S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/29/2016 - 04:35

హైదరాబాద్, జూన్ 28 : పి.వి. నర్సింహారావు భారత ప్రధానిగా పనిచేసిన కాలంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని పురోభివృద్ధివైపు తీసుకువెళ్లిన విధంగానే, ఆయన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ మంత్రిగా 1965-66 సంవత్సరాల్లో పనిచేసిన సమయంలో కూడా ఆలయాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పలువురు ప్రశంసించారు.

06/29/2016 - 04:34

హైదరాబాద్, జూన్ 28: దివంగత ప్రధాని పి.వి.నర్సింహరావు దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడని, దేశంలో ఆర్థికాభివృద్ధికి ఆద్యుడిగా ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోతుందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. పివి నర్సింహరావు 95వ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులోని పివి జ్ఞానభూమిలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.

06/28/2016 - 04:56

తిరుపతి, జూన్ 27: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఈ-హుండీ ద్వారా కానుకలు సమర్పించే భక్తులకు పేమెంట్ గేట్ వే చార్జీలు (కమిషన్ చార్జీలు) రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనాభవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

06/28/2016 - 05:04

హైదరాబాద్, జూన్ 27: అమరావతిలో సదావర్తి ఆశ్రమం భూముల అమ్మకానికి సంబంధించిన కేసును రాష్ట్ర హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. సదావర్తి ఆశ్రమం భూముల అమ్మకంపై న్యాయవిచారణ జరిపించాలని గుంటూరుకు చెందిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ప్రజాప్రయోజనాల పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే ఈ కేసులో ఎపి అడ్వకేట్ జనరల్ హాజరయ్యేందుకు వీలుగా కేసును వారం పాటు హైకోర్టు వాయిదా వేసింది.

06/28/2016 - 05:02

భద్రాచలం, జూన్ 27: ఇటీవలే రాకెట్ లాంచర్లతో పోలీసులపై విరుచుకుపడ్డ మావోయిస్టులు తాజాగా సరికొత్త ఆయుధంతో కలకలం సృష్టించారు. చిన్నపాటి రాకెట్‌ను పోలి ఉన్న ఈ ఆయుధానికి బాంబును అనుసంధానం చేసి శత్రువుపై ఉపయోగించడానికి సిద్ధం చేశారు. బస్తర్ అటవీ ప్రాంతంలోని కాంకేర్ జిల్లా మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్లీ అవుట్ పోస్టుపై మావోలు ఆదివారం దీన్ని ప్రయోగించారు.

06/28/2016 - 03:56

హైదరాబాద్, జూన్ 27: న్యాయాధికారుల పోరాటం ముదిరింది. న్యాయాధికారుల నిరసనలకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులు ఏకంగా వొంటిపై కిరోసిన్ పోసుకుని హైకోర్టు ముందు బైఠాయించారు. న్యాయం కోసం నిరసన వ్యక్తం చేసిన వాళ్లపై సస్పెన్షన్ వేటు విధించడం ఎక్కడి న్యాయమని నిలదీశారు. ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

06/28/2016 - 03:54

హైదరాబాద్, జూన్ 27: అపోహలు, సమస్యలు తీరిపోవడంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమమైంది. రెండు రాష్ట్రాల మధ్య తుది ఒప్పందానికి ముహూర్తం ఖారైరంది. జూలై 15న ముంభైలో తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్‌ల సమక్షంలో తుది ఒప్పందాలు ఖరారు కానున్నాయి. జూన్ 1న ముంబయిలో గోదావరి అంతర్రాష్ట్ర మండలి (ఐఎస్‌బి) సమావేశం జరుగుతుంది.

,
06/28/2016 - 03:44

న్యూఢిల్లీ, జూన్ 27: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపపట్టిన ఫార్మా సిటీలో 1500 కోట్ల ఖర్చుతో ప్రపంచస్థాయి కామన్ అఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించినట్టు రాష్ట్ర ఐటీ మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. ఇందులో భాగంగా తొలివిడత కింద 200 కోట్ల నిధులు తక్షణ విడుదలకు ఆదేశించారన్నారు.

06/28/2016 - 03:40

హైదరాబాద్, జూన్ 27: రాష్టవ్య్రాప్తంగా పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను దృష్టిలో పెట్టుకుని 9335 మంది విద్యా వాలంటీర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా వాలంటీర్ల నియామకానికి సిఎం కెసిఆర్ సోమవారం ఆమోదం తెలిపారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు విద్యాశాఖకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.

06/28/2016 - 03:37

హైదరాబాద్, జూన్ 27: సంక్షోభంలో ఉన్న పరిశ్రమలను గట్టెక్కించే ప్రయత్నంలో విద్యుత్ రాయితీలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ యాజమాన్యాలకు, ఆ కంపెనీల్లో పని చేసే కార్మికులకు ఊరటనిచ్చే విధంగా సిఎం కెసిఆర్ రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. స్పిన్నింగ్ మిల్లులు ప్రస్తుతం యూనిట్‌కు చెల్లించే 6.40 చారిలో రెండు రూపాయలు తగ్గించి 4.40 ధర నిర్ణయంచారు.

Pages