S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/30/2016 - 00:55

హైదరాబాద్, మార్చి 29: ఎన్టీఆర్ యుగపురుషుడు అని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ సినిమా రంగం ద్వారా, రాజకీయ రంగం ద్వారా సమాజాన్ని ప్రభావితం చేశారని ఆయన తెలిపారు. అసెంబ్లీలో వివిధ అంశాలపై ఎన్టీఆర్ చేసిన ప్రసంగాల సంకలనాలను స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆదేశంతో అసెంబ్లీ సిబ్బంది పుస్తకాన్ని ముద్రించింది.

03/30/2016 - 00:53

హైదరాబాద్, మార్చి 29: మూడేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం లక్షా 23వేల కోట్ల రూపాయలు అప్పులు చేయనుందని, ఇది రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లు తీర్మానంపై కాంగ్రెస్ తరఫున ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను అప్పుల్లో ముంచెత్తే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

03/30/2016 - 00:51

న్యూఢిల్లీ, మార్చి 27: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఏడాది కాలం పాటు సస్పెన్షన్‌కు గురైన వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా మంగళవారం మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ శాసనసభ చేసిన తీర్మానాన్ని నిలుపుదల చేయడంపై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.

03/30/2016 - 00:48

హైదరాబాద్, మార్చి 29: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో 15మంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను కేటాయించిన తీరును తప్పుబడుతూ ఈ కేటాయింపులను రద్దు చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును క్యాట్ బెంచి బి వెంకటేశ్వరరావు, రంజన చౌదరి వెలువరించారు.

03/30/2016 - 00:47

హైదరాబాద్, మార్చి 29: అల్వాల్ వంతెనపై మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌ను ఢీకొట్టి వంతెనపైనుంచి కారు కిందపడిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఏడుగురు గాయపడ్డారు. చంపాపేటకు చెందిన కృష్ణమాచారి (65) తన కుటుంబ సభ్యులతో హకీంపేటలోని బంధువుల ఇంటికి ఓ శుభకార్యం నిమిత్తం సోమవారం సాయంత్రం వెళ్లారు. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

03/30/2016 - 00:46

హైదరాబాద్, మార్చి 29: ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్టవ్య్రాప్తంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టవ్య్రాప్తంగా 251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం జివో 38 జారీ చేసింది. వీరంతా రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి విడుదలయ్యారు.

03/30/2016 - 00:34

రాష్ట్ర సాధనలో టాగ్ లైన్‌గా ఉన్న నిధులు, నీళ్లు, నియామకాలలో
ఇప్పటికే నిధులు సాధించుకోగలిగాం. నియామకాల ప్రక్రియ
ప్రారంభమైంది. ఇక కోటి ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా
ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది
--

03/30/2016 - 00:30

హైదరాబాద్, మార్చి 29: ఎమ్మెల్యేలకు ఏటా ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులను ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ఏటా కోటిన్నర రూపాయలు విడుదల చేస్తుంటే, ఇకనుంచి మూడు కోట్లు నిర్ణయించింది. 120మంది ఎమ్మెల్యేలు, 40మంది ఎమ్మెల్సీలు మొత్తం 160 మందికి నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ఏటా 480 కోట్లు కేటాయిస్తారు.

03/30/2016 - 00:19

హైదరాబాద్, మార్చి 29: పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు,ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. రైతుల సంక్షేమం కోసం, కృష్ణాడెల్టాను కాపాడేందుకే పట్టిసీమ చేపట్టామని ముఖ్యమంత్రి చెబితే కేవలం నాలుగు టిఎంసిల నీటికోసం 1600 కోట్ల రూపాయలు మట్టిపాలు చేశారంటూ జగన్ ధ్వజమెత్తారు. సుమారు గంటకుపైగా వాదోపవాదాలు జరిగాయి.

03/30/2016 - 00:19

హైదరాబాద్, మార్చి 29: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో సోమవారం జరిగిన పార్టీ 35వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. కాకినాడకు చెందిన ఎన్టీఆర్ మోడల్ స్కూల్ విద్యార్ధిని శ్రీవేణి చంద్రబాబునాయుడుకు పుష్పగుచ్ఛం అందించింది.

Pages