S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/30/2016 - 08:08

హైదరాబాద్, జూన్ 29: కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల నిర్వచనం పరిధి కిందకు రారని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. వివిధ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచిన నిర్ణయం వర్తించదన్నారు.

06/30/2016 - 08:05

హిందూపురం, జూన్ 29: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న సఫారీ వాహనం కర్నాటక రాష్ట్రం బాగేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. అయితే బాలకృష్ణకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బాలకృష్ణ స్వయంగా వాహనం నడుపుతున్నట్లు సమాచారం.

06/30/2016 - 08:04

హైదరాబాద్/ కెపిహెచ్‌బి కాలనీ, జూన్ 29: నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడు తలకు కవర్ తగిలించుకొని ఆడుకుంటూ ఊపిరి ఆడక మరణించిన విషాదకర సంఘటన హైదరాబాద్‌లోని కెపిహెచ్‌బి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కోడెల శ్రీనివాసబాబు దంపతులు నిజాంపేట రోడ్డులో నివాసముంటున్నారు. వీరికి 4 సంవత్సరాల బాబు శ్రీయాన్ ఉన్నాడు.

06/30/2016 - 07:51

హైదరాబాద్, జూన్ 29: ప్రస్తుత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తామే శాశ్వతం అనుకుంటోందని, మంచి పనులు చేయకుంటే మిలియన్ మార్చ్ సంగతి అందరికీ తెలుసని ప్రముఖ సామాజిక శాస్తవ్రేత్త ప్రొఫెసర్ హరగోపాల్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ జాక్ నేతలు నిర్వహించిన సదస్సులో ఆయన బుధవారం మాట్లాడారు.

06/30/2016 - 07:50

హైదరాబాద్, జూన్ 29: అసెంబ్లీ, కౌన్సిల్ కార్యాలయం ఉద్యోగుల విభజన కొంతవరకు కొలిక్కివచ్చింది. విభజన చేసి ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల జాబితాలను మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని నోటీసు బోర్డులో పెట్టారు. అయినా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కార్యాలయంలోనే ఉండిపోయిన ఉద్యోగులు తీవ్ర నిరాశ, అసంతృప్తితో ఉన్నారు.

06/30/2016 - 07:28

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ దాడికి కుట్రపన్నింది. భారీ పేలుళ్లకు ఐసిస్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) భగ్నం చేసింది. హైదరాబాద్‌లో ఇస్లామిక్ స్టేట్ సిరియా ఉగ్రవాదులు చొరబడ్డారని కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో బుధవారం తెల్లవారుజాము నుంచే ఎన్‌ఐఏ, నగర పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

06/30/2016 - 07:25

హైదరాబాద్, జూన్ 29: వైకాపా అధ్యక్షుడు, ఏపి అసెంబ్లీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో పలు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆదేశిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసం, పార్టీ కార్యాలయాన్ని, బెంగళూరులోని ఆయన నివాసం సహా అనేక స్థిర, చరాస్తులు ఉన్నాయి.

06/29/2016 - 06:42

హైదరాబాద్, జూన్ 28: న్యాయాధికారుల కేటాయింపులకు సంబంధించి తలెత్తిన వివాదం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి దారితీస్తోంది. ఒకవైపు న్యాయాధికారులు, న్యాయవాదులు అందోళనను ఉధ్రుతం చేస్తుంటే, మరోవైపు హైకోర్టు ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంది. క్రమశిక్షణా చర్య కింద మంగళవారం మరో తొమ్మిది మంది న్యాయాధికారులను సస్పెండ్ చేసింది. దీంతో సస్పెండైన న్యాయాధికారుల సంఖ్య 11కు చేరింది.

06/29/2016 - 04:52

హైదరాబాద్, జూన్ 28 : రైతు రుణ మాఫీ అందని రైతుల్లో వ్యతిరేకత పెరగకుండా తెలుగుదేశం ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.రైతురుణ మాఫీలో వైఫల్యం చెందిందంటూ విపక్షాలు విమర్శలు వర్షం కురిపిస్తుండటంతో అప్రమత్తమయిన బాబు సర్కారు, అసలు రైతులకు రుణ మాఫీ ఎందుకు కాలేదన్న వివరణ పత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

06/29/2016 - 04:36

హైదరాబాద్, జూన్ 28 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకులు జూలై 27 నుండి మూడు రోజుల పాటు మూతపడబోతున్నాయి. మూడు రోజుల పాటు ఈ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెబాట పడుతున్నారు. గ్రామీణ బ్యాంకుల ఉద్యోగ సంఘాల నేతలు సంబంధిత అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయి.

Pages