S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/05/2016 - 07:11

హైదరాబాద్, జూన్ 4: ఈ నెల 10వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకుంటే రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో రోడ్డు దిగ్బంధం చేస్తామని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ శనివారం హెచ్చరించింది.

06/05/2016 - 07:03

హైదరాబాద్, జూన్ 4: మార్కెట్‌లో కందిపప్పు ధరలు ఇంకా అదుపులోకిరాని నేపథ్యంలో 2018 నాటికి 30 లక్షలకుపైగా హెక్టార్లలో కందిసాగును చేపట్టాలనే లక్ష్యంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా ఐదు రాష్ట్రాలు, ఇక్రిసాట్ ముందుకెళ్తున్నాయి. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇక్రిసాట్ తెలియజేసింది.

06/05/2016 - 07:02

న్యూఢిల్లీ, జూన్ 4: బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. శనివారం బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర శుక్రవారం ముగింపుతో పోల్చితే 505 రూపాయలు ఎగిసింది. 29,225 రూపాయలకు చేరింది. 99.5 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల ధర 29,075 రూపాయలను తాకింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ మార్కెట్‌లో నగల వర్తకుల నుంచి పెరిగిన డిమాండ్ మధ్య ధరలు ఒక్కరోజే భారీగా పెరిగాయి.

06/05/2016 - 06:56

హైదరాబాద్, జూన్ 4: విద్యుత్ ఆదాలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, ఈ రాష్ట్రం అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ప్రణాళికను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేయాలని విద్యుత్ ఆదాపై కేంద్రం నియమించిన కమిటీ ఓ నివేదికలో పేర్కొంది. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు.

06/05/2016 - 06:47

తిరుపతి, జూన్ 4: రైల్వే అభివృద్ధి పనులకు సంబంధించి ఏపి అభ్యర్థనలను ప్రత్యేకంగా పరిగణించి వాటి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు హామీ ఇచ్చారు. రూ.10కోట్లతో తిరుచానూరులో చేపట్టనున్న నూతన రైల్వే క్రాసింగ్ పనులకు తిరుపతి రైల్వే స్టేషన్లో రిమోట్ కంట్రోల్ ద్వారా రైల్వేమంత్రి శంకుస్థాపన చేశారు.

06/05/2016 - 06:45

హైదరాబాద్, జూన్ 4: టర్కీ నోట్ల చెలామణి ముఠా గుట్టు రట్టయింది. చెల్లని టర్కీ నోట్లను విక్రయిస్తున్న ఇద్దరిని సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేసి 96 టర్కీ (లిరా) నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన టి రత్నకుమార్, గుంటూరు జిల్లాకు చెందిన పి రామకృష్ణ కూకట్‌పల్లి నిజాంపేటలో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.

06/05/2016 - 06:44

విశాఖపట్నం, జూన్ 4: గగనతలంలో విహరిస్తూ ప్రత్యేక అనుభూమిని పొందే అవకాశం ఇకనుంచి భక్తులు, పర్యాటకులకు కలగనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహించనుంది.

06/05/2016 - 06:42

హైదరాబాద్, జూన్ 4: కార్మికుల సంక్షేమానికి మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. వెట్టిచాకిరి నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.

06/05/2016 - 06:34

హైదరాబాద్, జూన్ 4: హైదరాబాద్‌లో అంతర్జాతీయ 9వ ముత్యాలు, రత్నాల ప్రదర్శన శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌లో ఈ ప్రదర్శనను జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రాంమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా జెమ్స్, జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ జివి శ్రీ్ధర్, యుబిఎం ఎండి యోగేష్ ముద్‌రాస్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో వందకుపైగా ప్రముఖ ఆభరణాల సంస్థలు పాల్గొన్నాయని చెప్పారు.

06/05/2016 - 06:31

కాకినాడ, జూన్ 4: ఎపి పిజి ఈసెట్-2016 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య లక్కసాని వేణుగోపాలరెడ్డి కాకినాడ జెఎన్‌టియులో శనివారం విడుదల చేశారు. గత రెండేళ్ళుగా ఎపి పిజి ఈసెట్‌ను కాకినాడ జెఎన్‌టియు నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో 22199 మంది దరఖాస్తు చేసుకోగా 19,780 మంది హాజరయ్యారు. 16945 మంది అర్హత సాధించగా 85.67 శాతం ఉత్తీర్ణత లభించింది.

Pages