S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/02/2016 - 01:22

విజయవాడ, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నిర్ణయించారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పివి రమేష్, ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం భేటీ అయ్యారు.

04/02/2016 - 01:13

33వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారన్నది చంద్రబాబు మాట. లబ్ది కల్పిస్తామన్న ప్రభుత్వం పని అయన తరువాత సవాలక్ష ఆంక్షలు పెడుతుందన్నది రైతుల వాదన. మేం అసలు భూములే ఇవ్వలేదన్నది ఇంకొందరి వాదన. మొత్తానికి అమరావతి శంకుస్థాపన కోసం నిర్మించిన రోడ్డును రైతులు దునే్నశారు. మా భూముల్లో మేం పంటలు వేసుకుంటున్నామంటూ సాగుకు ఉపక్రమించారు. మొత్తానికి వ్యవహారం గందరగోళంగా మారింది.

---

04/01/2016 - 04:09

హైదరాబాద్, మార్చి 31: గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా హర్‌ప్రీత్‌సింగ్ గురువారం బాధ్యతలు చేపట్టడంతో ఆ స్ధానంలో ఇప్పటి వరకు పని చేసిన డాక్టర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు రాజ్‌భవన్‌లో ఘనంగా వీడ్కోలు పలికారు. గత ఏడేళ్లగా రాజ్‌భవన్‌లో సేవలందించిన రమేష్‌కుమార్ సేవలను గవర్నర్ నరసింహన్ ఈ సందర్భంగా జరిగిన వీడ్కోలు సభలో కొనియాడారు.

04/01/2016 - 04:08

హైదరాబాద్, మార్చి 31: జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టుకు ప్రతిపక్ష నేతజగన్మోహన్ రెడ్డి హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు అమలులో ఉంటాయి. హైకోర్టు జడ్జి జస్టిస్ రాజా ఎలాంగో ఈ ఆదేశాలను జారీ చేశారు. ఈ కేసులో ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.

04/01/2016 - 02:49

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.్భసలే, జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసుపై విచారణ నిర్వహించింది. పంట నష్టం కారణంగా పంట రుణాలను ప్రభుత్వాలకు తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలను సమర్పించాలని పిటీషనర్లను అడిగింది.

04/01/2016 - 02:38

హైదరాబాద్, మార్చి 31: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి వెళ్లి ఎండగడతామని, ప్రజా ఉద్యమాలను, ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని ఆయన ధ్వజమెత్తారు.

04/01/2016 - 02:32

న్యూఢిల్లీ, మార్చి 31:కరువొస్తే..కన్నీళ్లేనా..!నివారణ, నిరోధక చర్యలు తీసుకోవడానికి ఇప్పటి వరకూ రాష్ట్రాలు చేసిందేమిటి? కరవుకాటకాలు సంభవిస్తే వాటిని ఎదుర్కొనేందుకు ఏలాంటి ఏర్పాట్లు జరిగాయంటూ కేంద్రాన్ని సుప్రీం కోర్టు గురువారం నిలదీసింది.

04/01/2016 - 02:27

వెంకటాచలం, మార్చి 31 : నెల్లూరు జిల్లా వెంకటాచలం రైల్వే గేటు వద్ద గురువారం రైలు పట్టాలు మధ్య ట్రాలీ లారీ ఇరుక్కోవటంతో సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో కృష్ణపట్నం పోర్టు నుండి నెల్లూరు వైపుకు వెళ్తున్న ట్రాలీ లారీ వెంకటాచలం రైల్వే గేటు వద్ద రైలు పట్టాలు దాటుతోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనబోయి అదుపు తప్పి పక్కకు ఒరిగింది.

04/01/2016 - 02:23

హైదరాబాద్, మార్చి 31: రాష్ట్ర అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ముగిసిన తర్వాత స్పీకర్ మధుసూదనాచారి సభను నిరవధికంగా వాయిదా వేశారు. కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ కూడా సభను నిరవధికంగా వాయిదా వేశారు. 17 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 89 గంటల 42 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది.

04/01/2016 - 02:22

హైదరాబాద్, మార్చి 31: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా మొహం చాటేశారని ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శించారు. గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం సాయంత్రం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణమే కాదు అన్ని విషయాల్లోనూ ప్రతిపక్షాలను కలుపుకుని వెళ్ళాలని సూచించారు.

Pages