S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/08/2016 - 01:16

విశాఖపట్నం, మే 7: విదర్భ నుంచి తెలంగాణ, కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినందున దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే కోస్తాంధ్రలో సైతం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

05/08/2016 - 01:13

హైదరాబాద్, మే 7: తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకం ఆగుస్టునాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర సర్వీసుల సలహా కమిటీ చైర్మన్ సిఆర్ కమలనాథన్ నేతృత్వంలో సచివాలయంలో శనివారం ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి ఠక్కర్‌లతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

05/07/2016 - 07:23

హైదరాబాద్, మే 6: ఐఏఎస్ అధికారులు ప్రజలతో, ప్రజాప్రతినిధులతో జాగ్రత్తగా, నేర్పరితనంతో మెలగాలని, ప్రజల సమస్యలను ఓపికగా వినాలని, వారితో కలిసిపోయేతత్వాన్ని పెంచుకోవాలని 14వ ఆర్థిక సంఘం చైర్మన్, ఆర్‌బిఐ మాజీ గవర్నర్ డాక్టర్ వై వేణుగోపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఇక్కడ ఐఎఎస్ అధికారుల ఆరు వారాల పునశ్చరణ తరగతుల ముగింపు కార్యక్రమం డాక్టర్ ఎంసిహెచ్‌ఆర్‌డిలో జరిగింది.

05/06/2016 - 13:42

తిరుపతి, మే 5: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు సమర్పించిన తలనీలాల ఈ-వేలం ద్వారా టిటిడికి రూ.7.96 కోట్లు ఆదాయం లభించింది. గురువారం తలనీలాల్లో మొదటి రకం 2700 కిలోలను కిలో రూ.25,563 గా నిర్ణయించి ఈవేలంలో ఉంచగా ఏవీ అమ్ముడు పోలేదు.

05/06/2016 - 13:30

హైదరాబాద్, మే 5: ప్రాజెక్టులపై అంతర్ రాష్ట్ర వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తెలంగాణ అనుసరిస్తున్న దూకుడుకు బ్రేకు పడింది. ఆంధ్ర, తెలంగాణల మధ్య అనుకోని విధంగా తలెత్తిన వివాదాల వల్ల ఇప్పట్లో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగే అవకాశం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

05/06/2016 - 13:29

విజయవాడ, మే 5: భారతదేశంలో 22 రాష్ట్రాలు మరో రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించిన బ్రాహ్మణ సమాఖ్య సర్వేజనా సుఖినోభవంతు... నినాదంతో ఎలాంటి కుల, మతపరమైన రిజర్వేషన్లు లేని అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమం, అభ్యున్నతి కోసం నడుం కట్టింది.

05/06/2016 - 13:29

న్యూఢిల్లీ, మే 5: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదంటూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాసిన లేఖను పత్రికలకు లీక్ చేసిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చివాట్లు పెట్టినట్లు తెలిసింది.

05/06/2016 - 13:28

హైదరాబాద్, మే 5: ఇంజనీరింగ్ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థిని దేవి కారు ప్రమాదంలో చనిపోలేదని, హత్య చేశారని మృతురాలి కుటుంబీకులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

05/06/2016 - 13:27

కొయ్యూరు, మే 5: విశాఖ మన్యం కొయ్యూరు మండలంలో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్ మృతుల్లో ఒకరిని గాలికొండ ఏరియా కమిటీ కమాండర్, జిల్లా కమిటి సభ్యుడు (డిసిఎం) ఆజాద్ అలియాస్ గోపాల్‌గా పోలీసులు గుర్తించారు. మరో మహిళా మావోయిస్టు, ఓ దళ సభ్యుడిని గుర్తించాల్సి ఉంది. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతి చెందగా, మిగతా వారు తప్పించుకున్న విషయం తెలిసిందే.

05/06/2016 - 13:26

రాజమహేంద్రవరం, మే 5: అఖండ గోదావరి నదిలో డ్రెడ్జింగ్ పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 10నుండి డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడానికి కసరత్తు జరుగుతోంది. దీంతో గోదావరి నదిలో ఇసుక మేటలు, దిబ్బలు కరుగనున్నాయి. అంతా అనుకున్నట్టు సాగితే దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించనుంది.

Pages