S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/01/2016 - 04:28

హైదరాబాద్, మే 31: రెండేళ్ల తెరాస పాలనలో సాధించిన విద్యుత్ ప్రగతి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచితే, తాండవించిన కరవు ఇబ్బంది పెట్టింది. ఆంధ్రప్రదేశ్ చివరి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనాకాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై నిషేధం విధించారు. ఏసీలు వాడొద్దంటూ భారీ హోర్డింగ్‌లూ ఏర్పాటు చేశారు. పరిశ్రలకు వారానికి రెండు రోజుల పవర్ హాలిడే ప్రకటించారు.

06/01/2016 - 04:26

హైదరాబాద్, మే 31: రాష్ట్రావతరణ వేడుకలు పురస్కరించుకుని వివిధ రంగాలకు చెందిన 62మంది ప్రతిభావంతులను ‘తెలంగాణ రాష్టస్థ్రాయి అవార్డులు- 2016’కు ఎంపిక చేసి ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అవార్డుకు ఎంపికైన వారిని జూన్ 2న పరేడు గ్రౌండ్‌లో జరగబోయే వేడుకల వేదికపై ప్రశంసా పత్రం, రూ.1,00,116 నగదు బహుమతితో సిఎం కెసిఆర్ సత్కరిస్తారు.

06/01/2016 - 04:38

హైదరాబాద్, మే 31: రాష్ట్రావతరణ వేడుకలను కనీవిని ఎరగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2న అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించడానికి యావత్ ప్రభుత్వ యంత్రాంగం తలమునకలైంది. రాష్టవ్య్రాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ అక్కడ స్థిరపడిన తెలంగాణ ప్రజల సహకారంతో వేడుకల నిర్వహిస్తోంది.

06/01/2016 - 04:22

హైదరాబాద్, మే 31: తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లను కట్టడి చేసే పనిలో ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో సమస్త సౌకర్యాలు కల్పిస్తున్నామని, అన్ని స్కూళ్లలో టీచర్లను నియమిస్తున్నామని, ఇక మంచి ఫలితాలను సాధించాల్సిన బాధ్యత టీచర్లపై ఉంటుందని అన్నారు.

06/01/2016 - 04:38

హైదరాబాద్, మే 31: తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు ఇద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో తెరాస అభ్యర్థులు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, అజ్మీరా చందూలాల్, ఈటల రాజేందర్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీతోపాటు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు హాజరయ్యారు.

06/01/2016 - 04:39

గుంటూరు (కల్చరల్), మే 31: సకల జన శ్రేయస్సే లక్ష్యంగా యుగాల నాడు ఆవిర్భవించిన హైందవ ధర్మాన్ని పరిరక్షించేందుకు విశాఖ శ్రీ శారదాపీఠం నిరంతరం కృషి చేస్తోందని ఆ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి స్పష్టంచేశారు. హనుమజ్జయంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం నగరానికి వచ్చిన స్వామీజీ పాత గుంటూరులోని ప్రసిద్ధ శ్రీ వీరాంజనేయ స్వామివారిని సందర్శించి అక్కడ జరిగిన మహోత్సవాల్లో పాల్గొన్నారు.

06/01/2016 - 04:42

శ్రీకాకుళం, మే 31: తమిళనాడులోని తంజావూరు, అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్ మొదటి వారంలోనే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశానని, ఇటీవల ఎన్నికలు ఆగిపోయిన ఈ రెండు నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు కోల్పోనున్నందున ఈ లేఖ రాశానని ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య స్పష్టం చేశారు.

06/01/2016 - 03:55

హైదరాబాద్, మే 31: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో సాధించిన ఘన విజయాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలనలోని వైఫల్యాలు, వాగ్ధానాలు అమలు చేయకపోవడంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెరాస నాయకులకు సవాలు విసిరారు.

06/01/2016 - 03:51

హైదరాబాద్, మే 31 : జూన్ మొదటి పక్షంలో విత్తనాలు వేయాలని ఆశపడిన తెలుగు రాష్ట్రాల రైతులకు నిరాశే మిగిలింది. రుతుపవనాలు సకాలంలో (జూన్ 10 కి కాస్త అటుఇటుగా) వస్తాయని ప్రచారం జరగడంతో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ఇటు తెలంగాణ ప్రభుత్వం విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు చేశాయి. తెలంగాణలో 105 లక్షల ఎకరాల్లో, ఏపిలో 120 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తుంటారు. ఇందులో కేవలం వరి పంట విస్తీర్ణం 75 వేల ఎకరాలు ఉంటుంది.

06/01/2016 - 02:45

తిరుపతి, మే 31: ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో బుధవారం నుంచి శ్రీవారి ప్రభాత సేవలను ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టామని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు వెల్లడించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆకాశవాణి తిరుపతి కేంద్రం అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

Pages