S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/08/2016 - 04:58

హైదరాబాద్, జూలై 7: గర్భిణులు..నవజాత శిశువులకు వైద్యం అందించటంలో జాతీయ స్థాయిలోనే పేరుగాంచిన నిలోఫర్ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో రోగులకు వైద్యం వికటించిన వార్త దావానలంలా వ్యాపించడంతో స్పందించిన డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు గురువారం నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులకు, గర్భిణులకు ఇస్తున్న జంక్షన్లు, సెలైన్‌లను తనిఖీ చేశారు.

07/08/2016 - 04:57

హైదరాబాద్, జూలై 7: తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు శనివారం నిర్వహిస్తున్న ఎమ్సెట్-2కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పరీక్షకు 56,188 మంది దరఖాస్తు చేశారు. ఏపిలో కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9న ఉదయం 10 నుండి ఒంటిగంట వరకూ పరీక్ష జరుగుతుంది. అదే రోజు సాయంత్రం తొలి కీ విడుదల చేస్తారు. దానిపై విద్యార్థుల నుండి 12 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు.

07/08/2016 - 04:48

హైదరాబాద్, జూలై 7: కృష్ణా జలాల వివాదాలపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట శుక్రవారం నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం, శనివారం వరుసగా రెండు రోజుల వాదనల తరువాత తిరిగి ఈనెల 14, 15 తేదీల్లో తదుపరి వాదనలు జరుగుతాయి. రెండు దశలుగా నాలుగు రోజుల పాటు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ, ఆంధ్ర తమ వాదనలు వినిపిస్తాయి.

07/08/2016 - 04:48

విజయవాడ, జూలై 7: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రజా సాధికారిక సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) ప్రారంభం కానుంది. ఈనెలాఖరులోగా అంటే 22 రోజుల్లోగా ఈ సర్వేను రాష్టవ్య్రాప్తంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి నివాస గృహం నుంచి ఈ సర్వేను శుక్రవారం ప్రారంభించనున్నారు. సర్వేలో వివరాలు ఇచ్చేందుకు సిఎం కుటుంబ సభ్యులంతా ఇప్పటికే ఉండవల్లిలోని సిఎం నివాస గృహానికి చేరుకున్నారు.

07/08/2016 - 04:45

విజయవాడ, జూలై 7: తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సమీక్ష జరిపేందుకు పది మందితో ఒక కమిటీని వేయాలని పార్టీ సమన్వయ కమిటీ నిర్ణయించింది. ఇందులో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, దేవినేని ఉమ, విప్ కాలువ శ్రీనివాసులు, వైవిబి రాజేంద్ర ప్రసాద్, జవహర్, మల్లిఖార్జున రెడ్డి, ఎంపి రామ్మోహనాయుడు సభ్యులుగా ఉంటారు.

07/08/2016 - 04:42

విజయవాడ, జూలై 7: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై వీరిద్దరూ చర్చించారు. కృష్ణా జలాల వివాదం, హైకోర్టు విభజన, 9,10 షెడ్యూల్‌లో ఆస్తుల పంపకం, విద్యుత్ ఉద్యోగుల తొలగింపువంటి అనేక అంశాలపై ఎపి, టిఎస్ ప్రభుత్వాలు నిత్యం గొడవపడుతున్న సంగతి తెలిసిందే.

07/08/2016 - 04:39

విజయవాడ, జూలై 7: రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి ప్లాట్‌లు మంజూరు చేస్తోంది. ఈ ప్లాట్లన్నింటినీ సమీకరించి భారీ భవంతులు నిర్మించేందుకు వివిధ నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో క్యాపిటల్ రీజియన్ డవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఏ) రైతులు, డవలపర్స్, బిల్డర్లతో గురువారం సమావేశం ఏర్పాటు చేసింది.

07/08/2016 - 04:49

కాకినాడ, జూలై 7: ఒక కుటుంబాన్ని కిడ్నీ వ్యాధి కబళించింది. ఒకే కుటుంబంలోని యుక్తవయస్కులైన ముగ్గురు కుమారులకు కిడ్నీలు పాడయ్యాయి. వైద్యం చేయించినా బతకడం కష్టమని భావించిన తల్లి వారితో కలిసి ఆత్మహత్యకు ఒడిగట్టింది.

07/07/2016 - 06:36

నేడు రంజాన్
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు.
-ఎడిటర్

07/06/2016 - 03:53

కాకినాడ, జూలై 5: ఇంటర్మీడియెట్ బోర్డులో సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధించి ఎంసెట్-2016 తుది ర్యాంకులను బుధవారం జెఎన్‌టియుకె వెల్లడించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియెట్ సహా ఇతర బోర్డులు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధించి ఈ ఫైనల్ ర్యాంకులను వెల్లడించనున్నట్టు ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు చెప్పారు.

Pages