S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/08/2016 - 06:13

హైదరాబాద్, జూలై 7: ఎమ్మార్ కేసులో ఇద్దరు ఐఎఎస్ అధికారులను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతి లభించింది. ఐఎఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, బిపి ఆచార్యలను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ చేసిన విజ్ఞప్తిని కేంద్రం సమ్మతించింది. దుబాయిక్ చెందిన ఎమ్మార్‌ప్రాపర్టీస్ మల్టీనేషనల్ కంపెనీతో కుదిరిన ఒప్పందంలో ప్రభుత్వ వాటా తగ్గించడానికి బిపి ఆచార్య బాధ్యుడని సిబిఐ వాదిస్తోంది.

07/08/2016 - 05:40

తిరుమల, జూలై 7: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దక్షిణాయన ఆగమన సందర్భంగా ఈనెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానమును టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఉదయం 7 గంటలకు బంగారువాకిలి ముందుగల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంపై ఉభయదేవేరులతో శ్రీవారిని, అభిముఖంగా విష్వక్సేనులవారిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదన చేస్తారు.

07/08/2016 - 05:39

చండ్రుగొండ, జూలై 7: ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలంలో ఇటీవల మేకల కాపరులు హత మార్చిన ఒక చిరుతపులికి చెందిన గోళ్ళను గురువారం రామవరం రేంజర్ మధుసూదన్ స్వాధీనం చేసుకున్నారు. అబ్బుగూడెం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి అనే రైతు మృతి చెందిన ఒక పులికి చెందిన నాలుగు పంజాలను ఇంటికి తీసుకువచ్చి ఆవరణలో నిల్వ చేశాడు.

07/08/2016 - 05:25

హైదరాబాద్, జూలై 7: హైకోర్టు తక్షణ విభజనపై ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేసిన రాయబారం ఫలించలేదు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ ఆదేశాలతో కేంద్రదూతగా ప్రొటోకాల్ కూడా పక్కకు పెట్టి, ప్రైవేటు హోటల్‌లో బస చేసిన గవర్నర్, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. హైకోర్టు విభజనపై బాబు చాలా స్పష్టమైన వైఖరి ప్రదర్శించడమే దానికి కారణం.

07/08/2016 - 05:22

హైదరాబాద్, జూలై 7: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని సెంట్రల్ రికార్డ్సు బ్యూరోలో ఫైళ్ల విభజన ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 12 లక్షల ఫైళ్లు ఉన్నాయి. ప్రతి ఫైలును రెండుగా స్కానింగ్ చేసి రెండు రాష్ట్రాలకు ఒక్కో ప్రతిని ఇస్తారు. సచివాలయంలో రెండు స్టోర్ రూంలలో ఏళ్లతరబడి లక్షలాది ఫైళ్లు ఉన్నాయి. వీటి విభజన ఇంకా జరగలేదు.

07/08/2016 - 05:21

రుద్రవరం, జూలై 7: జమ్మూ, కాశ్మీర్‌లో పై అధికారితో జరిగిన గొడవ కారణంగా కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన వెంకటకృష్ణయ్య అధికారిపై కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మిలిటరీ అధికారులనుంచి తమకు సమాచారం అందినట్లు వెంకట కృష్ణయ్య తమ్ముడు తిరుమలేష్ తెలిపారు.

07/08/2016 - 05:16

రావులపాలెం, జూలై 7: ‘పుస్తెలు అమ్మి అయినా పులస కూర తినాలన్నది’ గోదావరి జిల్లాల్లో వాడుకలో ఉన్న నానుడి.... గోదావరిలో వరదల సమయంలో మాత్రమే దొరికే పులసలకున్న ప్రాధాన్యం అలాంటిది. రుచిలో రారాజుగా పేర్కొనే ఈ చేప ధరలోనూ చుక్కల్లో సమ్రాట్టే. గోదావరి నదికి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గత కొద్ది రోజులుగా ఎర్ర నీరు వచ్చి చేరడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో పులసల సందడి మొదలైంది.

07/08/2016 - 05:14

అనంతపురం, జూలై 7: అంతర్జాతీయ స్థాయిలో కోట్లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ముఠా నాయకుడు నరసింహతో పాటు మరో ఐదుగురిని అరెస్టుచేశారు. వీరి నుంచి రూ.20 లక్షల నగదు, 10 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఎస్‌వి రాజశేఖర్‌బాబు తెలిపారు. ఈ ముఠాలో మరో 43 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు.

07/08/2016 - 05:10

విశాఖపట్నం, జూలై 7: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బిజెపి, టిడిపి ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలయమయ్యాయని, చంద్రబాబు నాయుడు నియంతగా వ్యవహరిస్తున్నారని, ప్రధాని మోదీ అబద్ధాలకోరని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలను అధికార యంత్రాంగం కాకుండా టిడిపి కార్యకర్తలు అమలు చేస్తున్నారని విమర్శించారు.

07/08/2016 - 06:43

హైదరాబాద్/నల్లగొండ, జూలై 7: దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆదాయ వృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. పరిపాలనలో కెసిఆర్‌ను దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా ఒక సర్వేలో దేశ ప్రజలు ఎంపిక చేశారు. ఇలా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్రం మరో రికార్డును సాధించే దిశగా అడుగులు వేస్తోంది. మొక్కలు నాటడంలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించబోతోంది.

Pages