S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/16/2015 - 05:53

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో దరఖాస్తు చేసిన వారందరికీ తాత్కాలిక రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు వారికి తాత్కాలిక రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

12/15/2015 - 16:42

హైదరాబాద్: నగర పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు డీజీపీ అనురాగ్‌శర్మ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రారంభించి డీసీపీలు, స్టేషన్ హెచ్‌ఎస్‌వోలతో మాట్లాడారు. నగరంలోని 60 పోలీస్ స్టేషన్లతోపాటు సబ్ డివిజన్లు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, టాస్క్‌ఫోర్స్ తదితర 145 విభాగాలతో నేరుగా సంప్రదించే అవకాశం కలిగింది.

12/15/2015 - 16:41

హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి కార్పొరేషన్ ఎండీగా ఎస్పీ సింగ్ నియమితులైయ్యారు. పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీ సింగ్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

12/15/2015 - 16:32

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపుపై వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. తొలగించిన 6.29 లక్షల ఓట్లపై విచారణ జరిపించామని, 21,360 ఓట్లు పునరుద్ధరించామని, ఓట్ల తొలిగింపులో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. కేసు విచారణను శక్రవారానికి వాయిదా వేసింది.

12/15/2015 - 16:30

హైదరాబాద్ : రావాణా కార్యాలయాల్లో బ్రోకర్ల బెడద లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. బండ్లగూడలోని సౌత్‌జోన్ ఆర్టీఓ కార్యాలయాన్ని ఆయన మంగళవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రావాణా రంగంలో 15 సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.

12/15/2015 - 13:14

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. అనంతరం రాజ్‌భవన్ బయట మీడియాతో మాట్లాడారు. కాల్‌మనీ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గిరిజనులకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గిరిజన మహిళా ఎమ్మెల్యేపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.

12/15/2015 - 04:24

బాసర, డిసెంబర్ 14: ఆదిలాబాద్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞానసరస్వతిదేవి ఆలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు విశ్వయోగి విశ్వం జీ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

12/15/2015 - 04:20

కడప, డిసెంబర్ 14: వైఎస్సార్ కడప జిల్లాలో అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురిసిన భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాగా, మరికొన్ని ప్రాంతాలు తుంపర జల్లులకే పరిమితమయ్యాయి. తాజాగా కురిసిన వర్షాలతో జిల్లావ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు పదేళ్ల తర్వాత జలకళ వచ్చింది. అయితే గండికోట, మైలవరం ప్రాజెక్టుల్లో మాత్రం నీరు చేరక బావురుమంటున్నాయి.

12/15/2015 - 04:19

మచిలీపట్నం, డిసెంబర్ 14: దేశంలో పారిశుద్ధ్య ప్రాధాన్యతను గుర్తించి స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందనీయులని జాతిపిత మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకనీ అన్నారు. రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సారథ్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలో సోమవారం నిర్వహించిన ‘స్వచ్ఛ గాంధేయం’ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

12/15/2015 - 04:19

విజయవాడ, డిసెంబర్ 14: 2016-17 ఆర్థిక సంవత్సరానికి పారదర్శకతతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టదలిచామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఖర్చుచేసే ప్రతి పైసా పూర్తి పారదర్శకత, వాస్తవికతకు లోబడి మాత్రమే జరగాలని, అందుకనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించడం, కేటాయింపులు జరపాలని స్పష్టం చేశారు.

Pages