపై కేసు నమోదైంది.

09/22/2016 - 08:42

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెరాసలో చేరిన 12మంది తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై వచ్చే మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ మదుసూధనాచారిని హైకోర్టు బుధవారం ఆదేశించింది.

09/21/2016 - 04:12

హైదరాబాద్, సెప్టెంబర్ 20:ప్రైవేటు మేనేజ్‌మెంట్ కోటాలో లోకల్, నాన్ లోకల్ సీట్ల భర్తీకి అనుసరిస్తున్న విధానాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను హైదరాబాద్ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. జస్టీస్ వి రామసుబ్రమణ్యం, జస్టీస్ ఆనీస్‌లు ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ పిటీషన్‌ను విచారిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

09/21/2016 - 04:09

హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపుల విషయంలో మొండిగా పోతోందని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పులలోనూ, విభజన చట్టం 2014లోనూ కేటాయింపుల గురించి, ప్రాజెక్టుల గురించి స్పష్టంగా పేర్కొన్నా ఆ నిబంధనలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని చెప్పారు.

09/21/2016 - 03:33

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఎస్సీ ఎస్టీల తరహాలో బీసీల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన అధికార ప్రక్రియ వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Pages