S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/17/2016 - 01:24

విజయవాడ (క్రైం), ఆగస్టు 16: ‘మీది తెనాలి.. మాది తెనాలి’.. ఈ వాక్యం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇంద్ర సినిమాలో పూజలు చేస్తామంటూ భక్తులను నమ్మకంగా మోసం చేసి బంగారంతో ఉడాయించే పాత్రలో హాస్యం పండించారు. గొప్పగా పండిన ఈ సన్నివేశం ప్రేక్షకులను అలరించింది. సరిగ్గా ఇదే పంథాలో కృష్ణా పుష్కరాల స్నాన ఘాట్‌లో పూజారి అవతారమెత్తిన ఓ దొంగ బంగారంతో ఉడాయిస్తూ దొరికిపోయాడు.

08/16/2016 - 04:00

విశాఖపట్నం, ఆగస్టు 15: ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. ప్రస్తుతం దీని ప్రభావం కోస్తాంధ్రపై ఉండదని స్పష్టం చేశారు. ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఉందని తెలిపారు.

,
08/16/2016 - 03:12

హైదరాబాద్, ఆగస్టు 15: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందులో (ఎట్ హోం) అత్యంత ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.

08/16/2016 - 02:46

హైదరాబాద్, ఆగస్టు 15: గ్యాంగ్‌స్టర్ నరుూం ముఖ్య అనుచరుల్లో ఒకరైన సమీరుద్దీన్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల వనస్థలిపురంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని తుల్జ్భావాని నగర్‌లో పట్టుబడిన నరుూం డ్రైవర్ శ్రీధర్‌గౌడ్‌ను విచారించగా, అతడు ఇచ్చిన సమాచారం మేరకు నల్గొండలో నివాసముంటున్న సమీరుద్దీన్ (26)ను సోమవారం వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

08/16/2016 - 02:46

హైదరాబాద్, ఆగస్టు 15: గ్యాంగ్‌స్టర్ నరుూం ఎన్‌కౌంటర్ తరువాత రాష్టవ్య్రాప్తంగా అతని అనుచరులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయితే వీరిని మించిన యాక్షన్ టీం ఒకటి ఉన్నట్టు సిట్ గుర్తించినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఏడుగురు సభ్యులతో కూడిన యాక్షన్ టీం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

08/16/2016 - 02:44

అనంతపురం, ఆగస్టు 15: ‘ఎపికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా రాదు... హోదా ఇచ్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ సిద్ధంగా లేరు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది’ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేక హోదా కోరుతున్నారన్నారు. అదంటే ఏమిటో చాలామందికి తెలీదన్నారు.

08/16/2016 - 02:43

హైదరాబాద్, ఆగస్టు 15: యుజి, పిజి, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల నుండి కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ధేశించిన దానికంటే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడంతో లెక్కలకు అందకుండానే వందల కోట్ల రూపాయిలు వివిధ ఖాతాల్లో ఖాయలా పడుతున్నాయి.

08/16/2016 - 02:15

హైదరాబాద్, ఆగస్టు 15: కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ తెలంగాణ సఖ్యతతో వ్యవహరిస్తోందని సిఎం కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహాన్ని కోరుతున్నామన్నారు. పోరాట తెలంగాణను ఇక బతుకు తెలంగాణగా మలిచేందుకు త్రికరణ శుద్ధితో కృషి చేస్తున్నట్టు ప్రకటించారు.

08/16/2016 - 02:12

హైదరాబాద్, ఆగస్టు 15: కొత్త జిల్లాల ఏర్పాటుకు ఖరారు చేసిన రోడ్ మ్యాప్‌లో జాప్యం జరిగినప్పటికీ మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుతో ప్రక్రియ ఉపందుకుంది. జిల్లాలవారీగా ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ ప్రక్రియను కేవలం మూడు రోజుల వ్యవధిలో పూర్తిచేయడంతో కీలక అంకం పూరె్తైంది. ఈనెల 18న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు ప్రక్రియ ఒక్కటి ముగిస్తే, దాదాపు80 శాతం ప్రక్రియ పూరె్తైనట్టేనని ప్రభుత్వం భావిస్తుంది.

08/16/2016 - 02:11

హైదరాబాద్, ఆగస్టు 15 : తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని కృష్ణా పుష్కరాల్లో భక్తి తాండవిస్తోంది. పుణ్యస్నానాలకు వస్తున్న భక్తులు భగవన్నామస్మరణలో మునిగితేలుతున్నారు. పుష్కరాలు ప్రారంభం తర్వాత భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. పైగా రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో తరలి వస్తున్నారు.

Pages