S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/29/2016 - 01:41

హైదరాబాద్, మే 28: తెలంగాణ రాష్టవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వచ్చే ఆరు నెలల వ్యవధిలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించనున్నాయి. ఈ రంగంలో మొత్తం కొత్త ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగనుందని, సుమారు 72శాతం ఉద్యోగాలు పెరుగుతాయని టిఎంఐ నిర్వహించిన సర్వేలో తేలింది.

05/29/2016 - 01:32

తిరుపతి, మే 28: నవ్యాంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మించడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని, చాల కష్టతరమైనప్పటికీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా దేశంలోనే ఒక గొప్ప రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని, ఇండియా అంటే అమరావతి గుర్తుకువచ్చేలా రూపొందిస్తామని సి ఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

05/29/2016 - 01:18

తిరుపతి, మే 28: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంకోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానేత ఎన్‌టి రామారావుకు భారతరత్న ఇవ్వాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మహానాడులో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

05/29/2016 - 01:16

మార్తి సుబ్రహ్మణ్యం

05/29/2016 - 01:14

నెల్లూరు, మే 28: ధర్మాసుపత్రి కాస్తా అధర్మాసుపత్రి అయింది... మానవత్వం మురుగుకాల్వలో మంటగలిసిపోయింది... వైద్యం కోసం సర్కారీ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి ఎదురైన అనుభవం తెలిస్తే నివ్వెరపోవాల్సిందే. ఆసుపత్రి సిబ్బంది అతన్ని బెదిరించిన తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రాణం విలువ తెలియని వైద్య సిబ్బంది ఓ రోగిని నిర్ధాక్షిణ్యంగా మురుగుకాల్వపాలు చేసేశారు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది.

05/29/2016 - 01:12

హైదరాబాద్, మే 28: కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శనివారం ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత, మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుతో పాటు ఏపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డిని కలిసి కాపులను బిసిల్లో చేర్చేందుకు తాను చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

05/29/2016 - 01:10

కాకినాడ, మే 28: గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి గ్రీన్ అంబాసిడర్లను నియమించేందుకు తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా తూర్పు గోదావరి జిల్లాలో గ్రీన్ అంబాసిడర్లను నియమిస్తున్నారు. గ్రామాల్లో చెత్త సమస్యను పరిష్కరించే బాధ్యతలను వీరికి అప్పగించనున్నారు.

05/28/2016 - 07:52

హైదరాబాద్, మే 27: మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నిరుద్యోగులను నిండా ముంచుతున్న నేరస్తులను టాస్క్‌పోర్స్ అదుపులోకి తీసుకుని సొత్తును రికవరీ చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు టాస్క్ఫోర్స్ డిసిపి బి. లింబారెడ్డి విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

05/28/2016 - 07:43

హైదరాబాద్, మే 27: ఆంధ్రప్రదేశ్‌లో 26 మంది సీనియర్ ఐఎఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత 15రోజులుగా కొనసాగుతున్న ఈ కసరత్తు శుక్రవారం నాటికి కొలిక్కి వచ్చింది. అటవీశాఖ స్పెషల్ సిఎస్‌గా ఉన్న అశ్విని కుమార్ పరీడాను పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ స్పెషల్ సిఎస్‌గా బదిలీ చేశారు.

05/28/2016 - 07:58

హైదరాబాద్, మే 27:కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. గత సంవత్సరం జలాల వినియోగంపై వివాదం తలెత్తడంతో ఈసారి ముందుగానే రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయం వెల్లడించాలని బోర్డు కోరింది.

Pages