S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/29/2016 - 04:03

తిరుపతి, మే 28: దివంగత ఎన్ టి ఆర్ తెలుగు జాతిలో పుట్టడం గర్వకారణమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తిరుపతిలో నెహ్రూమున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు రెండోరోజు సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కర్రపెత్తనంతో విచ్చలవిడిగా వ్యవరిస్తున్న కాంగ్రెస్ దురహంకారానికి అడ్డుకట్ట వేయడానికే ఎన్ టి ఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టారన్నారు.

05/29/2016 - 04:00

తిరుపతి, మే 28: మహానాడు నందమూరి వారసుల మధ్య విభేదాలకు వేదికగా మారింది. ప్రత్యేకహోదా, మహానాడుపై ఎన్టీఆర్ పుత్రరత్నాల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు పార్టీ వర్గాలలో చర్చనీయాంశమయ్యాయి. మహానాడు... కార్యకర్తల పండుగ. కుటుంబ వాతావరణంలో, ఇది తమ పార్టీ అని భావించి నిర్వహించుకునే సంబరం.

05/29/2016 - 03:54

హైదరాబాద్, మే 28: రోహిణీ కార్తెలో నిజంగానే రోళ్ల్లు పగిలేలా ఎండలు మండుతున్నాయి. ఎండాకాలం ముగిసే సమయంలో రోహిణీ కార్తె వస్తుంది. ఈ పర్యాయం ఇది మే 25 నుండి జూన్ 8 వరకు ఉంటుంది. గత నాలుగు రోజుల నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గత నాలుగు నెలల్లో లేని విధంగా బాగా పెరిగాయి.

05/29/2016 - 03:54

హైదరాబాద్, మే 28: సంస్కారాన్ని పెంపొందించేది సాహిత్యం అని బిహార్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం రవీంద్ర భారతిలో ఉర్దూ రచయిత్రి జిలానీ బానోకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆయన అందజేశారు.

05/29/2016 - 03:49

మహబూబ్‌నగర్, మే 28: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహబూబ్‌నగర్ మాజీ ఎంపి విఠల్‌రావు శనివారం కన్నుముశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యి ఇంటింటికి వచ్చారు. 1947 నవంబర్ 14 మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం లగచర్ల గ్రామంలో విఠల్‌రావు జన్మించారు.

05/29/2016 - 03:45

హైదరాబాద్, మే 28: పత్రికా రంగం విలువలు కోల్పోతున్నదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజానికి దిశ-దశ నిర్దేశం చేయాలని ఆయన పాత్రికేయులకు పిలుపునిచ్చారు. శనివారం నారద జయంతి సందర్భంగా సమాచార భారతి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

05/29/2016 - 01:51

తిరుపతి, మే 28: ఏపి, తెలంగాణల్లో జలవనరుల వినియోగం, నీటి ప్రాజెక్టుల అంశాలపై విద్వేషాలతో వ్యవహరిస్తే ఇరు రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు చెప్పారు. ఈ విషయంలో సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మహానాడులో రెండవరోజైన శనివారం 11 తీర్మానాలను ఆమోదించారు.

05/29/2016 - 01:50

హైదరాబాద్, మే 28: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు దాదాపుగా ఏకగ్రీవమైనట్టే. తెలంగాణ, ఆంధ్ర రాజ్యసభ స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు ఈనెల 31 చివరి తేదీ. తెలంగాణలో రెండు స్థానాలుంటే, తెరాస వినా మరే పార్టీ పోటీకి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో, ఏకగ్రీవాన్ని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని తేలిపోయింది.

05/29/2016 - 01:46

నల్లగొండ / ఖమ్మం / వరంగల్, మే 28: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. నల్లగొండ జిల్లాలో గాలివాన బీభత్సానికి ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్‌లో ముగ్గురు గల్లంతయ్యారు. వరంగల్‌లో భారీ వృక్షాలు నేలమట్టం కాగా.. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయ.

05/29/2016 - 01:44

హైదరాబాద్, మే 28: తెలంగాణతో కలిసి పనిచేసేందుకు అమెరికాలోని పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. హాలీవుడ్ టాప్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ డ్రీమ్ వర్క్స్ తన వ్యాపార విస్తరణకు తెలంగాణను ఎంపిక చేసుకుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ఐటి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు తన ఐదవ రోజు పర్యటనలో లాస్‌ఏంజిలిస్‌లో వివిధ సంస్థలను కలిశారు.

Pages