S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/10/2020 - 01:04

హైదరాబాద్, ఫిబ్రవరి 9: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రజల్లో అభూతకల్పనలు సృష్టించి ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ చట్టం వల్ల దేశంలోని ఏ ఒక్క భారతీయుడికి ఇబ్బంది కలిగినా పునరాలోచించేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

02/09/2020 - 05:26

విశాఖపట్నం: ప్రస్తుతం చట్టసభలు జరుగుతున్న తీరు చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. పార్లమెంట్ కావచ్చు, రాష్ట్రాల అసెంబ్లీ కావచ్చు. అంశాలపై చర్చను పక్కన పెట్టి రాజకీయంగా, వ్యక్తిగతంగా విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

02/09/2020 - 05:23

వరంగల్, ఫిబ్రవరి 8: ఆదివాసీల ఆకాక్షలు నెరవేరే సమయం దగ్గరలోనే ఉందని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మేడారం వచ్చారు.

02/09/2020 - 04:45

తిరుపతి, ఫిబ్రవరి 8: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే 65 సంవత్సరాలు పైబడ్డ వృద్ధులకు, దివ్యాంగులకు ఈనెల 11వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టీటీడీ 4వేల టోకెన్లను జారీ చేసింది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు.

02/09/2020 - 05:33

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టును బుద్వేలుకు తరలించి ప్రస్తుతం ఉన్న ప్రాంగణాన్ని మ్యూజియంగా మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయాధికారులు, న్యాయమూర్తులతో పాటు సిబ్బంది , సహాయకులతో సందర్శకులతోనూ, అధికారులతోనూ హైకోర్టు కిక్కిరిసిపోతుండడంతో అందరికీ అసౌకర్యంగా ఉంటోంది.

02/08/2020 - 22:37

కర్నూలు, ఫిబ్రవరి 7: మహిళలపై అత్యాచారాలు, హత్య కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు ఉరిశిక్ష విధిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి ఉరిశిక్ష అమలుపై పడింది. అసలు రాష్ట్రంలో ఎన్ని కేంద్ర కారాగారాలు ఉన్నాయి, వాటిలో ఎక్కడెక్కడ ఉరిశిక్ష అమలుకు ఉరికంబాలు ఉన్నాయి అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాష్ట్రంలో ఐదు కేంద్ర కారాగారాలు ఉన్నాయి.

02/08/2020 - 22:35

హైదరాబాద్, ఫిబ్రవరి 7: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న రద్దీ, ట్రాఫిక్ నుంచి ప్రజలకు ఊరట కలిగించడంతోపాటు ఆధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రోరైలు మొదటి దశ ప్రాజెక్టు పూర్తయింది. ఇందులో ఇప్పటికే నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు కారిడార్-3, మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకు కారిడార్-1 ప్రజలకు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

02/07/2020 - 01:26

సికిందరాబాద్, ఫిబ్రవరి 6: నిత్యం ప్రయాణికులతో రద్దీ ఉండే సికిందరాబాద్ రైల్వే సేషన్‌లో బాంబు ఉందని బెదిరింపు వచ్చింది. రైల్వే స్టేషన్ ఆవరణలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

02/06/2020 - 23:52

అమలాపురం, ఫిబ్రవరి 6: రాష్ట్రానికి మూడు రాజధానుల కంటే ఒక రాజధాని ఉండటమే మంచిదని, అయితే అది విపక్ష నేత చంద్రబాబు ఊహాత్మక అమరావతిలా కాకుండా వేరేవిధంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచి పరిణామమేనని కర్నూలుకు, వైజాగ్‌కు కొన్ని హెచ్‌వోడీ కార్యాలయాలు తరలింపును బీజేపీ సమర్ధిస్తుంది కానీ పాలన రాజధానిగా అమరావతే ఉండాలన్నారు.

02/07/2020 - 01:54

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 6: యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల మూడవ రోజు గురువారం సింహముఖుడైన శ్రీ లక్ష్మీనరసింహుడు సింహవాహన అలంకార సేవలో, అశ్వవాహన అలంకార సేవల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో నిత్యారాధనల అంతరం ప్రబంధ పారాయణాలు, యాజ్ఞీకులతో నిత్య హవనములు మూలమంత్ర జపములు పాంచరాత్రిగమరీత్యా నిర్వహించారు.

Pages