S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/19/2016 - 03:26

హైదరాబాద్, ఆగస్టు 18: కొత్త జిల్లాలకు ప్రస్తుతానికి జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల కేటాయింపు జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో జరిగే నియామకాలకు మాత్రమే జోనల్ విధానం అవసరమా? కాదా? అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

08/19/2016 - 03:03

విజయవాడ, ఆగస్టు 18: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగానున్న పోస్టుల్లో 4వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తొలి విడతగా 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఉదయభాస్కర్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు.

08/19/2016 - 03:02

మచిలీపట్నం, ఆగస్టు 18: సర్వతోముఖాభివృద్ధికి సంకల్ప బలంతో ముందుకు సాగుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఏడోరోజైన గురువారం కృష్ణా జిల్లా హంసలదీవి సాగరసంగమ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. సాగరసంగమ క్షేత్రాన ఉన్న కృష్ణమ్మ పాదాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు.

08/19/2016 - 02:47

హైదరాబాద్, ఆగస్టు 18: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా తయారైన కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తాము ప్రతిపాదించిన ముసాయిదా మార్గదర్శకాలపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కృష్ణా నదీ జలాల బోర్డు యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. మార్గదర్శకాలను వెంటనే అమలు చేయని పక్షంలో తాము ఏమి చేయలేమని కేంద్రానికి తెలియచేసినట్లు తెలిసింది.

08/19/2016 - 03:09

విజయవాడ, ఆగస్టు 18: సోదరి, సోదరుల అనుబంధానికి నిజమైన నిర్వచనం రక్షాబంధన్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోదరీ సోదరుల వాత్సల్యాన్ని ద్విగుణీకృతం చేసేది రక్షాబంధన్ ఉత్సవమని అన్నారు. ఆడపడచులకు, అక్కా చెల్లెళ్ళకు తమ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని చంద్రబాబు చెప్పారు. మహిళా సంక్షేమానికి తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్, షీ ఆటో పథకాలను ప్రారంభించామని తెలిపారు.

08/19/2016 - 03:20

నందిగామ, ఆగస్టు 18: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తే మంచిదేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం కృష్ణా జిల్లా నందిగామకు వచ్చిన ఆమె విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలనేదే తమ అభిమతమని చెప్పారు.

08/19/2016 - 02:44

హైదరాబాద్, ఆగస్టు 18:జిఎస్‌టి బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం జరుగుతుందని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రత్యేక సమావేశం నిర్వాహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారని తెలిపారు. జిఎస్‌టి ప్రభావం రాష్ట్ర ఆదాయంపై ఏ విధంగా ఉంటుందో ప్రత్యేక సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. బిల్లు ఆమోదానికి ముందు విస్తృతంగా చర్చ అవసరం.

08/19/2016 - 02:40

హైదరాబాద్, ఆగస్టు 18: రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్చి ఆంధ్రుల అభినందనలు అందుకున్న చంద్రబాబు, విజయవాడ పేరు కూడా మార్చాల్సిన అవసరం ఉందని బెంగళూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు తంగిరాల వెంకట సుబ్బారావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడ అనే దుష్ట సమాసాన్ని బెజవాడ అనే అచ్చమైన తెలుగుపేరుగా మార్చాలని సూచించారు.

08/19/2016 - 02:39

హైదరాబాద్, ఆగస్టు 18: గ్యాంగ్‌స్టర్ నరుూం రహస్య డంప్‌లపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నరుూం ఆస్తుల లెక్కలు పోలీసులకు అంతుపట్టడం లేదు. ఎక్కడ ఎన్ని ఆస్తులున్నాయో అధికారులు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటి వరకు సిట్ గుర్తించిన ఆస్తులే దిమ్మతిరిగిపోయేలా ఉంటే.. తాజాగా గురువారం పుప్పాలగూడలో మరో ఇంటిని సిట్ అధికారులు కనుగొన్నారు. ఫర్హానా పేరుతో రిజిస్టర్ అయి ఉన్న ఇల్లు భారీ విలువగలదే.

08/19/2016 - 02:37

భద్రాచలం, ఆగస్టు 18: నరహంతకుడు నరుూం దందా సరిహద్దు రాష్ట్రం చత్తీస్‌గఢ్‌లోనూ సాగుతోందా? అవుననే వాదనకు అక్కడి పోలీసులకు లభ్యమైన ఆధారాలు బలం చేకూర్చుతున్నాయి. బుధవారం ఆ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా దబ్బాకున్నా అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో లభ్యమైన మావోయిస్టుల లేఖలో సంచలనం కలిగించే అంశాలు బయట పడ్డాయి. ఏరియా కమిటీ సభ్యుడు వర్గీస్ తమ పార్టీ అగ్రనేత జగదీశ్‌కు రాసిన లేఖ ఒకటి పోలీసులకు దొరికింది.

Pages