S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/06/2016 - 03:36

హైదరాబాద్, జూలై 5: బిజెపికి అనుబంధంగా ఉన్న లాయర్లు మంగళవారం నిర్వహించాలనుకున్న ‘్ఛలో రాజ్‌భవన్’ ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి గాంధీ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర హైకోర్టు విభజన, న్యాయాధికారుల సస్పెన్షన్ వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి లీగల్ సెల్ ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించింది.

07/06/2016 - 03:33

హైదరాబాద్, జూలై 5: తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న ఎమ్సెట్-2కు దరఖాస్తు గడువు బుధవారంతో ముగుస్తుంది. ఎమ్సెట్-2 నిర్వహణకు ఎమ్సెట్ కమిటీ ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. 6వతేదీన 10వేల రూపాయిల అదనపు ఫీజుతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇంత వరకూ 56,183 మంది ఎమ్సెట్-2కు దరఖాస్తు చేశారు.

07/06/2016 - 03:00

హైదరాబాద్, జూలై 5: కృష్ణానదీ జలాల పంపిణీపై సచివాలయంలో మంగళవారం జరిగిన కీలక సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే అర్ధాంతరంగా వాయిదాపడింది. జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదలశాఖ కార్యదర్శులు సమావేశమై నిర్ణయంచుకోవాలని కేంద్ర జల వనరులశాఖ ఆదేశించిన విషయం తెలిసిందే.

07/06/2016 - 02:58

తొగుట, జూలై 5: ప్రజల జీవితాలకు నష్టం కలుగకుండా సాగునీరు అందిస్తామంటే ఎవరూ వద్దనరని, ఊళ్లను ముంచే ప్రాజెక్టు నిర్మించాలనుకోవడాన్ని వ్యతిరేకిస్తామని టిజెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. మంగళవారం మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదన- ఒక చర్చ సదస్సును మెదక్ జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదన్నారు.

07/06/2016 - 02:47

ఏలూరు, జూలై 5 : ఎన్నో సీజన్లుగా సరైన పంటకు నోచుకోని కృష్ణా డెల్టా రైతాంగంలో ఆశల హరివిల్లు విరుస్తోంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి మరోసారి కృష్ణాడెల్టాకు సాగునీరు అందిం చే ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

07/06/2016 - 02:45

హైదరాబాద్, జూలై 5: ర్యాంకుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌లో పెట్టిన సమాచారాన్ని కాపీ కొట్టిందంటూ టి- సర్కార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశంలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఎక్కడొందో వివిధ అంశాలపై పరిశీలించి కేంద్రం ర్యాంకు లు ఇస్తుంది.

07/06/2016 - 02:36

విశాఖపట్నం, జూలై 5: ఇంధన పొదుపును పెంపొందించడంతో పాటు గరిష్ట స్థాయిలో సామర్థ్యాన్ని ఇనుమడింపచేసేకునే అంశంపై దృష్టి సారించాలని మంగళవారం ఇక్కడ ముగిసిన బ్రిక్స్ దేశాల సదస్సు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణ, పరిశోధనతో ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తూ ముసాయిదా తీర్మానాన్ని చేపట్టింది.

07/06/2016 - 02:33

హైదరాబాద్, జూలై 5: హైకోర్టు విభజన, తెలంగాణకు ఆంధ్ర న్యాయాధికారుల కేటాయింపు అంశాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న తెలంగాణ న్యాయాధికారులు బుధవారం నుంచి విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. న్యాయాధికారులు రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లిన అంశంపై హైకోర్టు ఆగ్రహించి 11మంది న్యాయాధికారులను సస్పెన్షన్ చేసిన విషయం విదితమే.

,
07/06/2016 - 02:25

హైదరాబాద్/శంషాబాద్, జూలై 5: ఇద్దరూ ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారు. భర్తపై ప్రేమతో ఎక్కడో ఆఫ్రికా దేశం కాంగో నుంచి భారత్‌కు వచ్చి భర్తతో అన్యోన్యంగానే కాపురం చేస్తోంది. ఇద్దరికీ ముద్దులొలికే కూతురూ జన్మించింది. ఎనిమిదేళ్ల పాటు సంతోషంగానే గడిపారు. వాళ్ల కాపురంలోకి ఫేస్‌బుక్ నట్టింట మృత్యువులా ప్రవేశించింది. ఫేస్‌బుక్‌లో ఆమె ఓ విదేశీ కుర్రాడితో మొదలుపెట్టిన స్నేహం, చాటింగ్ ప్రేమగా మారి..

07/06/2016 - 02:19

హైదరాబాద్, జూలై 5: పాతబస్తీలో ఎన్‌ఐఏ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదుల కొరియర్లపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులు హబీబ్, ఇబ్రహీం ఇచ్చిన సమాచారం ఆధారంగా తలాబ్‌కట్టా, బార్కస్‌లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో 17 బుల్లెట్లు, రెండు కంప్యూటర్లు, రెండు స్కానర్లు స్వాధీనం చేసుకున్నారు.

Pages