S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/11/2016 - 08:21

గుంటూరు, ఫిబ్రవరి 10: గుంటూరు జిల్లాలోని 18 మండలాలను వ్యవసాయ జోన్‌లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంపై అన్నదాతల నుండి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ మండలాలను రాజధాని ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో మరికొన్ని మండలాలను వ్యవసాయ జోన్‌లుగా ప్రకటించింది.

02/10/2016 - 07:44

కర్నూలు, ఫిబ్రవరి 9: పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డికి క్షమాపణ చెప్పామని ఎఐసిసి కార్యదర్శి తిరునావుక్కరసు స్పష్టం చేశారు. అనంతపురంలో రాహుల్ గాంధీ సభ సందర్భంగా జరుగకూడని సంఘటన జరిగిందని విచారం వ్యక్తం చేశారు.

02/10/2016 - 07:43

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 9: కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా చోటుచేసుకున్న వివిధ సంఘటనల విషయంలో రాష్ట్రప్రభుత్వం ఎలా వ్యవహరించినప్పటికీ రైల్వే కేసులు మాత్రం ఆందోళనకారులను వెంటాడేలా ఉన్నాయి. గత నెల 31న తుని సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు కొంత మంది నిప్పుపెట్టిన సంగతి విదితమే.

02/10/2016 - 07:41

విజయవాడ: బిసి జాబితాలోకి ఇప్పటికే 140 కులాలు చేరటంతో ఆశించిన ప్రయోజనాలు చేకూరనందున ఇక ఏ ఒక్క కులాన్ని కూడా చేర్చినా సహించేది లేదంటూ బిసి జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిసి సంఘాలన్నింటితో సంయుక్త కార్యాచరణ కమిటీని ఏర్పాటుచేసి పోరాటాలు సాగించబోతున్నామని ఆయన వెల్లడించారు.

02/10/2016 - 07:39

రాజమహేంద్రవరం: రిజర్వేషన్ల విషయంలో కాపు సామాజిక వర్గీయులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేస్తారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో 1996నుంచి తాము మోసపోతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

02/10/2016 - 06:59

విశాఖపట్నం: పవర్‌గ్రిడ్ పరిస్థితిపై విశాఖ నగరంలో కీలక సమీక్ష జరగనుంది. దక్షిణ ప్రాంత సమన్వయ కమిటీ, ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో దీనిని వచ్చేనెల 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. దక్షిణ ప్రాంతాలకు సంబంధించి పవర్‌గ్రిడ్ బెంగళూరులో ఉంది.

02/10/2016 - 06:54

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు ఆద్యంతం భక్తిపారవశ్యం మధ్య భక్తుల నిర్విరామ గోవిందనామ స్మరణలతో కనులపండువగా కొనసాగుతున్నాయి.

02/10/2016 - 01:14

విజయవాడ: ఖబడ్దార్ చంద్రబాబూ.. ఖబడ్దార్ రాజకీయ నాయకుల్లారా... ఓటు రాజకీయాల కోసం వత్తిళ్లకు లొంగి కాపులను బిసిలుగా గుర్తించే ప్రయత్నం చేస్తే పీఠాలు కదలగలవంటూ బిసి సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు, శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

02/09/2016 - 07:08

రాజమహేంద్రవరం/కాకినాడ, ఫిబ్రవరి 8: కాపులను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు సోమవారం దీక్ష విరమించటంతో గోదావరి జిల్లాలు సద్దుమణిగాయి. ఈనెల 31న తునిలో కాపు ఐక్య గర్జన బహిరంగ సభ సందర్భంగా విధ్వంసం జరిగినప్పటి నుండి గోదావరి జిల్లాల కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఏ సమయంలో ఎలాంటి ఆందోళనలు చెలరేగుతాయి?

02/09/2016 - 07:07

శ్రీకాళహస్తి : తై అమావాస్య సందర్భంగా శ్రీ కాళహస్తి క్షేత్రంలో సోమవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. శ్రీ కాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను సమీపంలోని భరద్వాజ తీర్థంలోకి తీసుకెళ్లి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. నవభారత్ యువజన సంఘం వారు అన్నదానం నిర్వహించారు.

Pages