S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/01/2016 - 02:44

హైదరాబాద్, మే 31: తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు మల్లారెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజులుగా మల్లారెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నా, ఆయన ఖండించలేదు. ఇలాఉండగా జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం వేడుకలకు ముందు సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.

06/01/2016 - 02:43

హైదరాబాద్, మే 31: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్లకు జూన్ 22 నుండి కౌనె్సలింగ్ నిర్వహించనున్నారు. సీట్ల కేటాయింపు జూలై 30న చేపడతారు. ఆగస్టు 2 నుండి తరగతులు ప్రారంభిస్తారు. జూలై 31, ఆగస్టు 1వ తేదీన నగరంలో బోనాలు పండుగ ఉన్నందున తరగతులు ఆగస్టు 2 నుండి నిర్వహిస్తామని విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు.

06/01/2016 - 02:42

హైదరాబాద్, మే 31: ఢిల్లీ పోలీసు విభాగంలోని సబ్ ఇనస్పెక్టర్లు, సిఎపిఎఫ్‌లు, అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్లు ఉద్యోగాల నియామకానికి పేపర్ -1ను మరోమారు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించాలని స్ట్ఫా సెలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఈ పరీక్షను గతంలో పరీక్షకు హాజరైన వారు మాత్రమే రాసేందుకు అర్హులు.

06/01/2016 - 02:42

హైదరాబాద్, మే 31: తెలంగాణ ప్రభుత్వం వెంటనే వ్యాట్‌ను ఎత్తివేయాలని డీజిల్, పెట్రో ట్యాంకర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ చర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) ముందు అసోసియేషన్ మంగళవారం ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, వ్యాట్‌తో ట్యాంకర్ల యజమానులు ప్రతినెలా రూ.20 వేల నుంచి 25 వేలు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

06/01/2016 - 04:09

హైదరాబాద్, మే 31: కర్నాటకలోని బీజాపూర్‌లో నిర్వహించనున్న ఆలిండియా మజ్లిస్-ఎ-ఇతెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) బహిరంగ సభకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హాజరు కారాదని ఆ రాష్ట్ర పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. వారం రోజుల పాటు కర్నాటకకు రాకూడదని స్పష్టం చేస్తూ వారు అసదుద్దీన్‌కు దారుస్సలాంలో నోటీసులు అందజేశారు.

06/01/2016 - 02:36

విజయవాడ, మే 31: రాష్ట్ర విభజనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. పార్లమెంట్ తలుపులు మూసేసి, వార్ రూంలో చర్చలు జరిపి, యుద్ధ విమానాల్లో బిల్లులు తెచ్చి రాష్ట్రాన్ని ముక్కలు చేశారంటూ తీవ్ర ఆవేదనతో అన్నారు. మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

,
06/01/2016 - 02:33

ఒంగోలు, మే 31: ప్రకాశం జిల్లాలో వైకాపాకు చెందిన గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అదేవిధంగా కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావు జూన్ రెండో తేదీన ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈనేపధ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణలు మారనున్నాయి.

06/01/2016 - 02:27

విజయవాడ, మే 31: నీటిని సంపదగా వినియోగించుకుంటే రాష్ట్రంలో పేదరికం ఉండదని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లుపై చంద్రబాబు మంగళవారం సమీక్ష జరిపారు. రాష్ట్రంలో పంట కుంటల ప్రయోగం విజయవంతమైందని,సంస్థాగత వాటర్ రీస్ట్రక్చర్ కార్యక్రమాలు పెద్దఎత్తున సాగాలని ఆదేశించారు.

,
06/01/2016 - 02:25

హైదరాబాద్, మే 31: రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరుగనున్న ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. మొత్తం నాలుగు సీట్లు ఖాళీ అవగా టిడిపి నుంచి ఇద్దరు, బిజెపి, వైకాపా నుంచి ఒక్కొక్కరు ఎన్నిక కావడం ఖాయమైంది. వైకాపా నుంచి ముందు జాగ్రత్తగా పార్టీ ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డితో పాటు, ఆయన సతీమణి కూడా నామినేషన్ వేసినప్పటికీ.. వారిలో ఒకరి ఉపసంహరణ ఖాయం కావటంతో నలుగురి ఎంపిక ప్రకటన లాంఛనప్రాయమే కానుంది.

06/01/2016 - 02:20

విజయవాడ, మే 31: వచ్చే నెల 27కల్లా రాజధాని అమరావతికి తరలిరావాలని సెక్రటేరియట్ ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో ఇందు కు సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. జూన్‌లో సుమారు నాలుగు వేల మంది ఉద్యోగులు ఇక్కడికి చేరుకోవలసి ఉంది. అలాగే 54 సెక్రటేరియట్‌లు, 110 హెచ్‌ఓడి కార్యాలయాలు విజయవాడకు రావల్సి ఉంది.

Pages