S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

,
07/06/2016 - 02:18

హైదరాబాద్, జూలై 5: ఇప్పటి వరకూ అన్ని అంశాల్లోనూ పైచేయి సాధిస్తూ వస్తోన్న తెదేపాపై ఈసారి తాము విజయం సాధించామని భాజపా నేతలు విశే్లషిస్తున్నారు. విజయవాడలో గుళ్ల కూల్చివేత అనంతర పరిణామాలపై విశే్లషణ చేసుకున్న భాజపా నేతలు, ఈ అంశం రాష్ట్రంలో బిజెపి బలాన్ని, వ్యూహాన్ని, నేతలను తక్కువగా అంచనా వేయవద్దన్న హెచ్చరిక సంకేతాలను తెదేపాకు పంపిందని వ్యాఖ్యానిస్తున్నారు.

07/06/2016 - 02:13

హైదరాబాద్, జూలై 5: తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆంధ్ర స్థానికత ప్రాతిపదికన బలవంతంగా రిలీవ్ చేసిన ఉద్యోగులు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిను విజయవాడలో కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. చంద్రబాబును కలిసిన వారిలో తెలంగాణ విద్యుత్ సంస్థల రిలీవ్డ్ ఎంప్లారుూస్ జెఏసి కన్వీనర్ ఎన్ గిరిధర్, చైర్మన్ ఎం సురేంద్ర, కో చైర్మన్ కె బాబూరావు ఉన్నారు.

07/06/2016 - 02:09

హైదరాబాద్, జూలై 5 : ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన తుదిదశకు చేరింది. కమలనాథన్ కమిటీ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశానికి ఇరు రాష్ట్రాల నుండి అధికారులు హాజరయ్యారు. ఐదు శాఖలు మినహా మిగతా అన్ని శాఖల ఉద్యోగుల విభజన పూర్తయిందని సిఆర్ కమలనాథన్ తెలిపారు.

07/06/2016 - 02:08

హైదరాబాద్, జూలై 5: ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులకు సంబంధించిన ఉత్తర్వులను ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు విడుదల చేసింది. ఇందులో 179 ఇంజనీరింగ్, 10 ఆర్కిటెక్చర్, రెండు ప్లానింగ్ కాలేజీల ఫీజులను ఖరారు చేశారు. దాంతో పాటు 73 ఫార్మసీ, 29 ఫార్మా డి కాలేజీల ఫీజులను సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజనీరింగ్‌లో గరిష్ట ఫీజు 1,13,500 రూపాయిలు సిబిఐటికి దక్కింది. కనిష్ట ఫీజు 35వేలుగా నిర్ణయించారు.

07/06/2016 - 02:07

హైదరాబాద్, జూలై 5: నెలవంక దర్శనం (మంగళవారం) కాలేదు. దీంతో రంజాన్ (ఈద్-ఉల్-్ఫతర్) పండుగను ఈ నెల 7న (గురువారం) జరుపుకోవాలని ఢిల్లీ జామా మసీదు ఇమామ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 7, 8 తేదీలు సెలవు దినాలుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా సెలవును 7వ తేదీకే మార్చింది.

07/06/2016 - 02:06

హైదరాబాద్, జూలై 5: రంగారెడ్డి జిల్లాలో దొంగ ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన 51 మంది టీచర్ల గుట్టురట్టు కావడంతో అదే తరహాలో మిగిలిన జిల్లాల్లో ఇంకా ఎంత మంది ఉద్యోగులు నకిలీ పత్రాలతో ఉద్యోగాలు పొందారో ప్రభుత్వం రహస్య పరిశీలన జరపుతోంది. ఇదే తరహాలో రంగారెడ్డి జిల్లాలోనే మరో పది మంది టీచర్లు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్టు చెబుతున్నారు.

07/06/2016 - 02:05

హైదరాబాద్, జూలై 5: ఈ నెల 14, 15 తేదీల్లో జాతీయ రహదారుల నిర్మాణంలో ఉపయోగించే నూతన టెక్నాలజీ అంశంపై సదస్సును ఇక్కడ నిర్వహిస్తున్నట్లు సిఐఐ ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో టెక్నాలజీలో ఉత్తమ పద్ధతులను అమలు చేయడంపై నిపుణులు ప్రసంగిస్తారన్నారు.

07/06/2016 - 02:04

హైదరాబాద్, జూలై 5: అసెంబ్లీ ఆవరణలోని తెలుగు దేశం లెజిస్లేచర్ పార్టీ (టి.టిడిఎల్‌పి) ఆఫీసుపై వివాదం నెలకొంది. టి.టిడిపికి ముగ్గురే ఎమ్మెల్యేలు ఉన్నందున ఆఫీసును ఖాళీ చేయాల్సిందిగా నోటీసు జారీ చేసినట్లు అసెంబ్లీ అధికారులు చెబుతుండగా, అసలు తమకు నోటీసు ఇవ్వలేదని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

07/05/2016 - 07:51

విజయవాడ, జూలై 4: కృష్ణా పుష్కరాలకు కేవలం 38 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. పుష్కరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రాజధాని బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా విజయవాడ నగరంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు పుష్కరుడు కృష్ణలో ప్రవేశించే పుణ్యకాలం నాటికి కూడా పూర్తయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి.

07/05/2016 - 07:49

హైదరాబాద్, జూలై 4: ఒక పెద్ద ఆసుపత్రికి ఎంత స్థలం కావాలి? మహా అయితే 30 ఎకరాలు. మరి ఒక కాలేజీకి ఎంత స్థలం కావాలి? మామాలుగా బిట్స్ పిలానీకి సర్కారు ఇచ్చిందే 30 ఎకరాలు. ప్రసిద్ధ సిల్వన్ ఇన్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ కాలేజీకి భూమి అడిగితే ప్రభుత్వం ఇచ్చింది కేవలం ఐదెకరాలు. వీటికి సర్కారు ఇచ్చిన భూమి తక్కువయినా సదరు సంస్థలు మిగిలిన భూమిని ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేశాయి.

Pages