S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/20/2016 - 07:14

తిరుపతి, మార్చి 19: అభివృద్ధి రంగంలో భారతదేశం ఎలా పోటీపడి ముందుకు సాగుతోందో అంతకన్నా వేగంగా దేశ ప్రజలను అనారోగ్యం పట్టి పీడిస్తోందని ఇది ప్రమాదకర సంకేతాలని ఆర్‌ఎస్‌ఎస్ నేత డాక్టర్ ప్రవీణ్‌భాయ్ తొగాడియా హెచ్చరించారు.

03/20/2016 - 07:12

హైదరాబాద్: శాసనసభా సమయాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వృధా చేస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనిత, మీసాల గీత తదితరులు ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులలో రోజాను శాసనసభలోకి అనుమతించవలసిందిగా ఆదేశాలు లేవని, ఈ విషయం శాసనసభ వ్యవహారాలు చూసుకునే వారికి తెలియదా?, సభలో వైకాపా సభ్యులు ఎందుకు నిరసన తెలియచేస్తున్నారో వారికే తెలియదని అనిత విమర్శించారు.

03/20/2016 - 03:23

శ్రీకాళహస్తి, మార్చి 19: దేశంలోని లక్ష గ్రామాల్లో ఈసారి శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు ప్రవీణ్ తొగాడియా ప్రకటించారు. శనివారం శ్రీ కాళహస్తీశ్వరాలయానికి విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించడానికి వి హెచ్ పి నిర్ణయించిందన్నారు.

03/20/2016 - 03:21

కాకినాడ, మార్చి 19: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కీలకదళంగా ఉన్న శబరి ఏరియా కమిటీ దళ డిప్యూటీ కమాండర్ మడివి దేవయ్య అలియాస్ వినోద్ తూర్పు గోదావరి జిల్లా పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయాడు. ఈమేరకు వినోద్‌ను కాకినాడ ఎస్పీ కార్యాలయంలో శనివారం విలేఖరుల వద్ద పోలీసులు ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

03/20/2016 - 03:20

భద్రాచలం, మార్చి 19: ఖమ్మం జిల్లా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గత నెల 18వ తేదీన ప్రారంభమైన 100 ఏళ్ల తర్వాత నిర్వహించే శ్రీరామాయణ మహాక్రతువు శనివారం మహాపూర్ణాహుతితో ముగిసింది. ఈ ఉత్సవంలో శ్రీశ్రీశ్రీ అహోబిల జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ దేవనాథ రామానుజ జీయర్‌స్వామి పాల్గొన్నారు. స్తపతులు ఉత్సవమూర్తులకు స్వర్ణ కవచం తొడిగి అప్పగించాక వారికి సన్మానం చేశారు.

03/20/2016 - 03:19

అనంతపురం, మార్చి 19: తుంగభద్ర రిజర్వాయర్ పరిధిలోకర్నాటక జలమండలి యథేఛ్ఛగా జల దోపిడీ సాగిస్తోంది. కర్నాటక జల మండలి ఎంతోకాలంగా ఈ అక్రమానికి పాల్పడుతుండగా ఆ జలాల్లో వాటాదారైన ఆంధ్రప్రదేశ్ మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రతి ఏటా మైనస్ ఇన్‌ఫ్లో పేరిట ఈ మేరకు జల దందా సాగిస్తోంది.

03/20/2016 - 03:14

కడప, మార్చి 19: వివిధ రాష్ట్రాలకు యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు అబ్దుల్ రెహమాన్ (52), సిజి లోకేష్ (42)లను శనివారం కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.75లక్షలు విలువ చేసే 48 ఎర్రచందనం దుంగలతోపాటు రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారు.

03/20/2016 - 03:01

ఆంధ్రభూమి బ్యూరో

03/20/2016 - 03:01

హైదరాబాద్: వ్యక్తిగతంగా, సమాజపరంగా, హక్కులపరంగా అన్యాయం జరిగినప్పుడు చివరగా ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారని, వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా న్యాయం జరిగేలా చూసే గురుతర బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరగునున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల న్యాయాధికారుల సదస్సు శనివారం స్థానిక మారియట్ హోటల్లో ప్రారంభమైంది.

03/20/2016 - 03:01

హైదరాబాద్, మార్చి 19: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వరుసగా రెండోరోజు శనివారం కూడా రోజా అంశంపై అట్టుడికిపోయింది. సభ ప్రారంభంనుండి వైకాపా ఎమ్మెల్యేలు ‘ఉయ్ వాంట్ జస్టిస్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుండగానే వైకాపా సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.

Pages