S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/01/2016 - 02:19

నెల్లూరు లీగల్, మే 31: నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద భర్త కోసం వేసి ఉన్న మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన కేసులో నిందితులైన 13 మందికి పదేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ. పది వేలు వంతున జరిమానా విధిస్తూ నెల్లూరు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి టివి సుబ్బారావు మంగళవారం సంచలన తీర్పు చెప్పారు.

06/01/2016 - 01:32

ఏలూరు, మే 31: అసలు పంట లేకుండానే భారీ దిగుబడులు సాధించాలంటే పశ్చిమగోదావరికి రావాల్సిందే. ఆశ్చర్యంగా ఉన్నా గత రెండు, మూడు సీజన్లుగా ఇలాంటి దిగుబడులే కనిపిస్తున్నాయి మరి. దానికి ప్రభుత్వం మద్దతు ధర కూడా చెల్లిస్తుండటం మరింత విడ్డూరం. విచిత్రంగా అనిపిస్తున్నా.. మిల్లర్లు, కొంతమంది సివిల్ సప్లయిస్ అధికారులు సిండికేట్‌గా మారి చేస్తున్న మహాదోపిడికి ఇదొక రాజమార్గం. అవును..

05/31/2016 - 07:18

నెల్లూరు/కాకినాడ, మే 30: ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఉద్యమం చేపట్టిన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై రాష్టమ్రంత్రులు నారాయణ, నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధికోసం ఉద్యమాల పేరుతో ముద్రగడ పద్మనాభం కాపులను మోసగించడం తగదని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సోమవారం నెల్లూరులో విరుచుకుపడ్డారు.

05/31/2016 - 07:18

ఏలూరు, మే 30: ఉత్తర భారతదేశం, నేపాల్‌లోని దేవాలయాల సందర్శనకు బయలుదేరి, మూడు రోజులుగా సమాచారం అందకుండా పోయిన పశ్చిమ గోదావరి జిల్లా యాత్రికుల కథ సుఖాంతమయ్యింది. వారంతా క్షేమంగా ఉన్నట్టు సోమవారం సాయంత్రం సమాచారం అందడంతో బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.

05/31/2016 - 07:08

హైదరాబాద్, మే 30: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జూన్ 2వ తేదీన హెచ్‌ఐసిసిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు.

05/31/2016 - 07:07

విజయవాడ, మే 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన నివాసంలో భేటీ అయ్యారు. అలాగే, కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు తదితరులు కూడా పాల్గొన్నారు. రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే అంశాన్ని వీరితో చర్చించారు.

05/31/2016 - 07:07

హైదరాబాద్, మే 30: ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నివాస గృహాలు, ఇతర నిర్మాణాలను నిర్మించుకున్న వారికి నామ మాత్రపు రుసుంతో క్రమబద్ధీకరించేందుకు ప్రవేశ పెట్టిన జీవో 59 కు కింద భూ హక్కుల పత్రాలను జారీ చేసే ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది.

05/31/2016 - 07:06

హైదరాబాద్, మే 30: ప్రైవేటు విద్యాసంస్థలకు పిఎఫ్ మినహాయింపు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎపి విద్యా చట్టం 1982 ప్రకారం ఈ మినహాయింపు కోరడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్ రావులతో కూడిన బెంచ్ ఆదేశించింది. పిఎఫ్ నుండి మినహాయింపును ఎపి ప్రైవేటు విద్యాసంస్థల సంఘం గతంలో ఢిల్లీలోని ఇపిఎఫ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ నుండి పొందింది.

05/31/2016 - 07:02

హైదరాబాద్, మే 30 : నైరుతి రుతుపవనాలు అనుకున్న ప్రకారం ముందుకు సాగడం లేదు. కేరళ తీరాన్ని ఇవి మే 7 న తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి జూన్ 15 న లేదా ఆ తర్వాత వచ్చే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా గత నాలుగు రోజుల నుండి అరేబియా సముద్రంలోనే రుతుపవనాలు తిష్టవేసి ఉన్నాయి.

05/31/2016 - 05:00

హైదరాబాబాద్, మే 30: రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిన ఓటుకు నోటు కేసు చివరకు రెండు రాష్ట్రాల సిఎంల మధ్య రాజీ కుదిర్చి సద్దుమణిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు రెండు రాష్ట్రాల్లో కీలక మార్పులకు దోహదమైంది. పదేళ్ల ఉమ్మడి రాజధాని సౌకర్యం ఉన్నా ఆంధ్ర సిఎం చంద్రబాబు రాజధానిని విజయవాడకు తరలించారు. గతంలో ఇద్దరు సిఎంలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తేవారు.

Pages