S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/05/2019 - 01:45

వరంగల్, జూన్ 4: కాళేశ్వరం బ్యారేజీ పనులను జూన్ 15 నాటికి పూర్తి చేసి జూలై నెలలో రైతాంగానికి సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ పనుల పురోగతిని మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు.

06/05/2019 - 01:28

హైదరాబాద్, జూన్ 4: పరిషత్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం సృష్టించింది. శాసనసభ ఎన్నికల ఫలితాలే పరిషత్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు పునరావృతమయ్యాయి. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకోవడానికి సరిపడా మెజారిటీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంది.

06/05/2019 - 01:15

మడకశిర, జూన్ 4: రాజకీయాల్లో తనకు ఓపిక ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీలు మారే ప్రసక్తే లేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అధికారం ఉన్నప్పుడు ఒక పార్టీ, లేనప్పుడు మరో పార్టీ మారితే అలాంటి వారికి రాజకీయాలపై సరైన అవగాహన ఉండదన్నారు.

06/05/2019 - 01:13

తాడేపల్లిగూడెం, జూన్ 4: ముంబై ఐఐటీ నుండి సీఎస్సీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి, సివిల్ సర్వీసుకు హాజరై ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని ఏపీ ఎంసెట్-2019 ఇంజినీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన కురిశేటి రవి శ్రీతేజ తెలిపాడు. మంగళవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించిన సందర్భంగా రవి శ్రీతేజ తన మనోగతాన్ని వెల్లడించాడు.

06/05/2019 - 01:10

విజయవాడ, జూన్ 4: ఎట్టకేలకు ఏపీ ఎంసెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి కే. దమయంతి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ విజయరాజు, ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు, కమిటీ చైర్మన్, జేఎన్‌టీయు(కె) వైస్ చాన్సలర్ రామలింగరాజు ఫలితాలను విడుదల చేశారు.

06/05/2019 - 01:07

విజయవాడ: రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో భారీగా ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వివిధ జిల్లాల కలెక్టర్లు సహా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం మూడు జీవోలను జారీ చేసింది. ఇప్పటి వరకూ వివిధ శాఖల్లో కీలక స్థానాల్లో ఉన్న వారిని అంతగా ప్రాధాన్యత లేని శాఖలకు బదిలీ చేసింది.

06/05/2019 - 01:05

విశాఖపట్నం, జూన్ 4: విశాఖ శ్రీ శారదాపీఠాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. నవ్యాంధ్ర రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా విశాఖ వచ్చిన జగన్ శ్రీ శారదాపీఠంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన స్వామీజీతో కొంతసేపు ఏకాంతంగా చర్చించారు.

06/05/2019 - 01:00

అమరావతి, జూన్ 4: అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా అవినీతి నిర్మూలనే తక్షణ కర్తవ్యమని, ప్రస్తుతం అమలులో ఉన్న టెండర్ల ప్రక్రియకు స్వస్తిచెప్పి రివర్స్ టెండరింగ్ విధానాన్ని తెస్తామని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

06/04/2019 - 05:40

సహర్ ఉదయం గం.4:09
ఇఫ్తార్ సాయంత్రం గం.6:59

06/04/2019 - 05:39

విజయవాడ, జూన్ 3: అధికారుల వైఫల్యం కారణంగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి డీఎస్సీ 2018 అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని సోమవారం డీఎస్సీ 2018 అభ్యర్థులు కలిశారు. అధికారుల వైఫల్యంతో తమకు అన్యాయం జరిగిందని డీఎస్సీ అభ్యర్థులు తెలిపారు. అధికారుల తప్పులకు 3 వేల మంది రోడ్డున పడ్డామన్నారు.

Pages