S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/04/2016 - 05:25

హైదరాబాద్, జూలై 3: కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారుల కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు కలెక్టర్లు తమ తుది నివేదికను మంగళవారం అందించనున్నారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కచ్చితమైన రోడ్‌మ్యాప్‌ను కూడా అధికారులు రెడీ చేశారు. ఈ రోడ్‌మ్యాప్‌ను అనుసరించే కచ్చితమైన కాలవ్యవధిలో కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

07/04/2016 - 05:22

హైదరాబాద్, జూలై 3: తెలంగాణలో కార్పొరేట్‌తో సహా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు సోమవారం నుండి పూర్తిగా బంద్ అవుతున్నాయి. ఇప్పటికే గత గురువారం నుండి చిన్న ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. ఆదివారం జరిగిన ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యాల కోర్ కమిటీ సమావేశంలో కార్పొరేట్‌తో సహా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

07/04/2016 - 05:18

హైదరాబాద్, జూలై 3: నగరంలో బాలికలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కామాంధులు పసి ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా నగరంలో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు బాలికలు, ఓ మహిళ అత్యాచారానికి గురయ్యారు. ఈ కిరాతక ఘటనలు బొల్లారం, శంషాబాద్, గోల్కొండ పోలీసు స్టేషన్‌ల పరిధిలో జరిగాయ.

07/04/2016 - 05:11

విజయవాడ, జూలై 3: ధర్మకర్తలు, సంబంధిత వ్యక్తులు భక్తులతో చర్చించకుండా ఇక దేవాలయాల జోలికి ప్రభుత్వం వెళ్లదని ఆదివారం సాయంత్రం జరిగిన అత్యవసర సమావేశంలో ఐదుగురు రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. ఇక ఈ వివాదంపై రాద్ధాంతం చేయవద్దని మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు.

07/04/2016 - 05:11

విశాఖపట్నం, జూలై 3: అంతర్జాతీయ ఇంధన సదస్సుకు విశాఖ మరోసారి వేదిక కానుంది. సోమ, మంగళ వారాల్లో బ్రిక్స్ అంతర్జాతీయ ఇంధన సదస్సును నిర్వహించేందుకు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. గ్రీన్ ఎనర్జీకి, ఇంధన పొదుపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి గుర్తింపుగా సదస్సు నిర్వహణ బాధ్యతను ఏపీ సర్కార్‌కు కేంద్రం అప్పగించింది.

07/04/2016 - 05:12

న్యూఢిల్లీ, జూలై 3: తెలుగు రాష్ట్రాల్లో సమస్యాత్మకంగా మారిన ఉమ్మడి హైకోర్టు వ్యవహారాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజేఐ) టిఎస్ ఠాకూర్ తెలిపారు. ఆదివారం ఢిల్లీ లో తనను కలిసిన తెలంగాణ న్యాయవాదులతో ఆయన మాట్లాడుతూ హైకోర్టుకు సంబంధించిన అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని, నిరసనలను మానుకోవాలని సూచించారు.

07/04/2016 - 04:53

హైదరాబాద్, జూలై 3: విద్యుత్ రంగంలో ఆంధ్ర పంట పండింది. నవ్యాంధ్రగా అవతరించిన రెండేళ్లలోనే మిగులు విద్యుత్ సాధించిన ఏపికి కొవ్వాడలోప్రతిపాదిత అణు విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తిలో సగం విద్యుత్‌ను కేటాయించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్రానికి కేంద్రం తెలియచేసింది. ఈ విద్యుత్‌ను చాలా చౌకగా ఏపికే విక్రయించనుంది.

07/04/2016 - 04:50

విజయవాడ, జూలై 3: కృష్ణా పుష్కరాలకు ఘాట్లు, రహదారుల విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు 40కి పైగా దేవాలయాలను కూల్చివేయడం మిత్రపక్షాలైన తెలుగుదేశం, బిజెపిల మధ్య కార్చిచ్చు రేపుతున్నది. ఆదివారంనాడు బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఇతర నాయకులతో కలసి ఆదివారం నగరానికి చేరుకుని పలు ప్రాంతాల్లో కూల్చివేసిన ఆలయాలను సందర్శించారు.

07/04/2016 - 05:15

హైదరాబాద్, జూలై 3: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకంపై తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబి పాండ్యాను నియమించారు. ఈ కమిటీలో కేంద్ర జల సంఘం సీనియర్ ఇంజనీర్లు ఏకె బజాజ్, సురేష్ చంద్రను సభ్యులుగా నియమించారు.

07/04/2016 - 00:09

గుంటూరు, జూలై 3: రాజధాని అమరావతి యాక్సిస్ రోడ్డు నిర్వాసితులకు ప్రభుత్వం ఇప్పటికీ ప్యాకేజీ ప్రకటించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వెంకటపాలెం మొదలు కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, పెనుమాక, తుళ్లూరు వరకు 21 కిలోమీటర్ల పరిధిలో యాక్సిస్ రోడ్డు ఏర్పాటు కానుంది. రూ. 235 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ రహదారి పనులను నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది.

Pages