S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/31/2016 - 05:07

హైదరాబాద్, మే 30:పార్టీకి బడుగు బలహీన వర్గాలే ప్రాణమని మహానాడు వేదికగా ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే టిడిపి నాయకత్వం తన విధానం మార్చుకుంది. రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో బడుగువర్గాలకు స్థానం లేకుండా, ఇద్దరు ఆగ్రకులాల వారికి స్థానం కల్పించడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

05/31/2016 - 01:20

పవన తనయుడు హనుమంతుడి జయంతి నేడు. జంటనగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పండుగ ఏర్పాట్లతో హనుమంతుడి దేవాలయాలు కళకళలాడుతున్నాయ.

05/30/2016 - 06:49

హైదరాబాద్, మే 29: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. ఆదివారం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపినా ఎంపికపై స్పష్టత రాలేదు. అయితే ఎంపిక నిర్ణయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకే పొలిట్ బ్యూరో అప్పగించింది.

05/30/2016 - 06:42

హైదరాబాద్, మే 29: తమ పాలనపై ప్రతి ఏటా ప్రోగ్రెస్ రిపోర్ట్‌తో ప్రజల ముందుకు వస్తామని, అదే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లకొకసారి మాత్రమే ప్రజల ముందుకు వెళ్లేదని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ నేతలంతా 10 జన్‌పథ్ చుట్టూనే తిరిగేవారని ఆయన విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన యుపిఎ పాలనకు, ఇప్పటి ఎన్డీయే పాలనకు పోలికే లేదన్నారు.

05/30/2016 - 06:38

హైదరాబాద్/ విశాఖపట్నం, మే 29: ఎండాకాలం వెళ్లిపోతోంది. ఎండలు తగ్గుముఖం పట్టాయి. వడగాడ్పులు ఉంటాయని గత చాలా రోజుల నుండి ప్రకటిస్తున్న భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రస్తుతం వడగాడ్పుల గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. నైరుతీ రుతుపవనాలు ఇంకా రాకపోయినప్పటికీ, రుతుపవనాల కంటే తొలుత వచ్చే ‘ముందస్తు వర్షాలు’ కురుస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదైంది.

05/29/2016 - 06:08

హైదరాబాద్, మే 28: రాష్ట్ర విభజన జరిగి మరో నాలుగు రోజుల్లో రెండేళ్లు గడుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాజెక్టుల కోసం విదేశీ ఏజెన్సీల నుంచి తీసుకున్న రుణాన్ని ఏ రాష్ట్రం చెల్లించాలనేది ఇంతవరకు తేలలేదు. ఈ అంశాన్ని ఇరు రాష్ట్రాలు కూర్చుని పరిష్కరించుకోవాలని కేంద్రం సలహా ఇస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సయోధ్యతో ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా లేవు.

05/29/2016 - 04:25

హైదరాబాద్, మే 28: రెండేళ్ళలో ప్రధాని నరేంద్ర మోదీ టూరిస్టు ప్రధానిగా మారారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దేశమంతా కరవు విలయతాండవం చేస్తుంటే బిజెపి నాయకులు, కార్యకర్తలు రెండేళ్ళ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. బిజెపి చేపట్టిన వికాస్ పర్వ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ వినాశ్ పర్వ్ చేపట్టిన సంగతి తెలిసిందే.

05/29/2016 - 05:44

హైదరాబాద్, మే 28: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో ఇంజనీర్లు కమీషన్లు తీసుకుంటున్నారని తిరుపతిలో జరిగిన మహానాడులో టిడిపి చేసిన ఆరోపణలపై తెలంగాణ ఇంజనీర్ల జెఎసి నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

05/29/2016 - 04:19

హైదరాబాద్, మే 28: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య లా, ఇతర విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను బార్ కౌన్సిల్‌కు సమర్పించి తనిఖీ చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి పేర్కొన్నారు. 2015 బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన మార్గదర్శకాల మేరకు ధ్రువపత్రాలను తనిఖీ చేయించుకోవాలని ఆయన కోరారు.

05/29/2016 - 04:12

తిరుమల, మే 28: టిటిడి పాలక మండలి సభ్యుడిగా అరికెల నరసారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డిని బోర్డు సభ్యులుగా నియమిస్తూ శనివారం రాత్రి నియామక పత్రాలు విడుదల చేశారు.

Pages