S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/03/2016 - 02:56

హైదరాబాద్, జూలై 2: గోదావరిపై నిర్మించతలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగానే, ఆ పనులకు సమాంతరంగా లిఫ్ట్‌ద్వారా నీటిని ఎల్లంపల్లి ద్వారా దిగువ రిజర్వాయర్లకు మళ్లించేలా కార్యాచరణ రూపొందించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని సిఎం కెసిఆర్ సమీక్షించారు.

07/03/2016 - 02:53

హైదరాబాద్, జూలై 2: జల సంరక్షణ, భూగర్భ జలాల వృద్ధి ప్రధాన లక్ష్యంగా చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి ఐదువేల కోట్లు కేంద్ర సాయం అందించాలని సిఎం కె చంద్రశేఖర్ రావు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. వచ్చే మూడేళ్లలో మిషన్ కాకతీయ కోసం ఐదువేల కోట్లు అందించాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను సిఎం ఈ లేఖ ద్వారా జైట్లీకి గుర్తు చేశారు.

,
07/03/2016 - 02:53

భైంసా రూరల్, జూలై 2: ప్రేమ వేధింపులకు 18 ఏళ్ల యువతి బలైపోయంది. ప్రేమిస్తున్నానంటూ ఏడాదిన్నరగా వెంటపడి వేధిస్తూ, శనివారం పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే కత్తితో దాడిచేసి హతమార్చిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా భైంసాలోని గోపాల్‌నగర్ కాలనీలో సంచలనం రేకెత్తించింది.

07/03/2016 - 02:48

హైదరాబాద్, జూలై 2: త్వరలోనే హైదరాబాద్‌లో డేటా ఎనలిటిక్ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు ఐటి మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. హోటల్ తాజ్ కృష్ణలో శనివారం డిజిటల్ ట్రయల్ బ్లేజర్స్ అవార్డుల ప్రదానోత్సవానికి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్య్రకమంలో కెటిఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోని ఐదు అత్యున్నత ఐటి కంపెనీల్లో నాలుగు కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు.

07/03/2016 - 02:35

విజయవాడ, జూలై 2: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇవోగా ఐఎఎస్ అధికారిణి ఎ సూర్యకుమారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దుర్గ గుడికి ఐఎఎస్ అధికారిని ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమించడం ఇదే మొదటిసారి. 2008వ బ్యాచ్‌కు చెందిన సూర్యకుమారి ప్రస్తుతం చీఫ్ కమిషనర్‌కు కార్యదర్శి (ల్యాండ్ అడ్మిస్ట్రేషన్)గా విధులు నిర్వహిస్తున్నారు.

07/03/2016 - 02:33

విజయవాడ, జూలై 2: కృష్ణాడెల్టా రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించుకునేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి నీటిమట్టం 14 అడుగులకు మించి ప్రవహిస్తున్న దృష్ట్యా ఈ నెల 6న పట్టిసీమ పథకం 24 పంపుల ద్వారా నీటిని పోలవరం కుడి ప్రధాన కాలువకు మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు.

07/03/2016 - 02:30

న్యూఢిల్లీ, జూలై 2: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి భోసలే శనివారం ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఎస్ ఠాకూర్‌ను కలిసి అత్యంత వివాదాస్పదంగా మారిన ఉమ్మడి హైకోర్టు విభజనపై సమాలోచనలు జరిపారు. గతరాత్రి ఢిల్లీకి వచ్చిన భోసలే శనివారం ఉదయం ఠాకూర్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.

07/03/2016 - 02:25

హైదరాబాద్, జూలై 2: పార్టీ మారిన 13 మంది వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులపై ఆ పార్టీ సభ్యులు ఇచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించినట్లు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ఎన్నికల్లో తాను 11 కోట్లు ఖర్చు చేశానన్న ఆరోపణలను త్రోసిపుచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

07/03/2016 - 02:22

విజయవాడ, జూలై 2: కృష్ణా పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులు, భక్తుల కోసం తలపెట్టిన ఏర్పాట్లు ఈ నెలాఖరులోగా పూర్తికావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, గడువులోగా పూర్తి చేయకుంటే చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు.

07/03/2016 - 02:18

హైదరాబాద్, జూలై 2: కాకినాడకు సమీపంలోని వాకలపూడి వద్ద ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ సంస్థకు 48 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ఇక్కడ ఫ్లోటింగ్ స్టోరేజి, రీ గ్యాసిఫికేషన్ యూనిట్‌ను ఎల్‌ఎన్‌జి టెర్మినల్ కోసం నిర్మిస్తారు. దీని నిమిత్తం ఈ భూమిని కేటాయించారు.

Pages