S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/01/2016 - 02:26

హైదరాబాద్, జూన్ 30: ‘బార్ల’ పాలసీని మరో రెండు నెలల పాటు పొడగిస్తూ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నెలల తర్వాత సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

07/01/2016 - 02:22

హైదరాబాద్, జూన్ 30: మలేసియన్ కంపెనీల కోసం ప్రత్యేకంగా తెలంగాణలో ఒక పారిశ్రామిక పార్క్ నిర్మాణం చేపట్టే విషయాన్ని పరిశీలించాలని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు ఆ దేశ ప్రధాని నజీబ్ టున్ రజాక్‌ను కోరారు. విదేశీ పర్యటనలో ఉన్న కెటిఆర్ గురువారం మలేసియా ప్రధానితో దాదాపుగంట సేపు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం గురించి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాల గురించి కెటిఆర్ వివరించారు.

07/01/2016 - 02:19

హైదరాబాద్, జూన్ 30:కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 15 రోజుల్లో ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రాజెక్టులో భాగంగా మూడు బ్యారేజీలు నిర్మించనున్నారు. బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్మాణ స్థలాన్ని మూడు రోజుల్లో ఖరారు చేయనున్నారు.

07/01/2016 - 02:04

హైదరాబాద్, జూన్ 30: హైదరాబాద్‌కు పెను ముప్పు తప్పింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు మంగళవారం మెరుపు దాడి జరిపి అదుపులోకి తీసుకున్న వారిలో ఐదుగురు కరడు గట్టిన ఉగ్రవాదులనీ, కిరాతక ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌కు అనుబంధంగా హైదరాబాద్ కేంద్రంగా భారీ విధ్వంసానికి పథక రచన చేశారని విచారణలో వెల్లడైంది.

07/01/2016 - 02:08

విజయవాడ, జూన్ 30: ఆంధ్ర ప్రదేశ్‌కు విస్తృతంగా పెట్టుబడులు రాబట్టేందుకు గత ఐదు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన పర్యటన విజయవంతమైంది. నవ్యాంధ్రలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలుగా అవకాశాలున్నాయని, ప్రభుత్వ పరంగానూ విస్తృత ప్రోత్సాహం లభిస్తుందంటూ చైనా కంపెనీల్లో చంద్రబాబు ఆసక్తి కలిగించగలిగారు.

07/01/2016 - 01:52

హైదరాబాద్, జూన్ 30: నవ్యాంధ్రలో ప్రభుత్వ సిబ్బంది పదవీ విరమణ కాలం మొదలయింది. సిబ్బంది పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకూ పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి ఎనలేని ఆనందం కలిగించారు. ఇప్పుడా రెండేళ్ల గడువు పూర్తి కానుండటంతో రిటైర్మెంట్ ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణను మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్లు 2014లో చంద్రబాబు ప్రకటించారు.

07/01/2016 - 01:51

రాజమహేంద్రవరం, జూన్ 30: కోస్తా నేలల్లో కొత్త వరి వంగడాలు అంకురిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ముందస్తు చర్యగా శాస్తవ్రేత్తలు ఈ వంగడాలను సిద్ధం చేశారు. దశాబ్దాలుగా రైతులు అలవాటు పడిన స్వర్ణ, సోనా మసూరికి ప్రత్యామ్నాయంగా వీటిని ఆవిష్కరించారు. ఈ ఖరీఫ్ నుంచే కోస్తా నేలలకు వీటిని పరిచయం చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు, వరదలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

,
07/01/2016 - 01:50

ఒంగోలు/మేదరమెట్ల, జూన్ 30: ప్రకాశం జిల్లా మేదరమెట్ల జాతీయ రహదారిపై గురువారం వేకువ జామున రెండున్నర గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు, డ్రైవర్ దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడి గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి.

06/30/2016 - 08:44

ఏలూరు/కాకినాడ, జూన్ 29: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గత కొన్ని రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లో నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాల కారణంగా చేరిన వరద నీటితో రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. విలీన మండలాల్లో వాగుల వరద ఉద్ధృతి ఎక్కువగావుంది. పశ్చిమగోదావరి జిల్లాపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి.

06/30/2016 - 08:29

హైదరాబాద్, జూన్ 29:పార్టీ మారితే పెత్తనం సాగించవచ్చన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రకాశం జిల్లాలో మరోసారి చుక్కెదురయింది. నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి ఏరికోరి చేయించుకున్న బదిలీలను, కరణం బలరాం వర్గం పట్టుబట్టి రద్దు చేయించడంతో, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పరాభవం మిగిలింది. దానితో కరణం వర్గీయులపై లోకేష్‌కు ఫిర్యాదు చేసేందుకు వారంతా హైదరాబాద్‌లో మకాం వేశారు.

Pages