S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/03/2016 - 04:19

ఒంగోలు,మే 2: మాజీ ఎంఎల్‌సి, యుటిఎఫ్ రాష్టమ్రాజీ అధ్యక్షుడు దాసూరి రామిరెడ్డి సోమవారం ఒంగోలులో మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఒంగోలులోని ఒకప్రైవేటు వైద్యశాలలో చికిత్సపొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. రామిరెడ్డి భౌతికకాయాన్ని స్ధానిక యుటిఎఫ్ కార్యాలయంలో పలువురు సందర్శనార్ధం ఉంచారు. ఆయన భౌతికాయాన్ని పలువురు రాజకీయ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు.

05/03/2016 - 02:10

హైదరాబాద్, మే 2: వైఎస్సార్ కాంగ్రెస్‌పై ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతం కావడంతో, మలిదఫా కాంగ్రెస్‌పై తెరాస దృష్టి సారించింది. ఈనెల 26న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలలోగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు, తెదేపా నుంచి ఒక్కరు తెరాసలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్టు పార్టీ వర్గాల సమాచారం.

05/03/2016 - 02:07

హైదరాబాద్, మే 2: తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని కష్టకాలం ఎదురైంది. కొనఊపిరితో ఉన్న ఆ పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడబోతున్నది. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇద్దరు ఇప్పటికే కారెక్కేయగా.. మిగిలి ఉన్న ఖమ్మం వైకాపా లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (పినపాక) కూడా బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.

05/03/2016 - 02:02

హైదరాబాద్, మే 2: రాష్ట్ర సరిహద్దుల్లో ఇటీవల పెరిగిపోయిన మావోయిస్టుల కదలికలను పొరుగు రాష్ట్రాలతో సమాచార మార్పిడి చేసుకోవటం ద్వారా నియంత్రించేందుకు పోలీసు బలగాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

05/03/2016 - 02:00

విజయవాడ, మే 2: జీవనది కృష్ణా రానురాను అడుగంటిపోతోంది. కృష్ణా, గుంటూరు, పాక్షికంగా ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు.. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు మంచినీటి వనరుగా ఉన్న కృష్ణానదిలో ఇసుక తినె్నలు బయటపడి ఎడారిని తలపిస్తోంది.

05/03/2016 - 01:43

కరీంనగర్, మే 2: పిడుగులు పడినా, భూకంపాలు వచ్చినా తెలంగాణ వాటా జలాలు వాడుకుని తీరుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా చెప్పారు. సమైక్య రాష్ట్రంలోనే సమైక్య పాలకులు విడుదల చేసిన జీవోల ప్రకారం, అధికారులు అధికారిక లెక్కల ప్రకారమే తెలంగాణకు కేటాయించిన 1300 టిఎంసి పైచిలుకు జలాలను కృష్ణా, గోదావరి నదుల నుంచి వాడుకుంటామని తెగేసి చెప్పారు.

05/03/2016 - 01:41

హైదరాబాద్, మే 2: రాష్ట్రంలో వాయిదా వేసిన ఎమ్సెట్, టెట్ పరీక్షల తేదీలను సోమవారం ఖరారు చేశారు. మే 15న ఎమ్సెట్, 22న టెట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇకమీదట అన్ని ప్రవేశపరీక్షలను ప్రభుత్వ కాలేజీల్లో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఎమ్సెట్ హాల్‌టిక్కెట్లు మే 12 నుండి జారీ చేస్తామని, పరీక్ష మే 15న జరుగుతుందని, ఫలితాలను మే 27న ప్రకటిస్తామన్నారు.

05/03/2016 - 01:39

ఆదిలాబాద్, మే 2: దప్పిక తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు లేకపోవడంతో తడారిన గొంతులతో ఇద్దరు పసిపిల్లలు కన్నుమూశారు. గొంతెండిపోయి ఊపిరాడని స్థితిలో సొమ్మసిల్లి కన్నుమూసిన దయనీయ సంఘటన ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలో చోటుచేసుకుంది. గుక్కెడు నీళ్లు దొరికితే బిడ్డల దాహం తీర్చాలని తల్లి తాపత్రయపడింది. పిల్లల ప్రాణాలు కాపాడుకోడానికి అడవంతా గాలించింది.

05/03/2016 - 01:27

హైదరాబాద్, మే 2: దేశవ్యాప్తంగా వైద్య విద్య యుజిలో ప్రవేశానికి ఏకీకృత పరీక్ష- నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మంగళవారం వాదనలు వినిపించనున్నాయి. ఇదిలావుంటే, తెలంగాణ ఎమ్సెట్ మెడికల్ పరీక్ష సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం స్పష్టం చేశారు.

05/03/2016 - 05:03

విజయవాడ, మే 2:‘మేం చేసిన తప్పేంటి? రాష్ట్ర విభజనను మేం కోరుకోలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది. తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఆదుకోవడం లేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలి. దాన్ని ఇవ్వడానికి కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. దీనికి సంబంధించి 30సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర పెద్దల్ని కలిశాను.

Pages