S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/03/2016 - 05:23

ఖమ్మం, జూలై 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ సమస్యలను జఠిలం చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వ రరావు ఆరోపించారు. శనివారం ఆయన ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ, హైకోర్టు విభజన సరైంది కాదని ఏపి పాలకులు అనటం విడ్డూరంగా ఉంద న్నారు.

07/03/2016 - 05:46

ఇల్లెందు, జూలై 2: ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంతంలోని ఓపెన్‌కాస్టు మట్టిదిబ్బలలో శనివారం ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. పొట్టకూటి కోసం ట్రాక్టర్ పనికివెళ్ళిన వజ్జా రాంబాబు (29), బి.సీతారాములు (46) విధినిర్వహణలో ఉండగా మట్టిపెళ్లలు మీదపడి మృతిచెందారు. మండల పరిధిలోని దనియాలపాడు గ్రామానికి చెందిన వారితోపాటు మరో ఇద్దరు ట్రాక్టర్ లోడింగ్, అన్‌లోడింగ్‌తో బతుకు సాగి స్తున్నారు.

07/03/2016 - 05:49

పాల్వంచ, జూలై 2: ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఇద్దరు విద్యార్థినులు ముర్రేడువాగులో పడి మరణించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావు న్నా యి. మున్సిపాలిటీ పరిధిలోని కుంటినాగులగూడెం గ్రామానికి చెందిన మోకాళ్ళ శిరీష (14), ములకలపల్లి మండలం వే ముకుంట గ్రామానికి చెందిన మడకం రోహిణితో (9) కలిసి బట్టలు ఉతికేందుకు ముర్రేడువాగు వద్దకు వెళ్ళారు.

07/03/2016 - 04:20

నెల్లూరు, జూలై 2: నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో దుగరాజపట్నం తీరం వద్ద పోర్టు నిర్మాణం ఇప్పట్లో సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ పోర్టు నిర్మాణం లాభసాటిగా ఉండదన్న నిపుణుల నివేదికతో దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుపై జిల్లా వాసుల్లో ఉన్న ఆనందం ఆవిరైపోయింది. గత యుపిఎ ప్రభుత్వం ఈ పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.

07/03/2016 - 03:45

ఆదిలాబాద్,జూలై 2: సుప్రీంకోర్టు తీర్పు మేరకు గోదావరిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో శనివారం ఆదిలాబాద్ జిల్లా బాసరలో ప్రవేశించిన గోదావరి జలకళతో ఉట్టిపడింది.

07/03/2016 - 03:35

విశాఖపట్నం, జూలై 2: ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఆవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మారథాన్ పరుగు రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలుపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ వాసులు ఉత్సాహంగా మారథాన్‌లో పాల్గొన్నారు. దేశ చరిత్రలోనే తొలి సారిగా విశాఖ సాగర తీరంలో నిర్వహించిన వైజాగ్ స్టీల్స్ నైట్ బే మారథాన్‌ను శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు.

07/03/2016 - 03:03

హైదరాబాద్, జూలై 2 : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వరంగల్‌లో వ్యవసాయ కాలేజీ ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ అంగీకరించింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి పేరిట ఈమేరకు శనివారం జీవో జారీ అయ్యంది.

07/03/2016 - 03:03

హైదరాబాద్, జూలై 2: హరితహారంలో గ్రామ పంచాయితీలు కీలక పాత్ర పోషించాలని, గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేలా చూడాలని పంచాయితీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయితీ పరిధిలో ఖాళీ స్థలాలు, అక్కడ పెట్టాల్సిన మొక్కలపై పంచాయితీ సెక్రటరీల ద్వారా వివరాలు తెప్పించాలని అధికారులను ఆదేశించారు.

07/03/2016 - 03:01

హైదరాబాద్, జూలై 2: దేశ చరిత్రలో తొలిసారిగా న్యాయాధికారులు న్యాయం కోసం రోడ్కెక్కడంతో సమస్య పరిష్కారంపై కేంద్రంతోపాటు సుప్రీంకోర్టు దృష్టి సారించింది. కేంద్రం ఈ వివాదానికి సంబంధించి గవర్నర్‌ను సమాచారం కోరినట్టు తెలిసింది. గవర్నర్ నరసింహన్‌ను సిఎం కెసిఆర్ శనివారం కలిశారు. దాదాపు గంటపాటు గవర్నర్‌తో చర్చించి, సమస్య తీవ్రతను వివరించారు.

07/03/2016 - 02:59

ఆదిలాబాద్, జూలై 2: గోదావరి జలాలపై అంతర్రాష్ట్ర జలమండలి కుదుర్చుకున్న ఒప్పందాలకు మహారాష్ట్ర అంగీకారం తెలుపడంతో తెలంగాణ ప్రభుత్వం స్వల్ప మార్పులతో బ్యారేజీ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రతిష్టాత్మకమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదిలాబాద్ ప్రాజెక్టుగా మారుస్తూ జీవో 607ను జారీ చేసింది.

Pages