S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/03/2016 - 02:17

గుంటూరు, జూలై 2: స్నానానికి వెళ్లి పంటకుంటలో పడి నలుగురు విద్యార్థులు మృతిచెందిన సంఘటన శనివారం సాయంత్రం గుంటూరు జన్మభూమినగర్‌లో జరిగింది. స్తంభాలగరువు హాస్టల్‌లో 9, 10 తరగతులు చదువుతున్న సంకుల కార్తీక్ (13), నేర్లకంటి రామకృష్ణ (17), దక్షిణామూర్తి ఈశ్వర్ (13), ఒంటెద్దు రవి (12)లతోపాటు మరో ఇద్దరు విద్యార్థులు స్నానం చేసేందుకు సమీపంలోని పంటకుంటలో దిగారు.

07/03/2016 - 02:16

హైదరాబాద్, జూలై 2: వివాదాస్పదంగా మారిన విజయవాడ దేవాలయాల కూల్చివేతల వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సీరియస్ అయింది. దీంతో ఇప్పటివరకూ ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చిన బిజెపి నేతల్లో కూడా చురుకుదనం మొదలయింది. చివరకు ఏపి సీఎం చంద్రబాబు కూడా స్పందించి, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలని ఆదేశించాల్సి వచ్చింది.

07/02/2016 - 08:09

హైదరాబాద్, జూలై 1: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దళితుల సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్నదని బిజెపి అనుబంధ విభాగమైన ఎస్‌సి మోర్చా జాతీయ అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ గౌతమ్ అన్నారు. శుక్రవారం ఇక్కడి బిజెపి కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఎస్‌సి మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ బిజెపి హయాంలోనే దళితుల సంక్షేమం జరుగుతుందని అన్నారు.

07/02/2016 - 08:09

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఎంపిక పరీక్ష ప్యాటర్న్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రూప్స్ తరహాలో ఎంపిక పరీక్ష విధానాన్ని మార్చేసింది. రెసిడెన్షియల్ స్కూళ్లలోని 2444 పో స్టులను పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

07/02/2016 - 08:08

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు జరుగుతున్న కౌనె్సలింగ్‌లో ఇంత వరకూ 1,04,500 మంది హాజరుకావల్సి ఉన్నా కేవలం 63777 మంది మాత్రమే హాజరయ్యారు. ఎమ్సెట్‌లో 1,04,500 మంది అర్హత సాధించారు. 80వేల ర్యాంకు వరకూ 50,563 మంది హాజరుకాగా, 80001 నుండి 92000 ర్యాంకు వరకూ కేవలం 6953 మంది హాజరయ్యారు. 92001 ర్యాంకు నుండి 1,04,500 ర్యాంకు వరకూ 6631 మంది హాజరయ్యారు.

07/02/2016 - 03:33

హైదరాబాద్, జూలై 1: ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్‌లో రోజుకో అవినీతి అధికారి బండారం బట్టబయలవుతోంది. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఎఎస్ అధికారి శ్రీనివాస్ వచ్చిన నాటి నుండి ఒక్కో జిల్లాను సమీక్షిస్తున్న కొద్దీ అక్రమార్కుల చిట్టాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అనంతపురం ప్రాజెక్టు అధికారి దశరథ రామయ్య అవినీతి బండారం బయటపడింది.

07/01/2016 - 05:46

ఖమ్మం, జూన్ 30: ఖమ్మం జిల్లాను వర్షం ముంచెత్తుతోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం శుక్రవారం కూడా కొనసాగింది. జిల్లాలోని చెరువు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రధాన ప్రాజెక్ట్‌ల్లోకి నీరు వచ్చి చేరింది. కినె్నరసాని రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవటంతో గేట్లను ఎత్తి నీళ్ళను వదులుతున్నారు.

07/01/2016 - 05:41

భద్రాచలం, జూన్ 30: ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే సీతారామప్రాజెక్టుకు సంబంధించి సర్వే నివేదికను వాప్కో సంస్థ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు అందజేసిందని, ఆయన ఆమోదించిన వెంటనే టెండర్లు పిలుస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు.

07/01/2016 - 05:26

కొత్తగూడెం, జూన్ 30: సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తిని గత నాలుగు రోజులుగా వర్షం దెబ్బ తీస్తోంది. సింగరేణి పరిధిలో నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తే కీలకం. వేసవికాలంలో ఎండల తీవ్రతకు బొగ్గు ఉత్పత్తి మందగించగా వర్షాకాలంలో వరుణుడి ప్రభావం కూడా బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా ఉంది.

07/01/2016 - 04:47

ఖమ్మం, జూన్ 30: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించటమే కాకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Pages