S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/18/2016 - 01:52

హైదరాబాద్, ఆగస్టు 17: చంద్రబాబు ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, టిడిపి వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు జనంతో మమేకం కావాలని వైకాపా అధ్యక్షుడు, ఏపి అసెంబ్లీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా కాకుండా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేయాలన్నారు.

08/18/2016 - 01:41

జగిత్యాల, ఆగస్టు 17: గ్యాంగ్‌స్టర్ నయాం ఎన్‌కౌంటర్ తదనంతరం వెలుగుచూసిన కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంఎ రవూఫ్ కిడ్నాప్ కేసులో నిందితులైన జిల్లా కేంద్రానికి సమీపంలోని నగునూర్ మాజీ సర్పంచ్ భర్త గోపి, మంథని ప్రాంతానికి చెందిన రాంబాబు అలియాస్ రమేష్‌లను బుధవారం అరెస్టు చేసి 14రోజుల రిమాండ్‌కు తరలించారు.

08/18/2016 - 01:39

హైదరాబాద్, ఆగస్టు 17: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమ వ్యవహారాలపై సిట్ దర్యాప్తులో రోజుకో ఆసక్తికరమైన, దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడవుతున్నాయి. నరుూం నేరచరిత్రతో తమకు సంబంధం లేదని, ఈ నేరగాడితో తమకు పరిచయం లేదంటూ ఇప్పటికే మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి, రిటైర్డు డిజిపి దినేష్‌రెడ్డితో పాటుగా తాజాగా మాజీ ఐపిఎస్ అధికారి శివకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రకటించారు.

08/18/2016 - 01:36

హైదరాబాద్, ఆగస్టు 17: కృష్ణాపుష్కరాల సందర్భంగా ప్రజల్లో ఉత్సాహం తాండవిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్నాన ఘట్టాల దగ్గర జనం రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని దాదాపు అన్ని స్నానపు ఘాట్ల వద్ద కూడా జనం రద్దీ అధికంగానే కొనసాగుతోంది. మొదటి రోజున ఏవిధంగా జనం కదిలి వచ్చారో..నేటికీ అంతే ఉత్సాహంగా కదిలి వస్తున్నారు.

08/18/2016 - 01:34

భువనగిరి, ఆగస్టు 17: నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీలక్ష్మినరసింహనగర్‌లో ప్లాట్ల యజమానుల నుండి నరుూం అనుచరులు పాశం శ్రీను, సందెల సుధాకర్, షకీల్ ఆక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్లాట్లను తిరిగి ఇప్పించాలని కోరుతూ 25 మంది బాధితులు సిట్ పోలీసు అధికారి శ్రీ్ధర్, భువనగిరి రూరల్ ఎస్‌ఐ సాజిదుల్లాకు బుధవారం ఫిర్యాదు చేశారు.

08/18/2016 - 01:31

రాజమహేంద్రవరం, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్‌కు విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేరుస్తుందని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం వెల్లడించారు. బిజెపి తిరంగా యాత్రలో భాగంగా మంగళవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన స్వాతంత్య్ర సమరయోధుల పార్కులోని యోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

08/18/2016 - 01:27

షాద్‌నగర్, ఆగస్టు 17: నరుూంకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాలను నరుూం భార్య హసినా, అక్క సలీమా, వాచ్‌మెన్ అబ్దుల్ మతిన్, అతని భార్య ఖలీమాలను పోలీసులు రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నారు.

08/18/2016 - 01:26

విశాఖపట్నం, ఆగస్టు 17: సంచలనం సృష్టించిన మాఫియాడాన్ నరుూం ఉదంతం తాలూకు మూలాలు విశాఖలోనూ విస్తరించినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన దర్యాప్తు సంస్థ సిట్ అధికారులు అందుకు అవసరమైన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు? విశాఖ కేంద్రంగా కూడా నరుూం తన కార్యకలాపాలు సాగించినట్టు గుర్తించి, విచారణలో భాగంగా సిట్ బృందాలు విశాఖ చేరుకున్నట్టు సమాచారం.

08/18/2016 - 01:26

హైదరాబాద్, ఆగస్టు 17: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ పి ఎస్ రాయ్‌కు ప్రతిష్టాత్మకమైన ఇస్రో ప్రతిభా అవార్డు దక్కింది. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఎర్త్ అండ్ స్పేస్ సైనె్సస్‌లో ఎన్‌ఎఎస్‌ఐ సీనియర్ సైంటిస్టుగా కొనసాగుతున్నారు. యుసిఇఎస్‌ఎస్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన డాక్టర్ కె ఎల్ రావు జియో స్పేషియల్ చైర్ ప్రొఫెసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

08/18/2016 - 01:25

న్యూఢిల్లీ,ఆగష్టు 17: విశాఖపట్నంలో మెడ్ టెక్ పార్కు ఏర్పాటు ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 19 నాడు పార్కు ప్రారంభోత్సవానికి రావాలని పలువురి కేంద్రమంత్రులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆహ్యానించారు.

Pages