S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/28/2016 - 04:41

సింహాచలం, ఏప్రిల్ 27: పసుపు, కుంకుమను నమ్ముకున్న ప్రతి భారతీయ మహిళ తాను పాటించే ఆచారం, సంప్రదాయానికే విలువనిస్తుంది తప్ప న్యాయస్థానాలు చెప్పాయి కదా అని ఆలయాలకు వెళ్లి అభిషేకాలు చేసే ప్రయత్నం చేయదని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.

04/28/2016 - 04:41

సూళ్లూరుపేట, ఏప్రిల్ 27: మరో చారిత్రక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమైంది. మరి కొన్ని గంటల వ్యవధిలోనే ఇస్రో శాస్తవ్రేత్తలు సొంత నావిగేషన్ వ్యవస్థ అధ్యయానికి సర్వసిద్ధం చేశారు. సరికొత్త స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే మనకు సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.

04/28/2016 - 04:00

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరువును దెబ్బతీసేందుకే ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

04/28/2016 - 03:58

హైదరాబాద్, ఏప్రిల్ 27: దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు పోటీ పడిన ప్రతిష్టాత్మకమైన జెఇఇ మెయిన్ 2016 ఫలితాలను సిబిఎస్‌ఇ బుధవారం సాయంత్రం విడుదల చేస్తూ మార్కులను ప్రకటించింది. త్వరలో వీరికి ర్యాంకులు ఇవ్వనుంది. పరీక్షలో సాధించిన మార్కుల్లో జాతీయస్థాయిలో సాయితేజ తాళ్లూరి (20438099) 345 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడని సమాచారం.

04/28/2016 - 03:58

కాకినాడ, ఏప్రిల్ 27: ఎపి ఎంసెట్-2016ను ఈనెల 29న హైదరాబాద్‌తో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జెఎన్‌టియుకె పర్యవేక్షణలో ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లుచేశారు. ఎంసెట్‌కు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 3 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఎంసెట్ నిర్వహణకు 378 మంది పరిశీలకులు, 123 ప్రత్యేక పరిశీలకులను నియమించారు.

04/28/2016 - 03:57

హైదరాబాద్, ఏప్రిల్ 27: వైకాపాకు సీనియర్ నేత మాజీ ఎంపి డాక్టర్ మైసూరా రెడ్డి గుడ్‌బై చెప్పారు. ఆయన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాలుగు పేజీల లేఖ రాశారు. రాజ్యసభ సీటు కోసం తాను పార్టీని వీడడం లేదని, వైకాపా ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాడే ధ్యాస లేదని, అంతర్గత ప్రజాస్వామ్యం గురించి ఆ పార్టీ నాయకత్వం ఆలోచించడం లేదని ఆయన పేర్కొన్నారు.

04/27/2016 - 06:45

హైదరాబాద్, ఏప్రిల్ 26: ప్రఛండ భానుడి ప్రతాపంతో గత కొద్దిరోజులుగా నిప్పుల కొలిమిగా మారిన నగరం ఉన్నట్టుండి ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచే ఎండ బాగా మండిపోతూ వడగాలుగా వీయటంతో రాత్రి పూట ఉక్కపోత రెట్టింపయిన సమయంలో ఊహించని విధంగా మంగళవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

04/27/2016 - 06:44

తిరుమల, ఏప్రిల్ 26: హైదరాబాదులోని బంజారా హిల్స్‌లో రూ.18కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించామని ఇందుకు మే మొదటి వారంలో శంకుస్థాపన కూడా చేయనున్నట్లు టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈసందర్భంగా తీసుకున్న పలు నిర్ణయాలను చైర్మన్ చదలవాడ విలేఖరులకు వివరించారు.

04/27/2016 - 06:44

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటిలతో పాటు పలు జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన ఆఫ్ లైన్‌లో, 9,10 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఐఐటి జెఇఇ మెయిన్ పరీక్ష ఫలితాలు 27వ తేదీన విడుదల కానున్నాయి. ఇందుకు సిబిఎస్‌ఇ అన్ని సన్నాహాలు చేస్తోంది. 27వ తేదీ వేకువజామునే ఫలితాలను విడుదల చేయాలని సిబిఎస్‌ఇ యోచిస్తోంది.

04/27/2016 - 06:43

సూళ్లూరుపేట, ఏప్రిల్ 26: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో స్వదేశీ నావిగేషన్ సేవలకు సంబంధించిన ఏడో ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వసిద్ధం చేశారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఈ నెల 28న మధ్యాహ్నం 12:50గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ నింగిలోకి ఎగరనుంది.

Pages