S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/03/2016 - 03:12

గుంటూరు, జూన్ 2: రెవెన్యూశాఖలో సంస్కరణలకు ఏపి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ భూములకు సంబంధించి కచ్చితమైన లెక్కలు తేలకపోవటానికి స్థానికంగా ఉండే అధికారులే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా ఉండే తహశీల్దార్లు, వీఆర్వోలను ఇతర మండలాలు, జిల్లాలకు బదిలీ చేయడం ద్వారా పాలనలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది.

06/03/2016 - 02:27

హైదరాబాద్, జూన్ 2: దేశానికి ఎవరు రైల్వే మంత్రిగా వచ్చినా వారికి ముందుగా గుర్తుకొచ్చేది సొంత రాష్ట్రం. కొత్త రైళ్లు, సర్వే లైన్లు.. ఒకటేమిటి అన్ని వరాలూ సొంత రాష్ట్రాలకే వెళుతుంటాయి. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, జాఫర్ షరీఫ్ రైల్వే మంత్రులుగా పనిచేసి, అన్ని ప్రాజెక్టులనూ తమ రాష్ట్రాలకు తరలించుకుపోయారు.

06/03/2016 - 02:06

న్యూఢిల్లీ, జూన్ 2: ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా చూస్తున్న ఎదురుచూపులు ఇక ముగియనున్నాయి. వచ్చే నెల నుంచి కేంద్ర ఉద్యోగులందరికీ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా నాయకత్వంలో కొందరు కార్యదర్శుల బృందం జూన్ 11న సమావేశమై వేతన సంఘం సిఫార్సులకు తుది రూపాన్ని ఇవ్వనుంది.

06/03/2016 - 02:42

విజయవాడ, జూన్ 2: ప్రకాశం జిల్లా కందుకూరు వైకాపా ఎమ్మెల్యే పోతిన రామారావు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో రామారావుకు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు తదితరులు టిడిపిలో చేరారు.

06/02/2016 - 08:10

హైదరాబాద్, జూన్ 1 : తెలంగాణ ప్రాంతంలో దళితులను ఆర్థికంగా ఉన్నతస్థాయికి తీసుకువచ్చేందుకు స్వయం ఉపాధి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.

06/01/2016 - 06:34

ఖమ్మం, మే 31: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 65మంది ఒక ప్రైవేటు ట్రావెల్ ఏజన్సీ ద్వారా నేపాల్, మానస సరోవర్ యాత్రకు వెళ్ళగా, వారిని ట్రావెల్స్ యజమాన్యం అక్కడే వదిలేయటంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఖమ్మం జిల్లాకు చెందిన తొమ్మిది మందితో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారంతా కలిసి హైదరాబాద్‌కు చెందిన ఒక ట్రావెల్ ఏజన్సీ ద్వారా యాత్రకు వెళ్ళారు.

06/01/2016 - 06:33

కదిరి టౌన్, మే 31 : పంజాబ్ నేషనల్ బ్యాంక్ నకిలీ డీడీల కుంభకోణంలో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు ఏడేళ్లు, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్‌తో పాటు మరో ఆరుగురికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించిన వివరాలు..

06/01/2016 - 06:17

భద్రాచలం, మే 31: ఖమ్మం జిల్లాలోని భద్రాచలం రామాలయం మంగళవారం హనుమాన్ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది హనుమాన్ మాలధారులు, వారి కుటుంబ సభ్యులు ఇరుముడి సమర్పించి భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దేవస్థానం దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

06/01/2016 - 06:12

తిరుమల, మే 31: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంనేందుకు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సతీసమేతంగా మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. ఆయన వెంట ప్రముఖ సినీహీరోలు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు.

06/01/2016 - 06:05

హైదరాబాద్, మే 31: ఉపాధ్యాయుల అంతర్‌జిల్లా బదిలీలకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. ఫైలు విద్యాశాఖకు చేరుకోవడంతో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు నేడో రేపో విడుదల కానున్నాయి. జిఎడిలో పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు కూడా వీటితో కలిపి చేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు ఐ వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి పి బాబురెడ్డి చెప్పారు.

Pages